రంగస్థల నగ్నచిత్రం 2.3
2.2 కొనసాగింపు
ఏదైతే అది అయిందని అవనీ సూక్తం అనే పేరు పెట్టాను. అదే పేరుతో నేను డాక్టర్ రవీంద్రకి మెయిల్ చేశాను. నాటిక చదివారు. చాలా బాగుందని చెప్పారు రవీంద్ర. పనిలో పనిగా నాకు తెలిసిన ముగ్గురు నాటకరంగ పెద్దలకూ పంపాను. వారు చదివారు. వారిలో అందరికీ నాటిక బాగా నచ్చింది. ఒక్కరికి తప్ప..
వారిని అడిగాను నాటిక ఎందుకు నచ్చలేదో చెప్పండి ప్లీజ్ అని..
నాటికలో అమ్మని అమ్మకానికి పెట్టటం నాకు నచ్చలేదు అన్నారు.
అప్పుడు నా మనసుకి తట్టిన పేరే ‘‘అమ్మకానికో అమ్మ..’’
అయితే ఈ పేరు నేను చాలా కాలం ఎవరికీ చెప్పలేదు. నా మనసులో అయితే ఈ పేరు తప్పనిసరి పరిస్థితుల్లోనే పెట్టాలని.. అంతకన్నా బెటర్ టైటిల్ వస్తే ఆలోచిద్దామని వెయిట్ చేస్తున్నాను.
ఇంతలో నాటిక విషయమై రీడింగ్ ఇవ్వటానికి నన్ను రవీంద్ర తిరుపతి రావాల్సిందిగా కోరారు.
నేనూ వెళ్ళాను..
అలా వెళ్ళిన తర్వాత నాటిక మొత్తం చదివాను.. కథలో ఆత్మ అయితే వుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్లుగా అనిపించింది నాకే.. రవీంద్రగారితో సార్ నాకు కంప్యూటర్ ఇవ్వగలరా .. నాటికలో చిన్నచిన్న కరెక్షన్స్ చేసి ఇస్తాను అన్నాను.
కంప్యూటర్ వుంది కానీ నాకు సంబంధించిన సాఫ్ట్ వేర్ లేదు..
అదో పెద్ద ప్రాబ్లం నాకు..
తప్పని పరిస్థితుల్లో రవీంద్రగారూ మీరేమనుకోనంటే ఒక చిన్న రిక్వెస్ట్... డైలాగ్ నేను చెబుతుంటాను.. రాసే వారున్నారా? ఎందుకంటే నా రైటింగ్ బాగోదు.. అందుకని అన్నాను..
రవీంద్ర గారు ఎవరో ఎందుకు నేనే రాస్తాను.. అంటూ ఆయనే ముందుకొచ్చారు.
నాటికలో ఎక్కడెక్కడ డైలాగులు మార్చాలో నోట్ చేస్తూ నాటికను మరోసారి రీరైట్ చేశాను.
నాటిక అంతా బాగా వచ్చింది కానీ క్లైమాక్స్ యధాతథంగా వుంచితే నాటికకి అర్థం లేకుండా పోతోంది. అందుకే నేను ఆలోచించాను. కేవలం క్లైమాక్స్ కోసం రెండు రోజుల్లో తిరుపతి నుంచి గుంటూరు వచ్చేద్దామనుకున్న నేను నాలుగు రోజులు అక్కడే వుండి పోవాల్సి వచ్చింది.
క్లైమాక్స్ విషయంలో నేను ప్రముఖ నాటక రచయిత శ్రీ భారతుల రామకృష్ణకి ఫోన్ చేశాను.
సబ్జక్టు అంతా వివరంగా చెప్పాను. నాకేం కావాలో కూడా చెప్పాను. ఆయన అనుభవంతో లింక్ వేయాల్సిందిగా అడిగాను. అడిగిందే తడవుగా రామకృష్ణ ఆయన అనుభవంలోంచి ఒక ఐడియా విసిరేశారు. వెంటనే దాన్ని నేను క్యాచ్ చేసుకొని పది నిమిషాల్లో క్లైమాక్స్ రాసిచ్చాను.
అలా నేను కథలోకి ఇన్సర్ట్ చేసుకున్న కేరెక్టర్ పులికంటి మధుసూధన్.
నిజానికీ కేరెక్టర్ నిజజీవితంలో లేదు.
ఈ కేరెక్టర్ నవ్విస్తుంది.. కవ్విస్తుంది. కథను ముందుకు నెడుతుంది. క్లైమాక్స్ కి తీసుకెళుతుంది.
ఇప్పుడు నాటిక నాకు తృప్తిగా అనిపించింది.
అమ్మ పాత్రకి సంభాషణ చాలా తక్కువ.. కానీ ఆమె పాత్రలో లోతెక్కువ. కంటికి కనిపించని, మాటల కందని భావం.. ఆమె దైన్యస్థితికి తన గుండెలోతుల్లో లావాలా పెల్లుబుకుతున్న ఆవేదన... పైకి కనిపించే ఆమె నిస్సహాయత, కొడుకుపై ప్రేమ, తన వెన్నంటి వున్న బాధ్యత ఇవన్నీ కేవలం ఆమె మౌనంలో కనిపించాలి అని చెప్పాను.
నాటికను అదే విధంగా నడిపించాను.
మాష్టారి పాత్రకు రవీంద్రని అనుకున్నాను. ఆపాత్ర నిడివిని కూడా పూర్తిగా పెంచాను. తల్లి పాత్రకి దేవసేన(హసీన) ని అనుకున్నాను. కొడుకు పాత్రకి సతీష్, సైక్రియాట్రిస్ట్ పాత్రలో మధుసూధన్, పులికంటి మధుసూధన్ పాత్రలో కోటేశ్వరరావులు వారివారి పాత్రల అవధుల మేరకు నటించారు.
నాటిక స్టాండింగ్ రిహార్సిల్స్ చేస్తున్నారు.
శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య వారి స్క్రూటినీ 28 సెప్టెంబరు 2018న ఇస్తున్నామని, నన్ను 24 బయల్దేరి రమ్మని రవీంద్ర పిలిచారు. 25 ఉదయం నా మిత్రుడితో తిరుపతి చేరుకున్నాను.
రెండు రోజులు రిహార్సిల్స్ చేశారు.
27 సెప్టెంబరు 2018 రాత్రి 9 గంటలకు... రిహార్సిల్స్ చేసేందుకు అందరం సిద్ధమయ్యాం..
ఆరోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన..
నాటిక రేపు స్క్రూటినీ అనంగా డాక్టర్ రవీంద్ర సొంత సోదరుడు జలదంకి ప్రకాష్.. (ఎ.పి.ఎస్.ఆర్.టి.సి రీజనల్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు.) హైదరాబాదులోని ఒమేగాలో చికిత్స పొందుతూ కాలం చేశారు.. రవీంద్ర బాగా డిప్రెషన్ లోకి వెళ్ళారు. అతనే తన కుటుంబానికి పెద్దదిక్కు. అతని బాధ్యత చాలా వుంది.. అతనున్న పరిస్థితుల్లో మరెవరున్నా స్క్రూటినీ ఇవ్వలేని పరిస్థితి..
నాటికలో అతని కేరెక్టర్ అవతలి వ్యక్తిని ఏడిపించాలి... కానీ ప్రస్తుతం అతని పరిస్థితి గుండెలవిసేలా రోధిస్తోంది.. పూర్తి భిన్నంగా వుంది అతని పరిస్థితి.. ఇటువంటి సమయంలో టీమ్ అందరం నాటిక స్క్రూటినీ ఇవ్వలేమని వద్దని.. జడ్జిలతో చెప్పమని రవీంద్రని కోరాం.. తనకు కొంచెం సమయం ఇవ్వమని రవీంద్ర అతని మిత్రులు కోటి, మధులతో కలిసి రిహార్సిల్ రూమ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళారు. పదినిమిషాల తర్వాత వచ్చారు.
మాష్టర్ మనం స్క్రూటినీ ఇస్తున్నాం.. రిహార్సిల్ చేద్దాం రమ్మన్నారు. మేం ఏమీ మాట్లాడలేని పరిస్థితి..
రవీంద్ర తన కేరెక్టర్ చేస్తున్నారు. సీన్ కి సీన్ కి మధ్యలో గ్యాప్.. ఆ గ్యాప్ లో బయటికి వచ్చి ఫోన్ ద్వారా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళకి అప్పగిస్తున్నారు. మళ్ళీ కేరెక్టర్ లోకి వెళ్ళి రిహార్సిల్ చేస్తున్నారు. మరుసటి రోజు ఉదయం 5.30కి స్క్రూటినీ ఇచ్చేలా ఏర్పాటు చేశారు ఆయన.
ఆ రాత్రికి ఒక రిహార్సిల్ చేసి మేము మా రూమ్ కి వెళ్ళిపోయాం...
మరుసటి రోజు ఉదయం 5.30 కి స్క్రూటినీ ఇచ్చేందుకు ప్రిపేర్ అయ్యాం..
డాక్టర్ స్క్రూటినీ ఇచ్చే ముందు తన ఫోన్ తన బంధువు చేతిలో వుంచి పూర్తి స్థాయిలో పాత్రలో ఒదిగిపోయి నటించారు. అది చూస్తున్న మాకు కళ్ళు చెమ్మగిల్లాయి.
నటన పట్ల, నాటకం పట్ల అంత ప్రేమ.. కాదు కాదు ప్రేమకు పరాకాష్ట పిచ్చి అయితే.. అది అతనిలో నేను చూశాను. ఒక నాటిక కోసం పరితపించే వ్యక్తుల గురించి విన్నాను కానీ ఇతన్ని నా జీవితంలో చూడటం ఇదే మొదటి సారి. ఇది నేను చూసిన నాటకరంగం.. కనుకనే ఇదంతా..
రంగస్థలంపై నవ్వించే వారి నవ్వుల వెనుక విషాదముంటుందని, కర్కశంగా కనిపించే వారి కంటి వెనుక కన్నీళ్ళుంటాయని చాలా మంది చెబుతుంటే విన్నాను.. పుస్తకాల్లో చదివాను.. కానీ 28 సెప్టెంబరు 2018న నా కంటితో చూశాను. తన తమ్ముడు బాడీ రావటానికి కొంత సమయం వుండగా ఆ సమయాన్ని కళారంగం కోసం కేటాయించటం నాకు రవీంద్ర పట్ల గౌరవభావాన్ని పెంచింది.
తర్వాత నాటికను శ్రీకాకుళంలో ప్రదర్శించారు. ఈ నాటికకి ఉత్తమ రచన, ఉత్తమ కేరెక్టర్ నటుడుగా జలదంకి రవీంద్ర, ప్రోత్సాహక బహుమతిగా అమ్మ పాత్ర(దేవసేన)కి లభించటంతో పాటు ఉత్తమ తృతీయ ప్రదర్శన బహుమతి అందుకుంది. (కొనసాగింపు)

స్క్రూటినీ అయిపోయింతర్వాత రవీంద్రని నాగుండెలకి హత్తుకున్నాను. భోరమని విలపించారు రవీంద్ర.. అతని కన్నీటి చుక్కలు నా చొక్కాని దాటి, నా బనీన్ దాటి, నా చర్మం మీద పడి అక్కడి నుండి అవి నా గుండెను తాకాయి.. వాటి బరువు మోయటానికి కూడా నాకు చాలా కష్టంగా అనిపించింది.
ఆ తర్వాత నాటిక స్ర్కూటినీలో సెలక్ట్ అయిందని తెలిసింది.తర్వాత నాటికను శ్రీకాకుళంలో ప్రదర్శించారు. ఈ నాటికకి ఉత్తమ రచన, ఉత్తమ కేరెక్టర్ నటుడుగా జలదంకి రవీంద్ర, ప్రోత్సాహక బహుమతిగా అమ్మ పాత్ర(దేవసేన)కి లభించటంతో పాటు ఉత్తమ తృతీయ ప్రదర్శన బహుమతి అందుకుంది. (కొనసాగింపు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి