రంగస్థల నగ్నచిత్రం 2
మనసులో మాట
రంగస్థల నగ్నచిత్రం మొదటి భాగాన్ని బాగా ఆదరించిన నా నాటకరంగ మిత్రులకి, నాటకాభిమానులకి, నాటకరంగ పోషకులకీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రంగస్థల నగ్నచిత్రం మొదటి భాగంలో నేను ప్రస్థావించిన అనేక అంశాలు నా చుట్టూ తిరుగుతూ.. నన్ను ప్రభావితం చేసిన నా వ్యక్తిగతమైన అంశాలే.. అదే విధంగా ఈ రెండవ భాగంలో కూడా నేను చూసిన.. చూస్తున్న.. రంగస్థలాన్ని.. నా కోణం నుంచి నిర్మొహమాటంగా.. నిర్దయగా.. నేను నమ్మిన విధంగా.. నా కోణం నుంచే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను.
విద్యాధర్ మునిపల్లె |
ఇలా చేయటం వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన వచ్చు.. ఎంతో మంది బాధపడవచ్చు.. మరెంతో మందికి కోపం రావచ్చు.. దీని వల్ల నా నాటకరంగ కెరియర్ కూడా పూర్తిగా దెబ్బతినచ్చు.. అసలేమీ జరగక పోనూ వచ్చు... ఏది ఏమైనా నేను అనుకున్నది.. అనుకుంటున్నది.. నేనేదైతే నిజమని నమ్ముతున్నానో.. నేనేదైతో చూశానో.. విన్నానో.. నా దృష్టికి ఏదైతే వచ్చిందో అటువంటి అంశాలన్నింటినీ... నాకు అనుభవంలోకి వచ్చిన అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తూ చేసుకు పోయే రచనే ఈ రంగస్థల నగ్నచిత్రం 2.1 వ సెషన్. నా మాట తీరు కొంచెం కఠువుగా వున్నా.. దయచేసి నేను చెప్పదలచుకున్న అంశాన్ని అర్థం చేసుకోగలరు.
ఎప్పటిలాగే కొంత ఇంట్రడెక్షన్ ఇచ్చాక నేను అసలు పాయింట్ లోకి వెళ్ళక తప్పదు. 2018-19 సంవత్సరాల్లో నేను చూసిన నాటకరంగాన్ని ఇక్కడ ప్రస్థావించబోతున్నాను. గతంలో నేను రాసిన రంగస్థల నగ్నచిత్రం ద్వారా చాలా మంది నాకు తెలియకుండానే అభిమాన సోదరసోదరీమణులను సంపాదించుకోగలిగాను.. అలాగే కొంతమంది శత్రువులని కూడా సంపాదించుకోగలిగాను. నన్ను శత్రువుగా భావించే వారికి మాత్రం ఒక్కమాట చెప్పదలచుకున్నాను. వారు నన్నలా భావించినా నా మనసులో నాకంతా మిత్రులే..
ఇదంతా నేను చూసిన రంగస్థల వైభవమే.. నా కోణం నుంచి మాత్రమే.. నన్ను వ్యతిరేకించచ్చు.. నన్ను సమర్ధించచ్చు.. మాకేమీ పట్టదన్నట్లు వ్యవహరించచ్చు.. అయినా నా రచన నేను చేసుకుంటూ వెళతాను..
ఎందుకంటే ఇది నేను చూసిన రంగస్థలం. ఇది నా రంగస్థలం... ప్రక్షాళన అవసరమైందని భావించాను. అందుకే ప్రయత్నం మొదలు పెట్టాను. చూద్దాం... కాలం ఏం సమాధానం చెబుతుందో... నా నాటకరంగ కెరీర్ ఏమౌతుందో... ఎందుకంటే కాలం కదా... దానికి కనికరం వుండదు.. నా రంగస్థలాన్ని ప్రక్షాళనే చేస్తుందో.. లేక నాటకరంగంలో నా స్థానమే లేకుండా నన్నే ప్రక్షాళన చేస్తుందో... ఎదురు చూద్దాం...
మీ
విద్యాధర్ మునిపల్లె బి.ఏ.,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి