23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

వంగాల వీరబ్రహ్మాచారి(నటుడు)


వంగాల వీరబ్రహ్మాచారి జీవన ప్రయాణం
గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని యండ్రాయి స్వగ్రామం. 1953 జులై 1వ తేదీన వంగాల వీరభద్రాచారి, మహాలక్ష్మమ్మ పుణ్యదంపతులకు 6వ వానిగా జన్మించారు. ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు. 10వ తరగతిపాసై గుంటూరు భాస్కరడీలక్స్ లో చేరి ఉద్యోగం చేశారు. ప్రైవేటు జాబ్ లో చేరక ముందు చాలా కష్టాలు అనుభవించారు. ప్రఖ్యాత నటుడు, బంగారు నందుల గోపి, ఈయన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. భాస్కర డీలక్స్ అధినేత సాంబశివరావుగారు వల్ల ఎపిఎస్ఆర్.టి.సి.లో కండక్టరుగా బాధ్యతలు నిర్వహించారు. పుణ్యస్త్రీ, మనసు తెలిసి మసలేటి మమతల పందిరి వసంత కాలపు తుషార శోభలందిచే అర్ధాంగి ఈశ్వరి. సరస్వతీ దీపికలై ఇంపైన ఇరువురు సంతానం. శ్రీనివాస్, శ్రీలక్ష్మిల మువ్వల సవ్వడి.
వి.వి.బి.ఆచారి. (రంగస్థల, సినీ నటుడు)
ళలపై మక్కువతో ప్రవృత్తిగా అనేక నాటక, నాటికలు ప్రదర్శించారు. చిలకలూరిపేట వద్ద బస్సుదహనం నామనస్సు కలచివేసి ‘‘నన్ను కాల్చకండి’’ అనే బస్సు ఆవేదనను ఏకపాత్రగా రచించి, అధ్భుతంగా ప్రదర్శించి, వృత్తిపట్ల అంకిత భావము చూపారు వీరు. రాష్ట్రంలో పేరుపొందిన గంగోత్రి సమాజంలో సభ్యునిగా చేరి నాయుడు గోపి పర్యవేక్షణలో అనేక నాటికలు, నాటకాలు ప్రదర్శించారు వీరు.
డుగుడిసెలపల్లె, పల్నాటిభారతం, హంసగీతం, మిస్డ్ కాల్, నేటి న్యాయం, చిరిగిన జీవితాలు, నిషిద్ధాక్షరి, క్విట్ ఇండియా, మాయ, తెర, సన్ స్ట్రోక్, దేవుడు, జరుగుతున్న చరిత్ర, శ్రీగురురాఘవేంద్రచరితం, డొక్కాసీతమ్మ, బ్రహ్మంగారి మహత్యం వంటి అనేక నాటకాల్లో పలు కీలకమైన పాత్రలు వీరు పోషించారు. ఊబి, ఆంబోతు, సారీబ్రదర్ ఇది నీకథే, ఒక్కక్షణం ఆలోచించండి, వంటి నాటికలే కాక, నన్నుకాల్చకండి, బావబావమరిది వంటి అనేక రేడియో నాటికలలో పాత్రలు పోషించారు. నటుడు, తస్మాత్ జాగ్రత్త, నన్నుకాల్చకండి, ఆడపిల్లలతండ్రి వంటి ఏకపాత్రల్లో రాణించి అనేకానేక ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. దామిని, చెంబు వంటి టీ.వీ.సీరియల్స్ లో నటించి రాణించారు. అటుపై జాలీగా ఎంజాయ్ చేద్దాం అనే సినిమాలో నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు వి.వి.బి.ఆచారి.
ఎంతమంది కళాకారులు వచ్చినా తడి ఆరని చెయ్యి నా అర్ధాంగి ఈశ్వరిది. అన్నపూర్ణగా పిలవబడటం, కార్యేషుదాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత అని అనిపించుకుంది నా అర్ధాంగి..
యుని సృష్టి అలంకారాలకు నిలయం, కళాకారుల సృష్టి మానవ జీవనోద్ధరణకు నిదర్శనం. అందుకే జీవితానికి దర్పణం రంగస్థలం, దానికి ప్రతిబింబమే నాటకం. అందుకే కళాకారులను ఆదరించి, ఆదుకొని, మనదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడండి..
ణేష్ ఆర్ట్స్ సంస్థ మిత్రడు వరికూటి శివప్రసాద్ దర్శకత్వంలో అంతాభ్రాంతియే, అంతామన సంచికే, తొక్కతీశారు. మొదలైన హాస్యనాటికలలోనే కాక, పెన్షన్ హోమ్ వారి ఇదోయమాటకం హాస్యనాటికలో తనదైన నటనను కనబరచి ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు ఆచారి.
టులు నాయుడుగోపి, మిరియాల ప్రసాదరావు, వరికూటి శివప్రసాద్, దోనేపూడి రవి, ప్రముఖనాటక రచయిత, దర్శకుడు విద్యాధర్ మునిపల్లె, కమలకంటి మోహన్ వలి, టి.పి.నాసరయ్య, ఆకుల నాగేశ్వరరావు, కీ||శే||పెద్ది రామిరెడ్డి, అట్ల రామకృష్ణారెడ్డి, బి.బాబూరావు, టి.ఎన్.రాజు, కె.ఆంటోని, విగ్రహాల రామారావు, బండ్లమూడి రాజ్ కుమార్,  గంగోత్రి సంస్థలోని సభ్యులందరూ వీరి నాటక ఎదుగుదలకు సహకరించినవారే.
మిరియాల ప్రసాద్ గారు స్థాపించిన భారతీ సాంస్కృతిక కళాసేవ సమాజంలో సేవాసదన్ వ్యవస్థాపకుడు శ్రీ మిరియాల గోపికుమార్ నిర్వహించు సామాజిక సేవలలోనూ నిర్వహాకునిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. CH.జయరాంబాబు గారి ద్వారా రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ బి.సి.అర్బన్ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించబడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో అనేక నాటక పరిషత్ లున్నాయి. ఆ సంస్థల్లో పేరు పొందిన సంస్థ గుంటూరు కళాపరిషత్. పరిషత్ అంటే సమయ పాలన. సమయపాలన అంటే గుంటూరు కళాపరిషత్. ప్రతి సంవత్సరం 3రోజులు జరిగే ఆహ్వాన నాటికోత్సవాల్లో వీరు సభ్యునిగా పాల్గొని సేవలు అందిస్తున్నారు.
వీరి జీవితం కళకే అంకితం...  నిరంతరం ప్రజాసేవలో ఉండాలన్నదే వీరి లక్ష్యం.

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు