రంగస్థల నగ్నచిత్రం 2.4
అలా అమ్మకానికో అమ్మ నాటిక తయారైంది.
అంతకు ముందు 2018 జాతీయ స్థాయి నాటిక రచనల పోటీలు అప్లికేషన్ ఆహ్వానిస్తూ 2018 ఏప్రిల్ 14 న ఎంట్రీ ఫారాలు ఈ బ్లాగులోనే పోస్టు చేశాను. దాదాపు 28 వరకూ ఎంట్రీలు వచ్చాయి. నాటికలు చదివి జడ్జిమెంట్ చేయటానికి ఐదుగురు న్యాయనిర్ణేతలను ఏర్పాటు చేశాను. ఈ సారి ఏర్పాటు చేసిన పోటీలలో ప్రధానంగా నాటకరంగ సాహిత్యానికి పెద్దపీట వేయటం జరిగింది. సాహిత్య విలువల పరంగా నాటికలను ఎంపిక చేయాల్సిందిగా ఆయా న్యాయనిర్ణేతలను కోరాను. కొన్ని అంశాలను ఇచ్చి వాటిలోనే నాటిక రచనలు చేయాల్సిందిగా సూచించాను. కుటుంబ జీవనశైలి నాడు-నేడు, భారతదేశాభివృద్ధిలో యువత పాత్ర, వ్యవసాయాభివృద్ధిలో ప్రభుత్వం చర్యలు - రైతుల వాదనలు - పెరుగుతున్న ఆహారధాన్యాల ధరలు, ఆర్థికాభివృద్ధిలో యువతరం - కోల్పోతున్న కుటుంబ విలువలు, సెల్ ఫోను సృష్ఠిస్తున్న దూరం అనే అంశాలపై నేను నాటికలు చేయాల్సిందిగా కోరాను. అయితే వచ్చిన ఎంట్రీల్లో దాదాపు చాలా వరకూ వీటికి దూరంగా రచనలు చేయబడి వున్నాయి. నేనిచ్చిన అంశాల్లో రచనలు చేసిన వాటిలో ఉత్తమమైన నాటికగా ఎంపికైంది తాళాబత్తుల వెంకటేశ్వరరావు రచించిన ‘‘నాన్నా నన్ను క్షమించకు’’ నాటికని ఐదుగురు న్యాయనిర్ణేతలు ఉత్తమ రచనగా ఎంపిక చేశారు.
ఇక్కడ నేను ఏర్పాటు చేసిన న్యాయనిర్ణేతలు ఒకరికి ఒకరు తెలీదు.
నాటక రంగంతో సంబంధంలేని వారిని, సాహిత్యరంగంతో సంబంధం వున్న వారిని ఎంపిక చేశాను.
ముఖ్యంగా నాటక సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పాము కనుక సాహిత్య కారులని మాత్రమే న్యాయనిర్ణేతలుగా వుంచటం జరిగింది. ఒక్కొక్కరూ ఒక్కో ప్రాంతంలో నివాసముంటూ ఒకరికి ఒకరు తెలియని వారిని వుంచాను. దీని వల్ల జడ్జిమెంటు పారదర్శకంగా వుంటుందని భావించి చర్యలు తీసుకున్నాను.
అయితే ఎప్పటిలాగే ప్రైజులు రానివారు జడ్జిమెంటు విషయంలో రాద్దాంతం చేశారు.
కేవలం ఒక్క నాటికకు మాత్రమే బహుమతి ఇచ్చామని గొడవ చేశారు.
విజయనగరానికి చెందిన పిళ్ళా రాంప్రసాద్ అనే వ్యక్తి నేను నాటిక రచనల పోటీలు పెట్టి వచ్చిన నాటికల్లోంచి పాయింట్లు నోట్ చేసుకొని నాటికలు తయారు చేసుకుంటున్నానని ప్రచారం చేశారు. దానికి సంబంధించి వచ్చిన పోస్టు స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ వుంచుతున్నాను.
ఈ కామెంట్ వారు 18.8.2018 ఉదయం 8.03 కి వారు గ్రూపులో చేసిన కామెంట్ |
మిత్రులారా నాసంగతి చాలా మందికి తెలుసు.. తెలియని వారికి మళ్ళీమళ్ళీ చెబుతున్నాను.. నాకు చదవటం అంటే చిరాకు... పుస్తకం పట్టుకోగానే నిద్ర వస్తుంది.. నాకెందుకో చదవబుద్ధికాదు.. తప్పని పరిస్థితులైతేనే తప్ప ఇతర సందర్భాల్లో నేను చదవను.. కనీసం దానివైపు కన్నెత్తి కూడా చూడను.. అలాంటిది నేను నాటికల లైన్లు ఎత్తుకొని మరో నాటిక ప్రిపేర్ చేసుకుంటానని చెప్పటం నిజంగా ఆ వ్యక్తికి నా వ్యక్తిత్వం తెలియకపోవటమే..
నేనంటాను... మీరూ నాలాగే ఏదైనా విషయంలో పోటీ నిర్వహించి జడ్జిమెంటు విషయంలో పారదర్శకత్వం కోసం రకరకాలుగా నిజాయితీగా ఏర్పాట్లు చేశాక కూడా ఇలాంటి ప్రేలాపనలే కనుక వస్తే మీరెలా ఫీలవుతారో.. నేను కూడా అలాగే ఫీలవుతున్నాను అని చెబుతున్నాను. నా వ్యక్తిగత అంశాలపై నన్ను దూషిస్తూ... వాడు వాడి ఫోజులూ, ఫోటోలకి స్టిల్స్ అంటూ ప్రేలాపనలు చేయటం వెనక అతని యొక్క పెద్దరికం ఏంటో, అతని అనుభవం ఏంటో అర్థమవుతోంది.. నిజానికి జడ్జిమెంటు విషయంలో నేను ఎలాంటి బాధ్యతా వహించను అని ముందుగానే చెప్పాను. అలాగే వచ్చిన నాటికలు ఏంటో కూడా నేను చూడలేదు.. ఒక్క నాటిక కూడా నేను చదవలేదు.. అందుకే ఎవరు నాటికల గురించి నన్ను అడిగినా నేను ఏర్పాటు చేసిన న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన నాటిక ఫలానా అని చెప్పాను తప్ప ఫలానా నాటిక బాగుందని నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు దాని గురించి తెలీదు కనుక.
నేను అన్నిసమయాల్లోనూ పారదర్శకంగానే వున్నాను.
నాకు నాటికల గురించి తెలీదని చాలా మంది అన్నారు.
నిజమేనేమో.. నాకు తెలీదేమో.. అనుకుంటే పోలే..
ఆ తర్వాత కొంతకాలానికి అమ్మకానికో అమ్మ నాటిక ప్రిపేర్ చేశాను.
ఆ నాటిక గురించి నేను ఆల్రెడీ చెప్పాను.
రంగస్థల నగ్నచిత్రంలో ప్రతీదీ నేను చూసిన... చూస్తున్న.. ఎదుర్కొన్న అంశాలనే ప్రస్థావించాను.. ప్రస్థావిస్తాను.
నగ్నంగా నిలబెట్టేందుకే ఇదంతా... (సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి