రంగస్థల నగ్నచిత్రం 2.7
(కొనసాగింపు)
రంగస్థలనగ్నచిత్రం 2వ సెషన్ ని కూడా మొదటిసెషన్ లాగే ఆదరిస్తున్న పాఠకదేవుళ్ళకి అభివందనాలు తెలియ జేస్తున్నాను. మిత్రులారా... నా దృష్టిలో నాటిక రాయటంతోనే రచయిత, నాటిక ప్రదర్శించటంతోనే నటుడు, ప్రేక్షకులను అలరించటంతోనే నాటక సమాజం అందరూ కూడా వరుసగా గెలిచినట్లుగా భావిస్తాను.. అందుకే కనీసం ఒక్క ప్రదర్శన అన్నా వారు వేయగలిగితే చాలు అని నేను అన్నాను. నాకు తెలుసు నాటికలో బలమున్నదని అందరూ చెప్పిన కారణంగా రచయితగా నేను అందరిమనసులు గెలిచాను. నాటిక పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అనుభవజ్ఞుడు సి.ఎస్.ప్రసాద్ నేతృత్వంలో కొనసాగితే నాటిక అనుకున్న స్థాయిలో ఆకర్షించవచ్చు.. ఇదే నేను నమ్మాను. అలాగే నా నమ్మకాన్ని కూడా నిలబెట్టారు వారు. చిన్నచిన్న లోపాలు తప్ప నాటిక బాగనే వుందని చాలా మంది అన్నారు. ఎంత అనుభవజ్ఞుడైనా మొదటి రెండు మూడు ప్రదర్శనల్లో చిన్నచిన్న లోపాలు వుండటం సహజం.
మిత్రులరా ఈ సందర్భంలో మీకో విషయం చెప్పదలచుకున్నాను..
నాటకరంగంలో గత కొంతకాలంగా తమ నాటిక లేదా నాటకాన్ని ప్రమోట్ చేసుకోటానికి కొన్ని పద్ధతులు కొనసాగుతున్నట్లుగా నాకందిన సమాచారం మేరకు గుర్తించాను. ఈరోజు నేను వాటి గురించి ప్రస్థావించబోతున్నాను.. నేను చెప్పబోయే అంశానికి, సంకీర్తన నాటికకీ సంబంధమేంటా అని అనుకుంటున్నారేమో... సంబంధం వుంది... పూర్తిగా చదివితే అర్థమౌతుంది..
గమ్మత్తైన పబ్లిసిటీ స్టంట్స్... చాలా ఆసక్తికరంగా వుంటాయి....
ఇవన్నీ నేను విన్నవీ, నాతో పలువురు వాపోయినవీ...
చాలా మందికి తెలిసినవీ.. అయినా నా కోణంలోంచే ఇవన్నీ.. .
ఈ సంచిక, రాబోయే సంచికల్లో పబ్లిసిటీ స్టార్స్... కొంతమంది భుక్తికోసం పబ్లిసిటీ, మరికొంతమంది పేరు కోసం పబ్లిసిటీ, ఇంకొంతమంది తమ ప్రతిభను చూపించుకోటానికీ, నిరూపించుకోటానికి ఇచ్చుకునే పబ్లిసిటీ...వీటి వివరాలే.. కొంచెం హాస్యంగానూ, కొంచె విచారంగానూ, కొంచెం అసహ్యాన్ని కలిగించేదిగానూ, మరికొన్ని ఆవేదనా పూరితంగానూ వుంటాయి. పాఠకులు సరదాగా చదవండి... కొంచెం సీరియస్ గా ఆలోచించండి...
గమ్మత్తైన పబ్లిసిటీ స్టంట్స్... చాలా ఆసక్తికరంగా వుంటాయి....
ఇవన్నీ నేను విన్నవీ, నాతో పలువురు వాపోయినవీ...
చాలా మందికి తెలిసినవీ.. అయినా నా కోణంలోంచే ఇవన్నీ.. .
ఈ సంచిక, రాబోయే సంచికల్లో పబ్లిసిటీ స్టార్స్... కొంతమంది భుక్తికోసం పబ్లిసిటీ, మరికొంతమంది పేరు కోసం పబ్లిసిటీ, ఇంకొంతమంది తమ ప్రతిభను చూపించుకోటానికీ, నిరూపించుకోటానికి ఇచ్చుకునే పబ్లిసిటీ...వీటి వివరాలే.. కొంచెం హాస్యంగానూ, కొంచె విచారంగానూ, కొంచెం అసహ్యాన్ని కలిగించేదిగానూ, మరికొన్ని ఆవేదనా పూరితంగానూ వుంటాయి. పాఠకులు సరదాగా చదవండి... కొంచెం సీరియస్ గా ఆలోచించండి...
- కొన్ని పెద్దపెద్ద నాటక సమాజాలు తమ నాటికను ప్రమోట్ చేసుకోటానికి కొంతమంది (పరిషత్ వారిని సంప్రదించి) తమ నాటికను ప్రమోట్ చేయమని కోరటం. అవసరమైతే వాళ్ళ కాళ్ళూ,గడ్డాలూ పట్టుకొని బ్రతిమిలాడటం.. ఇంకా అవసరమైతే అడుక్కోవటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
- కొన్ని నాటక పరిషత్తులలో (వారి హవా వున్నచోట్ల) తమనాటికకంటే తక్కువ స్థాయిలో వున్న నాటికలను సెలక్ట్ చేయించుకొని, వాటిమీద ఉత్తమ బహుమతులు పొందటం(ప్రొడక్షన్, నటుడు, నటి, దర్శకుడు,రచన ఇంకా ఏమేమి కీలకమైన అంశాలున్నాయో వాటన్నింటినీ ఇప్పించుకోవటంలో సాయశక్తులా కృషిచేసిమరీ). ఇలా చేసి తమ నాటికను లేదా నాటకాన్ని ప్రమోట్ చేసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తారు.
- స్క్రూటినీలో నాటికలను సెలక్ట్ చేసుకునే దిశలో కొంతమంది జడ్జీలను ఆకర్షించటానికి తమవారిని, తమవారి వారిని అవసరమైతే వాహనాల్లో రవాణాచేసి, నాటకి ప్రదర్శన సమయంలో చపట్లు, ఈలలు, గోలలు చేయించి తమ నాటిక ప్రేక్షకాదరణ పొందిందన్నట్లుగా, అలాంటి నాటికను సెలక్ట్ చెయ్యక పోతే జడ్జిలకు ఏమీతెలీదని, పరిషత్ వారు ఏదో కోల్పోతారనీ, అప్రదిష్టపాలవుతారన్నట్లుగా సైకలాజికల్ బ్లాక్ మేల్ చేయటం వంటి చర్యలకు పూనుకుంటున్నారు. ఇలా చేయటంలో కొంతమంది ప్రాధమిక పరిశీలకులు వారి ప్రలోభంలో పడిపోతూ ఆ నాటికను సెలక్టు చేసుకుంటూ దానిని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ లో గత కొంతకాలంగా కొన్ని నాటకసమాజాలకు చెల్లుతూ వస్తోంది. ఇది ఎలా వుంటుందంటే రాజకీయ నాయకుల ఉపన్యాసాలకు జనసమీకరణ చేసినట్లు అన్నమాట.
- మరి కొన్ని నాటక సమాజాలు పరిషత్తులు కండెక్ట్ చేస్తున్నాయి. తమతమ పరిషత్తులలో నాటకాలు ఎలా సెలక్ట్ చేస్తారంటే వారు వారి పరిషత్తులలో కూడా తమ నాటకాలు, నాటికలు వేసుకునేందుకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటారు. వీరి పరిషత్తులలో కేవలం అలాంటి ఒప్పందాలతో కూడిన నాటికలే వుంటాయి. అందులో కొన్ని నాటకోత్సవాలు నిర్వహిస్తుంటే, మరికొన్ని పోటీలు పెట్టి ప్రైజులు ఇప్పించుకుంటారు. నా పరిషత్తులో నీకు ఫస్ట్ ప్రైజు ఇస్తాను. నీ పరిషత్తులో నాకు ఫస్ట్ ప్రైజు ఇవ్వాలి.. అని చెప్పి మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో కొనసాగుతున్నాయి కొన్ని.. ఇక్కడ కూడా కొన్ని పెద్ద సమాజాలు ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఎందుకంటే ఆ పెద్ద సమాజాల మెప్పు పొందటానికి, వారి ద్వారా కొన్ని ప్రదర్శనలు పొందటానికి చేసే పబ్లిసిటీ గేమ్..
- మరికొన్ని బడా సమాజాల గుప్పిట్లో వున్న (అంటే మ్యూచివల్ అండర్ స్టాండింగ్ తో వున్న) పరిషత్తుల వారైతే ముందుగానే చెప్పేస్తారు... మా పరిషత్తులో ఫలానా సమాజం వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చేస్తాం.. కనుక మీరు మా దగ్గర నాటిక ఆడాలంటే వీటన్నింటికీ ఒప్పుకొని వచ్చి నాటిక ఆడి వెళ్ళండి.. లేదంటే చెప్పండి వేరే వాళ్ళకి అవకాశమిస్తాం అని చెప్తారు. ఇదీ ఒక రకమైన సైకలాజికల్ బ్లాక్ మేల్ కిందకే వెళుతుంది. ప్రదర్శనావకాశం కోసం అల్లల్లాడిపోతున్న నాటక సమాజాలు తమకు ప్రదర్శనావకాశం వస్తే చాలని తపించిపోయే ఛోటా సమాజాల వారే ఇలాంటి వాటికి ఒప్పుకొని ఆయా ప్రదర్శనల్లో పాల్గొంటారు. ఇదీ కొన్ని బడా నాటక సమాజాలు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి