రంగస్థల నగ్నచిత్రం 2.8


రంగస్థల నగ్నచిత్రం 2.8
(కొనసాగింపు)
రంగస్థల నగ్నచిత్రం 2.7 ని కూడా నేను ఊహించని స్థాయిలో వీక్షించిన పాఠకదేవుళ్ళకి కృతజ్ఞతాభివందనాలు.. దీనిని కూడా మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా మంది మిత్రులు నాకు ఫోన్లద్వారా తమతమ ఆవేదనను తెలియజేస్తున్నారు. నిజానికి వారంతా కూడా ప్రత్యక్షంగా స్పందిస్తే బాగుంటుంది.. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రత్యక్షంగా బహిర్గతం చేస్తే బాగుంటుంది. అందరికీ తెలిస్తేనన్నా అరాచకం చేస్తున్నవారికి కనువిప్పు కలుగుతుందేమో చూడాలి.. ఇటీవలి కాలంలో నెల్లూరుకి సుధాకర్ అనే మిత్రుడు తన ఆవేదనను ఒక వాట్సప్ సమూహంలో వెలిబుచ్చారు. అతని ఆవేదనను అర్థం చేసుకోకుండా స్పందించిన వారూ వున్నారు.. ఆవేదనను అర్థం చేసుకున్న వారూ ఉన్నారు. డి.రామకోటేశ్వరరావు అనే ప్రాథమిక పరిశీలకులు, న్యాయనిర్ణేత, అలాగే కొల్లి మోహనరావు గారు ఇచ్చిన సమాధానాలు కొంత ఊరట కలిగించాయనే అనుకోవచ్చు. అయితే పరిష్కారం మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పుకోవాలి. ఆయన నాటకరంగ పెద్దల ముందుంచిన సమస్యకి పరిష్కారంగా నాశైలిలో, నా కోణంలో ముందు ముందు అంకాలలో వివరంగా పేర్కొంటాను. ఇక తెలుగు నాటకరంగంలో పబ్లిసిటీ స్టంట్స్ ఎలా జరుగుతున్నాయో మరికొన్నిచూద్దాం.. ఇప్పటి వరకూ నేను చెప్పినవి చాలా తక్కువే.. ఇంతకు మించి కూడా పబ్లిసిటీ స్టంట్స్ తెలుగు నాటకరంగంలో జరుగుతున్నాయి.
·         తాము నిర్వహించే పరిషత్తులకి ప్రత్యేకించబడిన (కొంతమంది న్యాయనిర్ణేతలుగా వచ్చే వ్యక్తులు నాటికలను సూచించే ఆనవాయితీ వున్న పరిషత్తులు కొన్ని వున్నాయి.) వారిని న్యాయనిర్ణేతలుగా ఆహ్వానిస్తారు. వారి మెప్పు పొందే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లతో ప్రసన్నం చేసుకుంటారు. (కొద్దిమొత్తంలో ఖర్చుపెడతారు.) ఇదంతా పెట్టుబడే.. ఉపయోగమేంటి? 1. నాటకరంగంలో ఎక్కువ ప్రదర్శనలు చేసి అత్యున్నత స్థాయిలో వున్నామని గుర్తింపు పొందటం కోసం. 2. నాటకంపై పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాబట్టుకోటం కోసం 3. బ్రతుకు తెరువు కోసం 4. పబ్లిసిటీ సరదా కోసం.
·         చాలా మంది చాలాసార్లు అందరితో చెప్పేమాట ఒక్కటే.. నాటకరంగాన్ని ప్రేమిస్తున్నామనీ, నాటకం అంటే ప్రాణమనీ, నాటకం కోసం జీవితాన్నే త్యాగం చేశామనీ, చేస్తున్నామనీ పెద్దపెద్దమాటలు చెప్పి, చప్పట్లు కొట్టించుకొని సింపతీ సంపాదించుకోటానికి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోటానికి చేసే పబ్లిసిటీ స్టంట్.
·         కొంతమంది హవా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లోనూ, అందులో వుండే వ్యక్తులతోనూ వుంటుంది. వారు వారికి తోచిన వారిని ఆయా విభాగాల్లో ప్లేస్ మెంట్ చేయటంలో పడే తపన, తాపత్రయం, ప్రలోభాలు ఇత్యాది అంశాలలో ఏమాత్రం వెనుకడుగు వేయరు. పై విధంగానే వారు ప్రసన్నం చేసుకోటానికి ఆయా వ్యక్తులకు ఆయా సౌకర్యాలు చూసి, వారి కోర్కెలు నెరవేర్చటంలో ముందుంటారు. ఇదంతా ఎందుకు? కేవలం పబ్లిసిటీ కోసం... అవార్డులు, రివార్డులు ఇంతకు ముందు కాలంలో వ్యక్తి యొక్క ప్రతిభను బట్టి ఇచ్చేవారు.. కానీ ఇప్పుడో..?
·         కొన్ని నాటక పరిషత్తులుంటాయి.. వారు మాత్రం ప్రపంచం ఎలా నడుస్తున్నా.. మేం మాత్రం ఇలాగే నడుస్తాం.. మెరిట్ కి పెద్దపీట వేస్తాం.. ఎవరేమైనా అనుకోనీ.. వారికిష్టముండి నాటిక వేస్తే వేయించుకుంటాం.. ఏదైనా మెరిట్ ఆధారంగానే జడ్జిమెంటు వుంటుంది.. అనే పరిషత్తులుంటాయి.. వీరిదగ్గర మాత్రం సోకాల్డ్ బడాసమాజాల ఆటలు సాగవు. అందుకే అక్కడ వీరి నాటికలు, నాటకాలు వంటివి వుండవు. అలాంటి పరిషత్తులన్నింటికీ వీరు పెట్టుకున్న ముద్దుపేరేంటంటే చిన్న పరిషత్తులు. అలాంటి చోట్ల మేమే నాటకాలు ఆడము అని. ఎలా వుంటుందంటే కిందపడ్డా కూడా మాదే పైచేయి అన్న విధంగా వుంటుంది వీరి వ్యవహారశైలి.
ఈ విషయంలో చాలా మంది నన్ను కూడా అడగచ్చు.. నీకూ ఉత్తమ రచయితగా, అలాగే ప్రొడక్షన్స్ లాంటివి వచ్చాయి కదా... నువ్వూ పబ్లిసిటీ చేసుకున్నావ్ కదా... నువ్వూ ప్రలోభాలకు గురిచేసే తీసుకున్నావా..? అని. నేను గతంలో కొత్తనీరు నాటిక ప్రదర్శించాను.. అక్కడ వచ్చిన ప్రైజులు, వివరాలు అన్నీ చూసుకుంటే మీకే అర్థమౌతుంది.. నేనెలాంటి పరిషత్తులలో ప్రదర్శించానో.. ఎలాంటి పరిషత్తులలో ప్రదర్శిస్తే నాకు ఎలాంటి బహుమతులు వచ్చాయో... ఎక్కడ బహుమతులు రాలేదో... అన్నీ మీకే తెలుస్తాయి.
అవును నేనూ వీరితో పోల్చుకుంటే తక్కువేం కాదు. నేనూ పబ్లిసిటీ చేసుకున్నాను. ఎలా అంటే ఫలానా చోట నా నాటిక ప్రదర్శన జరుగుతుందని పబ్లిసిటీ చేసుకున్నాను. ఫలానాచోట ప్రైజులొచ్చాయని పబ్లిసిటీ చేసుకోలేదు. రిజల్ట్ కాగితాలు వాట్సప్ సమూహాల్లో ఆయా పరిషత్ నిర్వాహకులే పెట్టారు. ప్రదర్శింపబడిన పేపర్ కటింగ్స్ పెట్టి పబ్లిసిటీ చేసుకున్నాను.. కానీ రిజల్ట్ పోస్ట్ చేసి పబ్లిసిటీ చేసుకోలేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సమూహాల్లో ఫార్వర్డ్ చేసి వుండొచ్చు..
అయితే ఇక్కడ పబ్లిసిటీ చేసుకుంటుంది ఎవరు? ప్రలోభాలకు గురిచేసి ప్రదర్శనావకాశాలు చేజిక్కించుకుంటుంది ఎవరు? తమ ప్రదర్శనకు అడ్డుగా వుంటుందని భావించి కొన్ని నాటికలను స్క్రూటినీ లెవల్ లోనే తమ వారితో ఏరిపారేయిస్తున్న, ఏరేస్తున్న ఘనులు ఎవరు?
టోటల్ గా ఈ సంచిక ద్వారా నేను చెప్పదలచుకున్న అంశం ఏంటంటే.. ఒక మంచి నాటకం చచ్చిపోకూడదు, ఒక చెడ్డ నాటకం ప్రోత్సహించబడకూడదు అని. నేను చేస్తున్న ఈ యుద్ధం నా కోసం కాదు.. టాలెంట్ వుండి అవకాశాలు రాక.. అవకాశం కోసం అర్రులు చాస్తూ తెలుగు నాటకరంగంవైపు ఎదురు చూస్తున్న ఆయా నాటకసమాజాలకోసం,
(కొనసాగింపు)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు