రంగస్థల నగ్నచిత్రం 2.5

కొనసాగింపు

రంగస్థల నగ్నచిత్రం 2.5

నగ్నచిత్రాన్ని రోజు రోజుకూ ఆదరిస్తున్న మీకు శతకోటి వందనాలు..
పిళ్ళా రాంప్రసాద్ గారు అన్నమాటలకు నేను స్పందిస్తూ ఆయనతో నేను ఈ క్రింది విధంగా స్పందించాను.. 
‘‘మీరు నాకిష్టమైన దర్శకుడు రాంగోపాల్ వర్మతో నన్ను పోల్చటాన్ని కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నాను. అయితే నాకేం తెలుసని రచనల పోటీ పెట్టానని, ఎవరు క్వాలిఫైడో నిర్ణయించానని అంటున్నారు. దీనికి నేను ఆల్ రెడీ సమాధానం చెప్పాను.. అర్థం కాకపోతే ఎవరినైనా (మీకంటే తెలివిగలవారిని ) అడిగి తెలుసుకోండి. అందరికీ అర్థమైంది మీకు అర్థం కాలేదంటే మీ తెలివితేటలమీద, మీ అనుభవం మీద నాకు డౌట్ వస్తోంది. ఇక మరో విషయం నేను రచనల థీమ్స్ తస్కరించే ప్రయత్నం చేస్తున్నానని మీరనుకుంటున్నారేమో నేనింకా అంతగా దిగజారలేదు.. నేను అలా యూజ్ చెయ్యబోతున్నానని మీకు చెప్పానా? లేక నా సన్నిహిత వర్గాలు ఎవరైనా చెప్పారా? కచ్ఛితంగా నా సన్నిహిత వర్గాలు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే నా సన్నిహితులు, ఆప్తులు వేళ్ళమీద లెక్కేసినా కూడా ఇంకా చాలా వేళ్ళు మిగిలే వుంటాయి. కనుక వారు చెప్పే అవకాశమే లేదు. మీకు మీరుగా మీ కల్పనా శక్తిని జనం మీద రుద్దటం భావ్యంకాదు. మీ కల్పనా శక్తిని నాటక రచనమీదనో, లేక మీ కథా రచనల మీదనో పెట్టి మంచి రచనను వెలికి తీసే ప్రయత్నం చెయ్యండి.. బురద జల్లటం ఎంతసేపు.. నోరుంది కదాని మాట్లాడటం.. చేతిలో ఫోనుంది కదాని టైప్ చేయటం మీ లాంటి పెద్దలకు భావ్యంకాదు. తద్వారా మీ లేకి బుద్ధి బయటపడుతుంది. ఆ ముండ అనే పదాన్ని మీరు వాడారు.. మీ స్థాయిని నాకు ఆపాదించటం అనేది నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మీ స్థాయికి నేనింకా ఎదగలేదు (దిగజారలేదు). డి.టి.పి.కి డబ్బు ఖర్చుపెట్టించాను అని మొత్తుకుంటున్నారు... రచనల పోటీకి పంపే సమయంలో కవి రాసిన అక్షరాలు అర్థం చేసుకొని అందులో భావాన్ని గ్రహించటానికి అక్షరాలు పొందికగా, గుండ్రంగా వుండాలి. అందుకే డి.టి.పి. అనేది ఒకానొక మార్గం. అందుకే డి.టి.పి చేసి పంపాలన్నాను. బయట చేయించుకోవటం కష్టంగా వుంటే మీరే చేసుకోండి. చేసుకోవటం రాకపోతే నేర్చుకోండి. నేను నేర్చుకోలేదా.. కేవలం నాటక రచన కోసమే.. నా రైటింగ్ బాగోదనే కారణంగానే 4రోజులు కష్టపడి డి.టి.పి నేర్చుకున్నాను. ఆండ్రాయిడ్ ఫోన్ లో టైప్ చేయటం నేర్చుకోవటం మీద శ్రద్ధపెట్టిన మీకు డి.టి.పి నేర్చుకోవటం పెద్ద సమస్యే కాదు. కాకపోతే అవసరం లేదనే కారణం తప్ప. వాడి తోలు తీద్దాం అని నోరు పారేసుకొని తమ విలువని మరింత దిగజార్చుకున్నారు. ఇది ఒక రచయితగా సిగ్గుపడాల్సిన అంశం. విలువలు నేర్పాల్సిన వయసులో నాలాంటి ఏమీ తెలియని వాడితో విలువల గురించి చెప్పించుకుంటూ మీరెంత విలువ తక్కువలో వున్నారో... నాకే బాధగా వుంది.. ఇలాంటి వ్యక్తినా నేను మేధావుల సమూహంలో చేర్చుకుంది అని. రోజూ వెధవ ఫోజొకటని అన్నారు.. ఫోజులు పెట్టటం నా ఇష్టం... మీకిష్టం లేకపోతే చూడకండి..  మరొక అంశం ఏమిటంటే... మీకు సమూహంలో కొనసాగటం ఇష్టంలేకపోతే దయచేసి తప్పుకోవచ్చు.. బలవంతంగా మిమ్మల్ని వుండమని ఆపేవారు కానీ, ఆపాలని కానీ మాకు లేదు. డబ్బు ఖర్చయిందని మీ ఆవేదన కనబడుతుందే కానీ నాటకం పట్ల మీకున్న చిత్తశుద్ధి కనిపించలేదు.’’
నేను ఈ విధంగా స్పందించాను.. అప్పుడు.. అది ఆవేశంలో పలికిన పలుకులని, ఇప్పుడు అనుకుంటున్నాను.. ఏది ఏమైనా వారు అలా మాట్లాడటం, నేను అలా స్పందించటం రెండూ తప్పే.. అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. గెలుపు, ఓటమి అన్న మాటలు పక్కన పెడితే రచన పంపటంతోనే మీరు గెలిచినట్లుగా ఎందుకు భావించరు. నాటక రచన చేయటమే రచయిత గెలుపు.. చాలా మంది రచన చేయలేని వారికంటే మనం ముందున్నాం.. నాటకం ఒక ప్రదర్శన చేయటం మరో గెలుపు..కనీసం ఒక్క ప్రదర్శన కూడా వేయలేక పోయిన వారు చాలా మంది వున్నారు.. వారికంటే మనం ముందున్నాం.. ఎవరెన్ని ప్రదర్శనలు వేస్తే ఏం లాభాం.. నాటక సమాజానికి ఆర్థికంగా లాభం వుండచ్చు.. కానీ మీరు సామాజిక పరమైన అంశాన్ని... మీ చుట్టూ వున్న సమాజంలో ప్రదర్శించి ఒక కళాకారునిగా మీ బాధ్యత నిర్వహించారు. 
గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి కళాకారునికీ ఆశ వుండటం సహజం.
అయితే గుర్తింపు తెచ్చుకోవటంలో అతను వెళ్ళే దారులే ప్రత్యేకం... 
ఎవరి దారి వాళ్ళే నిర్మించుకోవాలి.. ఎవరి వేదిక వాళ్ళే నిర్మించుకోవాలి.. అలా నిర్మించుకున్న వేదికలే మనకి పూల పాన్పులౌతాయి.. కొందరికి ముళ్ళ పాన్పులుగా కూడా వుంటాయి. అయినా సరే మనల్ని మనం నిరూపించుకోవాలంటే ప్రయత్నం మాత్రం తప్పనిసరి. అది నేను ఈ మధ్యే తెలుసుకున్నాను.
(సశేషం)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు