15, మార్చి 2018, గురువారం

తెలుగు నాటక ఘనాపాటి నాయుడుగోపి

నాయుడుగోపి
రంగస్థల, టీ.వీ.సినీనటుడు దర్శకుడు

ఎంతో మంది నాటకాభిమానులకు రంగస్థల,సీరియల్,సినీ నటుడిగా,దర్శకుడుగా నాయుడు గోపిగా పరిచయమున్న నాయుడు గోపాలరావు 1953మార్చి17న గుంటూరుజిల్లా అమరావతి మండలం యండ్రాయిలో జన్మించారు. ఈయన ప్రకాశరావు, కమలమ్మ దంపతులకు జన్మించారు. 1990 నుంచి 2018 వరకూ వీరు 2600 నాటక ప్రదర్శనలిచ్చారు. ఇప్పటి వరకూ ఉత్తమ నటుడిగా సుమారు 600, ఉత్తమ దర్శకునిగా 400 బహుమతులు అందుకున్నారు. దాదాపు 80 రేడియో నాటికలు ప్రదర్శించిన ఘనత వీరిది. ప్రస్తుతం ఇప్పటి వరకూ ఏ కళాకారుడూ ఒక సంస్థనుంచి ఇన్ని ప్రదర్శనలు చేసినట్లుగా రికార్డు చేయబడలేదు.

బాల్యం – విద్యాభ్యాసం

వీరి బాల్యం అంతా యండ్రాయిలోనే గడిచిపోయింది. 1960-71 వరకూ వీరి విద్యాభ్యాసం కొనసాగింది.  ప్రాధమిక విద్యాభ్యాసం అమరావతి మండలం యండ్రాయిలో, హైస్కూలు విద్య తాడికొండమండలం మోతడకలో శ్రీరామోన్నతపాఠశాలలో కొనసాగారు. వీరి నాటక రంగ ప్రవేశం ఈ స్కూలులోనే జరిగింది. 7వ తరగతిలో వుండగా సముద్రాల వెంకటేశ్వరరావు అనే సైన్సు ఉపాధ్యాయుడు ప్రోద్భలంతో సన్యాసం అనే నాటికలో విద్యార్థి పాత్ర పోషించి ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. అప్పటి నుండి నాటకాలు ప్రదర్శించే వారు. స్కూలు, కాలేజీల్లో కూడా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా తప్పకుండా నాటక ప్రదర్శన జరిగేది. అందులో నాయుడుగోపి వుండేవారు. అటుపై గుంటూరులోని ఎ.సి.కాలేజీలో పి.యు.సి. వరకూ చదువు కొనసాగించారు. గుంటూరు రైలుపేటలో ఒక గది అద్దెకు తీసుకొని తన విద్యాభ్యాసం కొనసాగించారు. ఈ సమయంలోనే ప్రముఖనటుడు రజతమూర్తి తో పరిచయం ఏర్పడింది. అప్పటిలో రజతమూర్తి డ్రమెటిక్ సెక్రటరీగా కొనసాగేవారు. అలా ప్రారంభమైన వీరి స్నేహం కొనసాగుతోంది.


జీవన ‘‘గమనం’’లో...


శ్రీగురురాఘవేంద్రచరితం పద్యనాటకంలో ముల్లాలుగా
నాయుడుగోపి, బి.బాబూరావు, టెంపుల్ సాయి
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వీరి చదువు ఆగిపోయింది. వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరిలో బాలనాగమ్మ, బ్రహ్మంగారి చరిత్ర, హరిశ్చంద్ర వంటి నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. 1972 మార్చి 3న పెదకాకానికి చెందిన దమయంతితో వివాహం జరిగింది. 1975 నుండి పెదకాకానికి నివాసం మార్చవలసి వచ్చింది. అటుపై చాలా కాలం సిటీబస్సు కండెక్టర్ గా జీవనాన్ని కొనసాగించారు. 1980లో పెదకాకానిలో కూల్ డ్రింకు వ్యాపారం ప్రారంభించారు. ఆ సమయంలోనే ప్రముఖ నటులు పెండెం కోటేశ్వరరావు, బాబూరావులతో పరిచయం ఏర్పరచుకున్నారు.  ప్రముఖ నటులు K.S.T. సాయి గారి వద్ద నాటకాలలో వేషాలు వేస్తున్న సమయంలో గుంటూరు శాస్త్రి పరిచయం ఏర్పడటంతో నాటకంలో, నటనలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు. 1985 నుండి ప్రముఖ రచయిత,నటుడు పాటిబండ్ల ఆనందరావు, వేముల మోహనరావులతో పరిచయం ఏర్పడింది. దాదాపు 5 సంవత్సరాలు కలిసి నాటక ప్రదర్శనలు చేశారు.


గంగోత్రి ఆవిర్భావం


ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా కేంద్రానికి చేరువగా వున్న పెదకాకాని గ్రామంలో 1990లో గ్రామీణ కళాకారులతో గంగోత్రి అనే నాటక సమాజాన్ని స్థాపించి అనేక నాటక ప్రదర్శనల ద్వారా సామాజిక చైతన్యానికి ఈయన కృషి చేశారు. పల్లె ప్రాంతాల నుంచి కూరగాయలు అమ్మకునే చిన్న వ్యాపారులు సన్నకారు రైతులు, రైతుకూలీలు, చేతివృత్తుల వాళ్ళు, సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు ఇలా దాదాపు 200 మందిని నటీ,నటులుగా తీర్చదిద్దారు వీరు. గుంటూరు జిల్లాలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో మరియు ఇతర రాష్ట్రాలైన బరంపురం, ఖరగ్ పూర్, భిలాయ్, చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చి గ్రామీణ సాంస్కృతిక  అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు ఈయన. గంగోత్రి సమాజం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రీసోర్స్ సెంటర్ బెంగుళూరు వారి సౌజన్యంతో థియేటర్ వర్క్ షాపు నిర్వహించి అనేక మంది ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇప్పించింది.
పచ్చ చంద్రుడు నాటికలో పాత్రకు ప్రాణం పోస్తూ
జోతి, గుమ్మడి నాగేశ్వరరావు, నాయుడు గోపి

పేరెన్నిక గన్న నాటకాలు


  1. డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్
  2. తర్జని
  3. సహారా
  4. నిషిద్దక్షరి
  5. నీతి చంద్రిక
  6. మానస సరోవరం
  7. కాదుసుమాకల
  8. పతాక శీర్షిక
  9. మనసు-వయసు
  10. అహల్య
  11. నరవాహనం
  12. వానప్రస్థం
  13. పడమటిగాలి
  14. సారీబ్రదర్ ఇది నీ కథే
  15. ఏడుగుడిసెల పల్లె
  16. రైలాగని స్టేషన్
  17. మాయ
  18. పల్లెపడుచు
  19. శిఖరాల వెనక
  20. బృందావనం
  21. అక్షర కిరీటం
  22. చితి
  23. పరుసవేది
  24. మనస్సాక్షి
  25. మాస్క్
  26. గులాబిముల్లు
  27. డొక్కాసీతమ్మ
  28. గాలిబ్రతుకులు
  29. అరసున్నా

పద్యనాటకాలు



  1. పల్నాటిభారతం
  2. హంసగీతం
  3. శ్రీ వేమన యోగి
  4. గయోపాఖ్యానం
  5. శ్రీ గురురాఘవేంద్రచరితం
  6. శ్రీ రామాంజనేయ యుద్ధం
  7. బాలనాగమ్మ
  8. తారకాసుర
  9. శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం

బంగారు సింహ తలాట బహూకరణ పొందుతూ నాయుడుగోపి

నాటికలు

  1. దర్పణం 
  2. దహతిమమ మానసం 
  3. నవ్వండీ ఇది విషాదం
  4. శ్వేతపత్రం 
  5. యద్భవిష్యం 
  6. దంత వేదాంతం
  7. శ్రీముఖ వ్యాఘ్రం
  8. ఆదివారం 
  9. ఏక్ దిన్ కా గరీబ్
  10. శ్రీచక్రం 
  11. హింసధ్వని
  12. వేయిపడగలు
  13. భూమిపుత్రుడు
  14. ఎడారి కోయిల
  15. ఓనమాలు
  16. చుట్టంచూపు
  17. ఐక్యూ
  18. భారతరత్న
  19. ప్రేమాతురాణాం
  20. ఆంబోతు
  21. మిస్డ్ కాల్
  22. ఊబి
  23. నేర్పరి సుమతి
  24. ఓంశాంతి
  25. ఆసేతు హిమాచలం
  26. స్వర్గారోహణం
  27. బుద్ధచరిత్ర
  28. రివర్స్ గేర్
  29. ఓదార్చేశక్తి
  30. ముగింపులేని కథ
  31. ప్రవాసం
  32. నువ్వు+నేను-పేమ=పెళ్ళి
  33. నష్టపరిహారం
  34. గమనం
  35. అనగనగా ఒక పులి
  36. శకునపక్షి
  37. బంగారం
  38. బలేవాళ్ళే వీళ్ళు
  39. పైపంట
  40. జన్మసిద్ధాంతం
  41. లజ్జ
  42. పిల్లిపంచాంగం
  43. దగ్ధగీతం
  44. సన్నజాజులు
  45. పిపాస
  46. పచ్చచంద్రుడు


టి.వీ. సీరియల్స్

  1. మిస్టర్ బ్రహ్మానందం
  2. హిమబిందు
  3. మట్టిమనిషి
  4. సత్య
  5. పద్మవ్యూహం
  6. బాంధవ్యాలు
  7. మల్లీశ్వరి
  8. మహాలక్ష్మి
  9. లయ
  10. శ్రీ ఆంజనేయం
  11. ఆకాశగంగ
  12. లేత మనసులు
  13. సుడిగుండాలు
  14. మనసు మమత
  15. దామిని

సినిమాలు


  1. ప్రజాతీర్పు
  2. యూనియన్ లీడర్
  3. సింగన్న
  4. తెలుగోడు
  5. నేనున్నాను
  6. భద్రాద్రి రాముడు
  7. శైలజా కృష్ణమూర్తి
  8. లీలామహల్ సెంటర్
  9. శేషాద్రినాయుడు
  10. ఒక్కడే కానీ ఇద్దరు
  11. పాండు
  12. ఓరి నీ ఇల్లు బంగారం కాను
  13. నిమిషం
  14. ఆపదమొక్కులవాడు
  15. మహాత్మ
  16. లీడర్
  17. దమ్ము
  18. జాలీగా ఎంజాయ్ చేద్దాం
  19. దృశ్యం
  20. ఖైదీ నెంబర్ 150

నాటకసీమలో సాధించిన ఘనవిజయాలు


మట్టిమనిషి సీరియల్ లో అక్కినేని నాగేశ్వరరావుతో నాయుడు గోపి

  • 1996,97,98 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటక నవదినోత్సవంలో పాల్గొని నాటిక విభాగంలో ఉత్తమ నాటికగా ‘‘హింసధ్వని’’ నాటికకు బంగారు నంది, ఉత్తమ నటుడిగా కాంస్యనంది.
  • 1999 సంవత్సరంలో నంది నాటక సప్తాహంలో పాల్గొని నాటక విభాగంలో ఉత్తమ నాటకంగా ‘‘వానప్రస్థం’’ నాటకానికి బంగారు నంది, ఉత్తమ దర్శకునిగా కాంస్యనంది.
  • 1999 సంవత్సరంలో నవంబర్ 1, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీ, ఎ.పి.భవన్ లో ‘‘హింసధ్వని’’ నాటిక ప్రదర్శన
  • 2000 సంవత్సరంలో జాతీయ రేడియో నాటకోత్సవాలలో ‘‘హింసధ్వని’’ ప్రసారానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి జాతీయస్థాయి ప్రధమ బహుమతిని సాధించి పెట్టారు. 
  • 2000 సంవత్సరంలో నంది నాటకోత్సవాల్లో పాల్గొని నాటిక విభాగంలో ‘‘ఎడారి కోయిల’’ నాటికకు ఉత్తమ దర్శకునిగా కాంస్య నంది.
  • 2000 లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి భరత్ రంగ్ మహోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ‘‘హింసధ్వని’’ నాటిక ప్రదర్శన.
  • 2001లో మానవ వనరుల శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూభిల్లీ వారి సౌజన్యంతో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో వరుసగా మూడు రోజులు (ఏప్రిల్ 15,16,17 తేదీల్లో ) పడమటిగాలి, నాటకం ప్రదర్శన.
  • 2004లో నంది నాటకోత్సవంలో ఉత్తమ ప్రదర్శనగా బంగారు నంది, దర్శకునిగా కాంస్యనంది, ‘‘ఆంబోతు’’ నాటికకు పొందటం జరిగింది.
  • 2005లో నంది నాటకోత్సవంలో ‘‘పల్నాటిభారతం’’ పద్యనాటకానికి బంగారు నంది దర్శకునిగా కాంస్యనంది.
  • 2005లో సాంస్కృతిక శాఖ , గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారి సౌజన్యంతో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో వరుసగా మూడు రోజులు ‘‘పల్నాటిభారతం’’ పద్యనాటక ప్రదర్శన.
  • 2011లో నంది నాటకోత్సవాలలో పాల్గొని నాటిక విభాగంలో ‘‘నష్టపరిహారం’’ నాటికకు ఉత్తమ ద్వితీయ ప్రదర్శనకు ‘‘రజితనంది’’.
  • 2013లో నంది నాటకోత్సవాలలో శ్రీ గురురాఘవేంద్ర చరితం పద్యనాటకానికి కాంస్యనంది.
  • 2013లో నంది నాటకోత్సవాలలో డొక్కా సీతమ్మ నాటకమునకు బంగారు నంది, ఉత్తమ దర్శకునిగా కాంస్యనంది.
  • 2016లో నంది నాటకోత్సవాలలో అక్షరకిరీటం నాటకానికి బంగారునంది, ఉత్తమ దర్శకునిగా కాంస్య నంది పొంది యున్నారు.

నటజీవితంలో ప్రధాన ఘట్టాలు

2015: మే 9వ తేదీన సంస్కృతి గుంటూరు వారి వెండి కిరీట బహూకరణ మరియు రంగస్థల కృషీవలుడు బిరుదు ప్రదానం.
2012: ఆల్ ఇండియా పోస్టల్ అసోసియేషన్ ద్వారా మహానటులు ఎస్.వి.రంగారావుగారి జీవనసాఫల్య పురస్కారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతికశాఖ మరియు ఎఫ్.డి.సి. వారు సంయుక్తంగా తెలుగు నాటక రంగానికి అత్యుత్తమమైన సేవలందించినందుకు ప్రశసింస్తూ 2012 సంవత్సరం రాష్ట్రస్థాయి కందుకూరి విశిష్ట పురస్కారం.
2010 లో జానపద కళాబ్రహ్మ కర్నాటి లక్ష్మీనరసయ్యగారి జీవనసాఫల్య పురస్కారం.
2012లో గుంటూరు మహిళా కళాశాల వారిచే “వివేకానంది పురస్కారం.
2012లో సత్తుపల్లి కళాస్రవంతి వారిచే "ఉత్తమ నటుడు” పురస్కారం.
2012 లో దుగ్గిరాల సోమేశ్వరరావు రంగస్థల పురస్కారం.
2012లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి “తెలుగు రంగస్థల దినోత్సవం” - కందుకూరి వీరేశలింగం రంగస్థల పురస్కారం
2012: తిరుపతిలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలలో సన్మానం.
2011: సత్యహరిశ్చంద్రీయం నాటకం శతవసంతోత్సవ సందర్భంగా సువర్ణసింహతలాట బహూకరణ.
2009: ఆంధ్ర నాటక కళాసమితి, విజయవాడ వారి “కళారంగభీష్మ” కర్నాటి లక్ష్మీనరసయ్య రంగస్థల పురస్కారం. 2008: ఆల్మైటీ సాంస్కృతిక సంస్థ విజయవాడ వారి స్వర్గీయ సి. నాగభూషణం అవార్డు.
2008: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం.
2007: డి.యల్. కాంతారావు పోస్టల్ ఎంప్లాయిస్ కళాపరిషత్ తెనాలి వారి డాక్టర్ ఎన్టీఆర్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్.
2005:తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నటుడిగా ధర్మనిధి పురస్కారం
2000:యువకళావాహిని హైదరాబాద్ వారి శ్రీహరిమూర్తి మెమోరియల్ బంగారు పతకంతో సత్కారం
2000,1999, 1998 సంవత్సరాలకు గాను కళావాణి రాజమండ్రి వారి అత్యుత్తమ దర్శకుడిగా పురస్కారం.
2000,1999, 98 సంవత్సరాలు వరసగా ఎల్ విఆర్ క్లబ్, గుంటూరు నాటిక పోటీలలో ఉత్తమ ప్రదర్శన
2000: మినర్వ రెసిడెన్షియల్ కాలేజి ప్రత్తిపాడు, తూర్పుగోదావరి జిల్లా 'సత్య' అవార్డు పురస్కారం.
1999:మద్రాస్ ఆంధ్రా క్లబ్ నాటక పోటీలలో ఉత్తమ దర్శకుడిగా బంగారు పతకం.
1996:అన్నం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చీరాల వారిచే 'మంచికి సత్కారం'.
1995,1994, 1993 సంవత్సరాలకు గాను పరుచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలలో వరసగా ఉత్తమ నటుడిగా 'హ్యాట్రిక్.
1994,1993,1992 సంవత్సరాలకు ప్రగతి కళా పరిషత్ సత్తెనపల్లి వారు నిర్వహించిన నాటక పోటీలలో వరసగా ఉత్తమ నటుడిగా హ్యాట్రిక్.
1994: కళాసాగర్ మద్రాస్ ఉత్తమ నటుడు అవార్డ్ (తైవార్షిక నాటకోత్సవాలు)
1994: కాకతీయ కళాపరిషత్ - నాగభైరువారి పాలెం వారిచే విశిష్ట నటుడిగా బంగారు పతకం.
1993: ప్రియదర్శిని ఫైన్ ఆర్ట్స్ విశాఖపట్నం నుండి ఉత్తమ నటుడు, దర్శకుడు.
1993: యంగ్ మెన్స్ హ్యాపీక్లబ్ కాకినాడ నుండి ఉత్తమ నటుడు దర్శకుడు.
1985: కళాసాగర్ మద్రాస్ అవార్డు
1983: ఆంధ్రనాటక కళాపరిషత్ ” ఒకేసారి నాటక, నాటిక విభాగాలలో ఉత్తమ నటుడుకు రెండు బహుమతులు పొందిన నటుడు.

1982: సంగీత నాటక అకాడమీ' పాలకొల్లు వారి అవార్డు.
1981: కళా సదస్సు' చిలకలూరిపేట వారి కందిమళ్ళ కమలనాభుడు స్మారక ఉత్తమ నటుడు అవార్డు.


అవార్డులతో గౌరవించిన ప్రముఖ సంస్థలు

  • ఫిలింనగర్, రైల్ కళారంగ్, ఎ.జి. ఆఫీస్, బి. హెచ్.ఇ.ఎల్., హెచ్.ఎం.టి హైదరాబాద్.
  • షిప్ యార్డ్, పోర్టు, కోరమండల్ విశాఖపట్నం. 
  • నగరపాలకసంస్థ, రైల్వే ఇన్స్టిట్యూట్, విజయవాడ. 
  • యన్ కెయన్ కళావాణి రాజమండ్రి
  • ఈ మూలారెడ్డి పరిషత్ రామవరం
  • లలితకళాంజలి దాసరి కల్చరల్ అకాడమి పాలకొల్లు. 
  • తెనుగు దర్బార్ ఏలూరు. 
  • స్పందన, పొన్నూరు కళాపరిషత్, పొన్నూరు. 
  • యన్.టి.ఆర్. కళాపరిషత్ వింజనంపాడు మరియు ఒంగోలు, కళాసాగర్ అద్దంకి.
  • నెఫ్జ్యా కామేశ్వరావు స్మారక కళా పరిషత్ నెల్లూరు. 
  • సాంస్కృతిక సమ్మేళనం గూడూరు. 
  • అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కర్నూలు. 
  • రైల్వే ఇన్స్టిట్యూట్ గుంతకల్లు.
  • అరుణ కల్చరల్ అసోసియేషన్ భద్రాచలం.


అందుకున్న సన్మానాలు కొన్ని

  • కళాంజలి గుంటూరు కళాపరిషత్, సంస్కృతి, హిందూ కళాశాల, గుంటూరు. 
  • ఉషోదయ కళాపరిషత్, ప్రగతి కళాపరిషత్, సత్తెనపల్లి. 
  • చైతన్య కళా స్రవంతి అబ్బినేనిగుంటపాలెం. 
  • నటరాజ నాట్యమండలి మంగళగిరి. 
  • ది అమెట్యూర్ డ్రమటిక్ అసోసియేషన్ సిఆర్ క్లబ్ చిలకలూరిపేట.
  • కాళిదాస కళారాధన సమితి కావలి.
  • సాంస్కృతిక సమ్మెళనం గూడూరు. 
  • ఈ రంగస్థలి, కల్పనా కళానికేతన్, నర్సరావుపేట.
  • ఫైన్ ఆర్ట్స్, కోన ప్రభాకరరావు కళాపరిషత్, బాపట్ల. 
  • కొండవీటి కళాపరిషత్, లింగారావు పాలెం. 
  • కళా సమాఖ్య, చీరాల. 
  • ఈ జాహ్నవి, అనపర్తి. 
  • ఆంధ్రప్రదేశ్ ఔత్సాహిక రంగస్థల కళాకారుల సమాఖ్య, గద్దనాపల్లి.
  • ఈ సంస్కృతి - గుంటూరు.
  • పట్టణ పౌరాణిక రంగస్థల కళాకారుల వేదిక-గుంటూరు.

పుస్తక ప్రచురణ

  • ఔత్సాహిక సమాజాలవారికి, భవిష్యత్ తరాల రచయితలకు, నటులకు, విమర్శకులకు, అందుబాటులో ఉండేలా గంగోత్రి ప్రదర్శించిన వివిధ నాటకాలు, నాటికలు కలిపి నాటికా సంకలనం పాటిబండ్ల ఆనందరావు నాటక సంపుటాలుగా ప్రచురించి గుంటూరులో 15 సెప్టెంబర్ 1996 సంవత్సరంలో కావ్యావిష్కరణ సభ జరిపి రచయితలను ఘనంగా సత్కరించారు. 
  • 2007 సంవత్సరంలో గంగోత్రి 17ఏళ్ళ కళాప్రస్థానం పుస్తకప్రచురణ. పుస్తకావిష్కరణ సందర్భంగా 10 మంది నాటక రచయితలకు, 16మంది సీనియర్ కళాకారులకు సన్మానం మరియు 200 మంది కళాకారులకు ఆత్మీయ సత్కారం.
  • 2015 సంవత్సరంలో జూన్ 5, 6, 7 తేదీలలో గంగోత్రి 25 సంవత్సరాల కళాప్రస్థాన రజతోత్సవ వేడుకలలో 22 మంది రచయితలకు, 60 మంది కళాకారులకు సన్మానాలు మరియు భూమిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ.

నిర్వహిస్తున్న బాధ్యతలు

గుంటూరు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయి గ్రామ సహకార పరపతి సంఘ అధ్యక్షులుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు.
మాజీ సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ గా విధులు నిర్వహించారు.
గుంటూరు జిల్లా సాంస్కృతిక మండలి సభ్యుడు.
రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు గౌరవ సభ్యులు
గుంటూరు కళాపరిషత్ ఉపాధ్యక్షులు
2010 టి.వి. నంది అవార్డుల కమిటీ జ్యూరీ మెంబర్.

డి.ఎల్. కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్ గౌరవాధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఎంప్లాయీస్ కళాపరిషత్ అధ్యక్షులు
గుంటూరు L.V.R.& సన్స్ రీడింగ్ రూమ్ వారు గౌరవ సభ్యత్వం ఇచ్చి గౌరవించారు.

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు