రంగస్థల నగ్నచిత్రం 2.9

రంగస్థల నగ్నచిత్రం 2.9

(కొనసాగింపు)

గత రాత్రి తెలుగు డ్రామా అనే గ్రూపులో భారతుల రామకృష్ణ అన్నగారు స్పందించిన తీరు అద్భుతంగా వుంది. అలా స్పందించినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. కనీసం చర్చ చెయ్యటానికి ధైర్యంగా ఒకరు ముందుకు వచ్చారు. కానీ అదేం దురదృష్టమో కానీ చాలా మంది ఫోన్లలో మాత్రమే స్పందిస్తూ.. రచన బాగుంది.. కొనసాగించు అని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే నాటకరంగానికి నాలాంటి వాడు ఒకడుండాలని కూడా పొగడ్తల ఝల్లులు కురిపిస్తున్నారు. మీకు తోచిన అంశాలు కింద కామెంట్ బాక్సులో రాస్తే మరింత మందికి ఆదర్శమవ్వటంతోపాటు  సమస్యపై చర్చ జరిగే అవకాశం వుంటుంది. కామెంట్ బాక్సులో స్పందించమని మనవి. ఈ విషయమే రంగస్థలనగ్నచిత్రం 1వ సెషన్ లో చెప్పాను. అయితే చాలా మంది నాతో అన్నమాట ఏంటంటే అక్కడ పోస్టింగులు ఎలా చెయ్యాలో తెలియటం లేదు అని.. సరే వారికి చెబుతున్నాను. మీరు మీ గూగుల్ అకౌంటుతో నా బ్లాగులోకి లాగిన్ అవ్వండి. అప్పుడు మీరు కామెంట్ బాక్సులో మీమీ కామెంట్స్ రాయండి.. దీనిమీద త్వరలో ఒక వీడియో కూడా చేసి అందరికీ పోస్టు చేస్తాను. దానివల్ల కామెంట్స్ పోస్టు చెయ్యటం తెలియనివారు దీనిని చూసి నేర్చుకునే అవకాశం వుంటుంది.
ఇక పాయింట్ లోకి వస్తున్నాను.. భారతుల రామకృష్ణ అన్నగారు స్పందించిన విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
ఇక్కడ అన్నగారు నామీద ప్రేమతో నేను నిందలపాలవ్వకూడదని సలహా ఇచ్చారు. దీనిని నేను స్వాగతిస్తున్నాను. నాకన్నా ముందు నుంచే నాటకరంగంలో వున్న పెద్దలకు ఏఏ మార్గాల్లో ప్రమోట్ చేసుకుంటున్నారో తెలియని అంశమా అది. ఒక వేళ నిజంగా తెలియక పోతే జరుగుతున్న అంశాలు నా ద్వారా తెలుసుకున్నందుకు సంతోషం. నిప్పు లేనిదే పొగరాదన్న నానుడి వుండనే వుంది. అసలేమీ జరగకుండా  ఇలాంటి అంశాలు ప్రచారంలోకి రావుకదా.. ‘‘అయితే... అగ్ర సమాజాలు ఇలాచేస్తున్నాయని  నీకందిన సమాచారాన్ని అనుసరించి చెప్పావు. బాగానే ఉంది. కానీ... ఆ అగ్రసమాజాలు ఏవి...? నీకా సమాచారం అందించిన వారెవరు...వారి విశ్వసనీయత ఎంత అనే విషయం గౄపులోని వారికీ తెలియాలి...లేకపోతే... నువ్వు కూడా నీ పబ్లిసిటీ కోసమే సెన్సేషన్ కోసం ఏదో ఇలా వ్రాస్తున్నావని...అపోహ పడే అపకాశం ఉంది... ’’ అన్న వాక్యం ద్వారా వారికి నా నాటకరంగ భవిష్యత్తు దెబ్బతింటుందనే ఆవేదన, నాపై గల ప్రేమాభిమానాలు స్పష్టంచేస్తున్నాయి .. ఎందుకంటే తన తమ్ముడు ఎక్కడ అప్రదిష్ఠపాలవుతాడో అన్న ఆవేదన ఒక శ్రేయోభిలాషిగా, ఒక అన్నగా చెందారు. అయితే నేను రాసిన అంశంలో ముఖ్యోద్దేశం అర్థంకాని వారందరికీ నాద్వారా చెప్పించాలని ఈయన చేసిన ప్రయత్నం.. అలాగే అన్నగారూ.. నేను ఇక్కడే చెబుతున్నాను. 

నాటకవ్యాపారం..
పబ్లిసిటీ అనేది తప్పేకాదు. నేను దీనిని తప్పుగా చూపించలేదు. ఎందుకంటే తమ ప్రొడక్టుని ప్రమోట్ చేసుకోటానికి చాలా కంపెనీలు రకరకాలుగా పబ్లిసిటీ చేసుకుంటారు. కొంతమంది తమ కంపెనీ ప్రొడక్టులని పక్క కంపెనీ ప్రొడక్టులతో పోల్చుకుంటూ అవతల కంపెనీ ప్రొడక్టులని తక్కువగా చూపించి తమ కంపెనీ ప్రొడక్టుని మెరుగైనదిగా కస్టమర్లకి చూపిస్తూ (నాణ్యతా ప్రమాణాలపరంగా) పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. అవసరమైతే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా ఇస్తారు. మనం ఇలాంటివి రెగ్యులర్ గా చూస్తూనే వుంటాం. అదే కోవలో వస్తుంది నేను  2.7లో చెప్పిన ఈ అంశం కూడా.. ‘‘కొన్ని నాటక పరిషత్తులలో (వారి హవా వున్నచోట్ల) తమనాటికకంటే తక్కువ స్థాయిలో వున్న నాటికలను సెలక్ట్ చేయించుకొని, వాటిమీద ఉత్తమ బహుమతులు పొందటం(ప్రొడక్షన్, నటుడు, నటి, దర్శకుడు,రచన ఇంకా ఏమేమి కీలకమైన అంశాలున్నాయో వాటన్నింటినీ ఇప్పించుకోవటంలో సాయశక్తులా కృషిచేసిమరీ). ఇలా చేసి తమ నాటికను లేదా నాటకాన్ని ప్రమోట్ చేసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తారు.’’  వీరు కూడా అంతే... ఎక్కువ ప్రదర్శనావకాశాలు పొందటానికి ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్కులనే ఫాలో అవుతారు. అలాంటి ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు మార్కెట్లో ఎన్ని నిలబడ్డాయో.. ఎన్ని కనుమరుగైపోయాయో తరచూ మార్కెట్లో తిరిగే మనకే తెలుసు. ఈ బిజినెస్ ట్రిక్కులు మొదట చాలా మందినే ఆకట్టుకుంటాయి. తరచూ అదే ట్రెండుని ఫాలో అయితే కంపెనీ ప్రొడక్ట్స్ మీద కస్టమర్లకి చిన్నచూపు ఎలా వుంటుందో.. అదే విధంగా ఇలాంటి పబ్లిసిటీ ఇచ్చే నాటక సమాజం మీద కూడా ప్రేక్షకులకూ, పరిషత్తుల వారికీ, తక్కిన నాటక సమాజాలవారికీ చిన్నచూపు వస్తుంది. ఈ నాటక సమాజాల మన్నిక, మనుగడ కూడా తక్కువే.. చివరికి వీరి పరిస్థితి ఎలా వుంటుందంటే ‘‘కొన్ని పెద్దపెద్ద నాటక సమాజాలు తమ నాటికను ప్రమోట్ చేసుకోటానికి కొంతమంది (పరిషత్ వారిని సంప్రదించి) తమ నాటికను ప్రమోట్ చేయమని కోరటం. అవసరమైతే వాళ్ళ కాళ్ళూ,గడ్డాలూ పట్టుకొని బ్రతిమిలాడటం.. ఇంకా అవసరమైతే అడుక్కోవటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.’’  నేను చెప్పినట్లు... జరుగుతోంది.. భవిష్యత్తులో జరుగుతుంది.

వీడేంటి జోస్యం చెబుతున్నాడా..? ముందు వీడి నాటిక విషయం చూసుకోమనండి అని అనుకోవచ్చు. తప్పకుండా.. చూసుకుంటాను. మార్కెట్ ఎలా వుందో పరిశీలిస్తూ.. అందుకు తగిన విధంగా మన ప్రొడక్ట్స్ రెడీ చేసుకోవాలిగా.. అందుకే ఈ విశ్లేషణ.. నాకే కాదు.. నాలాంటి వారెందరికీ ఈ విశ్లేషణ పనికొస్తుందనే ఆశ. మంచి నాటకం వస్తుందనే కోరిక. చాలా మందికి అనుమానం రావచ్చు... నాటకాన్ని బిజినెస్ గా చూడటమేంటని నోళ్ళు నొక్కుకోవచ్చు.. కానీ ప్రస్తుతం జరుగుతున్న పబ్లిసిటీ తంతు అక్కడే వుంది. 
(కొనసాగింపు వుంది)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు