నాటకరంగ జీవితం
1965 నుండి రంగస్థలంలో పనిచేస్తున్న సంజీవి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అనేక నాటక నాటికలతో తన ప్రతిభను చాటారు. గురజాత కళామందిరం అనే సంస్థను స్థాపించి, గత 40 ఏళ్ళుగా ప్రదర్శనలను ఇస్తున్నారు.
నాటకాలు: సమాధానం కావాలి, యుద్ధం, ఈ చరిత్ర ఏ సిరాతో, దేశం మోసపోయినప్పుడు, మాస్టార్జీ, యాచకులు, శబ్దం, మూక మొ.వి.
నాటికలు: పగగం పగిలింది, నీరుపోయి, చరమాంకం, శవాలపై జీవాలు, ఊసరవల్లి, మనకెందుకులే, కదలిక, సంచలనం, డేకోయిట్లు, రేపు, వర్తమాన భూతం, అయో (వ) ధ్య, మనుధర్మం, రాజ్యహింస, నిజాయితి, ఊరుమ్మడి బతుకులు, క్విట్ ఇండియా, అమూల్యం, చెప్పుకింది పూలు, ఓటు బాట, గబ్బిలం, అని తెలుస్తుంది, వామపక్షం మొ.వి
అందుకున్న బహుమతులతో సంజీవి |
- వేసిన ప్రతి పాత్ర ఉత్తమ నటుడిగా, ప్రదర్శించిన ప్రతి నాటక, నాటికలు ఉత్తమ ప్రదర్శనలుగా, రచన మరియు దర్శకత్వ విభాగాలలో బహుతమలు అందుకున్నాయి.
- కదలిక నాటిక 14 భాషలలో ఉత్తమ ప్రాంతీయ ప్రదర్శన విభాగంలో మరియు ఉత్తమ నటి విభాగంలో బహుమతులు సాధించింది.
- నీరుపొయ్ నాటిక 7 భాషలలోకి అనువాదమయ్యి చరిత్ర సృష్టించంది.
- ఈ చరిత్ర ఏ సిరాతో నాటకం దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 200 సార్లు ప్రదర్శించబడింది
అవార్డులు - పురస్కారాలు
నంది అవార్డులు: ఉత్తమ నటుడు - నిజాయితి (నాటిక) - 2000, ఉత్తమ నాటకం - మధురం, ఉత్తమ రచన - శివరంజని, నాలుగు అవార్డులు - గబ్బిలం (నాటిక), రెండు అవార్డులు - అని తెలుస్తుంది (నాటిక).
ఇతర అవార్డులు: కళాసాగర్ అవార్డులు (1981 నుండి 84 వరకు, వరుసగా మూడుసార్లు), 62సార్లు ఉత్తమ రచయిత అవార్డులు, 50సార్లు ఉత్తమ దర్శకుడు అవార్డులు, 110సార్లు ఉత్తమ నటుడు అవార్డులు.
మహాకవి గురజాడ స్మారక పురస్కారం, కళా విరించి - గుంటూరు, పీపుల్స్ రైటర్ - జవ్వాది ట్రస్టు
ఒసేయ్ రాములమ్మా షూటింగ్ లో దాసరి నారాయణరావు, విజయశాంతిలతో సంజీవి |
తెలుగు సినీరంగంలో 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేసిన సంజీవి సినీ జీవితంలో అనేక చిత్రాలు మైలురాళ్ళుగా నిలిచాయి. అలజడి చిత్రానికి రచయితగా పనిచేశారు. ఈయన రచయితగా పనిచేసిన 'అన్న' (డా. రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం) చిత్రం నాలుగు రాష్ట్ర అవార్డులను అందుకోవడమేకాకుండా, ఆస్కార్ కూడా నామినేట్ అయింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్ గా నటించిన 'ఒసేయ్ రాములమ్మా' చిత్ర రచనలో సంజీవి తన సహకారమందించారు. ఈ చిత్రం అంతకుముందున్న బాక్సాఫీస్ రికార్డులను అధిగమించడమేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులతోపాటూ ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈయన రచయితగా చేసిన మరో సినిమా ఎర్రమందారం. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో రాష్ఱ్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ అవార్డు గెల్చుకుంది. ఒరేయ్ రిక్షా, సమ్మక్క సారక్క వంటి ఎన్నో చిత్రాలకు పనిచేసిన సంజీవి తమిళ, కన్నడ వంటి ఇతర భాషా చిత్రాలకు కూడా పనిచేశాడు. తెలుగోడు చిత్రానికి దర్శకత్వం వహించాడు.
టీవీరంగం
"భరత నాట్యం", "అంతరంగాలు" "మాతృదేవత", "ప్రతిఘటన", "నిన్నే పెళ్ళాడుతా" "సూర్యవంశం", "అపరాజిత", "పెళ్ళి", "కృష్ణవేణి", "మనసంతా నువ్వే", "కళ్యాణ తిలకం", "సీతమ్మ మాఅమ్మ", "బ్రహ్మముడి", "ఆరాధన", "శివరంజని", "గోరంత దీపం" వంటి సీరియళ్ళలో నటించారు.