(4వ భాగం కొనసాగింపు)
మన అలంకార శాస్త్రం సహృదయుడ్ని ఇలా పేర్కొంది.
‘‘ఏషాం కావ్యానుశీలనాం అభ్యానవశాత్
విశ్వభూతే మనోముకులే వర్ణనీయ
తన్మయీ భావనా యోగ్యతాతే
సహృదయ సంవాద భాజాః సహృదయాః’’ అని
మన అలంకార శాస్త్రం సహృదయుడ్ని ఇలా పేర్కొంది.
‘‘ఏషాం కావ్యానుశీలనాం అభ్యానవశాత్
విశ్వభూతే మనోముకులే వర్ణనీయ
తన్మయీ భావనా యోగ్యతాతే
సహృదయ సంవాద భాజాః సహృదయాః’’ అని
అంటే విమర్శకుడు అంటే సహృదయుడు పరిణితుడై వుండాలీ అన్నది దీనర్థం. రచనద్వారా లేదా ప్రదర్శన ద్వారా తాను అనుభవించిన అనుభూతులన్నింటినీ విపులంగా, సమగ్రంగా, విశదీకరించి చెప్పగలగాలి. నిష్కలంకంగా, నిర్భయంగా, పారదర్శకంగా వ్యక్తీకరించే ‘దర్పణం’లా ఉండాలి. రచయిత హృదయాన్ని అర్థం చేసుకొని, ఆ హృదయావిష్కరణకు పూనుకోవాలి.
ఊరికే అనవసర, అప్రస్తుత, అకారణ వ్యాఖ్యల, వర్ణన చేయటం విమర్శకాదు. తాను పొందిన అనుభూతికీ, ప్రయోజనానికీ ‘విలువ’ కట్టగలగాలి. అప్పుడే ా విమర్శ ఒక ప్రయోజనాన్ని కలిగి ‘సహేతుక విమర్శ ’ అనిపించు కుంటుంది. అయితే విమర్శకుడిగా తాను నిర్వహిస్తోన్న ఈ బాధ్యతా క్రమంలో ఎన్నో విమర్శకులకు గురౌతాడు. వాటిని లెక్కచేయక ముందుకు వెళ్ళేవాడే విమర్శకుడు (సహృదయుడు). మారుతున్న పరిణామాలు, విలువల్ని ఆయా రచయితలకు సూచించే బాధ్యత కూడా విమర్శకుడిదే. రచన లేదా ప్రదర్శన విలువల్ని విశ్లేషించి, విలువ కట్టి పాఠకుల, ప్రేక్షకుల అభిరుచిని బేరీజు వేయటం లేదా సరిచేయట లేదా పెంపొందించే బాధ్యత కూడా విమర్శకుడిదే...
అప్పుడే ఆ రచన లేదా ప్రదర్శన మెరుగులు దిద్దుకుని ప్రజాదరణ పొందుతుంది. అంటే నాటక ప్రదర్శన విజయవంతం గావటానికి విమర్శ ఎంత అవసరమో విమర్శకుడూ అంతే అవసరం. అంతేకాదు.. సహేతుకమైన విమర్శ ఆ నాటక ప్రదర్శన ప్రోత్సాహానికి కూడా దారి తీస్తుంది.
ఇదంతా నేను కేవలం నాకు తెలిసిన పెద్దలను, ఆయా పుస్తకాల్లోనూ చదివి తెలుసుకున్నది కొంతైతే.. నా అనుభవంలో.. నాగమనంలో నేను సేకరించిన అంశాలు మరికొన్ని... దయచేసి వీటిపై మీ కామెంట్లు తెలియజేయగలరు.
మీ
విద్యాధర్ మునిపల్లె.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి