17, నవంబర్ 2021, బుధవారం

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవంబరు 15, 16 తేదీల్లో నిర్వహించాము. ఈసారి పరిషత్ నిర్వహణ కొంత ఆర్థిక భారంగానే అనిపించింది. గతంలో పోగైనంత ఫండ్ కూడా ఈ సంవత్సరం పోగవ్వలేదు. ఎలానా అని బాగా ఆలోచించాను. అయినా సరే మిత్రులు కొంతమంది సహకారంతో పరిషత్ నిర్వహణకు పూనుకున్నాను. 

ముఖ్యంగా డేట్స్ అడ్జస్ట్ మెంట్ విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొంది. మిత్రుడు చెరుకూరి సాంబశివరావు ద్వారా నేను శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు పాలక మండలి అధ్యక్షులు శ్రీ చిటిపోతు మస్తానయ్య గారిని కలవటానికి వెళ్ళాను. చెరుకూరి సాంబశివరావు చొరవతోనే నాకు నవంబరు నెలలో 15,16 రెండు రోజులు మాత్రమే పరిషత్ నిర్వహించుకోటానికి తారీఖులు దొరికాయి. అందులో ఎలాంటి సందేహంలేదు. 

డేట్స్ దొరికాయి. నాటికలు రెండు మాత్రమే ఫైనల్ అయ్యాయి. వాటిలో ఒకటి నేను రాసిన ‘‘ కమనీయం’’ నాటిక అయితే.. రెండోది చెరుకూరి సాంబశివరావు రాసుకున్న ‘‘వసంతం’’ నాటిక. ఈ రెండు నాటికలు అజోవిభోకందాళం వారికి ప్రాధమిక పరిశీలన నిమిత్తం ప్రదర్శనలాగా ఇద్దామని అనుకున్నాం. అయితే మరికొంత మంది మిత్రుల్ని నేను అడిగి చూశాను. మీరు కూడా నా పరిషత్ లో ప్రదర్శనలాగా స్క్రూటినీ ఇస్తారా అని. వారిలో ఒకరిద్దరు ముందు ఇస్తామన్నారు. తర్వాత ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. నేను సరేలెమ్మనుకున్నాను. ఇలాంటి సమయంలో నాకు నా మిత్రుడు ఎం.మధు తన నాటిక ‘‘ తిరుగుప్రయాణం’’ ఆడతానన్నాడు. నాకు ఇక్కడికి మూడు నాటికలు వచ్చేశాయి. ఇంకొక్క నాటిక అయితే బాగుంటుంది అనుకున్నాను. అయితే ఏదీ.. ఏదీ అని ఆలోచిస్తుండగా.. ఈసారి పౌరాణిక నాటకం పెడితే బాగుంటుందని నాకు అనిపించింది. 

గతంలో నా మిత్రుడు చిలకలూరిపేటకు చెందిన సాంబశివ నాయక్ తను హరిశ్చంద్ర నేర్చుకుంటు న్నానని నాకు చెప్పి వున్నాడు. అతన్ని కన్సల్ట్ అయ్యాను. అతను ప్రదర్శించటానికి ఒప్పుకున్నాడు. కాటి సీన్ వద్దు.. వారణాసి ఆడతావా అని అడిగాను. దానిక్కూడా సరే అన్నాడు. అలా నా పరిషత్ లో నాటికలు సెట్ అయిపోయాయి. 

నాటకరంగానికి సేవలు అందించిన కొంతమందిని గుర్తించి వారికి సన్మానాలు.. ఏర్పాటు చేయాలనుకున్నాను. అలా మొదటిసారిగా నా దృష్ఠిలోకి వచ్చిన వ్యక్తి ‘‘ శ్రీ మానాపురం సత్యనారాయణ గారు’’ .  వీరికి ‘‘రంగస్థల నట సామ్రాట్ పురస్కారం’’ ఇవ్వటం జరిగింది. రెండవ వ్యక్తిగా మిత్రుడు ‘‘ చెరుకూరి సాంబశివరావుని’’ ఎంచుకున్నాను. అతనికి పీపుల్ స్టార్ అనే పురస్కారాన్ని అందించాను. రెండవ రోజు పురస్కారాలు నా నాటక రచనకి తొలిగురువు అయిన ‘‘నెమలికంటి వెంకటరమణ’’కి ‘‘ది గురు’’ పురస్కారం.. నాకు అన్ని సందర్భాల్లో వెన్నంటి వుండి ఆదుకున్న నా మిత్రుడు ‘‘ఎం.మధు’’ కి ‘‘పీపుల్ వాయిస్’’ అనే పురస్కారం అందజేయాలని నిర్ణయించాను. 

ఇప్పుడు వచ్చి డబ్బులు సమస్య.. నా దగ్గర మొత్తం ఎంతున్నాయో చూసుకుందామని అనుకున్నాను. పదిహేనువేల రూపాయలు మాత్రమే వున్నాయి. ఇవి ఎందుకూ చాలవు. అలాంటి సమయంలోనే నా స్నేహితుల్ని నేను డబ్బు సాయం కోరాను. వాళ్ళుకూడా వాళ్ళకున్నంత మేర డబ్బులు పంపించారు. ఫేస్ బుక్... వాట్సప్ లాంటి సోషల్ మీడియాల్లో కూడా అభ్యర్థనలు పంపాను. ఒకరిద్ధరు స్పందించారు. వారి శక్తి కొలది వాళ్ళు కూడా డబ్బులు అందించారు. అలా ఒక పాతిక వేలరూపాయలు పోగయ్యాయి. నాదగ్గరున్న పదిహేను వేలకి పాతికవేలు. టోటల్ 45,000 రూపాయలు వచ్చాయి. సరిపెట్టచ్చులే అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న అనుమానం. సరిపోకపోతే అని.. అయినా సరే అన్న మొండి ధైర్యం. మరోచోట కూడా ప్రయత్నించి చూద్దాం అని నా పెద్దమ్మ కొడుకు కిరణ్ ని అడిగాను. నేను అడిగీ అడగ్గానే వాడు పదివేల రూపాయలు పంపించాడు. ఇప్పుడు నాదగ్గరున్న అమౌంట్ 55,000 రూపాయలు. చాల్రా బాబూ అనుకున్నాను.


నామీదున్న అభిమానంతో నేను ప్రదర్శనా పారితోషికం తక్కువ ఇచ్చినా కూడా వచ్చి నాటిక ప్రదర్శనలిస్తున్న ఈ నాటక సమాజాల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఆడపడచు లాంఛనాలు చీర,జాకెట్, గాజులు, బొట్టు, కాటుక వంటివి నా సోదరి ‘‘ లహరి ’’ అందించింది. మొత్తానికి నేను అనుకున్నదానికంటే పరిషత్ విజయవంతంగా పూర్తిచేయటానికి ముందుండి మార్గదర్శనం చేశారు మిత్రుడు చెరుకూరి సాం
బశివరావు. వ్యాఖ్యాతగా బసవరాజు జయశంకర్ వహించారు. స్టేజీ మీద సంధాన కర్తగా ప్రముఖ నాటక రచయిత,దర్శకుడు, నటుడు కావూరి సత్యనారాయణ వహించారు. నేను పిలవగానే అభిమానంతో , వాత్సల్యంతో ప్రముఖ నాటక రచయిత, న్యాయనిర్ణేత నుసుము నాగభూషణం, ప్రముఖ న్యాయనిర్ణేత దేవిరెడ్డి రామకోటేశ్వరరావు, కళాసౌధ బిరుదాంకితులు బి.వేదయ్య, ప్రముఖ నటుడు,దర్శకుడు మానాపురం సత్యనారాయణ, రంగస్థల సినీనటుడు,దర్శకుడు,రచయిత చెరుకూరి సాంబశివరావు, ప్రముఖ రంగస్థల సినీ నటుడు,దర్శకుడు, వరికూటి శివప్రసాద్ లు పాల్గొని తొలిరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తొలిరోజు శ్రీ మానాపురం సత్యనారాయణగారికి, శ్రీ చెరుకూరి సాంబశివరావు గారికి పురస్కార ప్రదానం చేయటం జరిగింది.

మొదటి ప్రదర్శనగా శ్రీ సద్గురు కళానిలయం, గుంటూరు వారి ‘‘ కమనీయం ’’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు రచన: విద్యాధర్ మునిపల్లె, దర్శకత్వం : బసవరాజు వహించారు.

రెండవ ప్రదర్శనగా  అంజనారాథోడ్ థియేట్, చిలకలూరిపేట వారి ‘‘ సత్యహరిశ్చం ద్రీయం - వారణాసి సీన్’’ ప్రదర్శించారు. 



అలానే రెండవ రోజు కార్యక్రమాల్లో... డెక్ మెన్ కళాపరిషత్ నిర్వాహకులు శ్రీ రాజారావు, ప్రముఖ నటుడు, దర్శకుడు చిల్లర సుబ్బారావు, కాసరనేని సదాశివరావు పరిషత్ నిర్వాహకుడు కాట్రగడ్డ రామకృష్ణ, వరికూటి శివప్రసాద్, శ్రీ కావూరి సత్యనారాయణ, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, నటుడు, దర్శకుడు శ్రీ ఎం.మధు, ప్రముఖ నటుడు, దర్శకుడు, న్యాయనిర్ణేత, రచయిత శ్రీ నెమలికంటి వెంకటరమణ లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎం.మధుకి పీపుల్ వాయిస్, నెమలికంటి వెంకటరమణకి ‘‘ ది గురు’’ అనే పురస్కారాలు అందించటం జరిగింది. 



మొదటి ప్రదర్శనగా మధుథియేటర్ ఆర్ట్స్, తుళ్ళూరు వారి ‘‘ తిరుగు ప్రయాణం’’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు రచన,దర్శకత్వం : ఎం.మధు.

రెండవ ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి ‘‘ వసంతం’’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు మూలకధ : గంగారపు రాణి, నాటకీకరణ : దర్శకత్వం : చెరుకూరి సాంబశివరావు వహించారు. 

ఈ కార్యక్రమంలో వెనకవుండి నన్ను ముందుకు ప్రోత్సహించిన నా మిత్రుడు షేక్.డి.హసన్, సోదరి లహరి, అమృతవర్షిణిలు ఎంతగానో సహాయ సహకారాలు అందించటం జరిగింది. 

పరిషత్ నిర్వహణ దిగ్విజయంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 

7, సెప్టెంబర్ 2020, సోమవారం

మునిపల్లె నాటక పరిషత్ ప్రథమ నాటకోత్సవం

మునిపల్లె నాటక పరిషత్ ప్రథమ నాటకోత్సవాలు

 
మునిపల్లె నాటకపరిషత్ నాటకోత్సవాలు 2020 మార్చి 11 మరియు 12 తేదీల్లో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య వేదికపై ఐదునాటికలు ఎంపికచేసి ప్రదర్శించటం జరిగింది. ఈ సాయిరాఘవ మూవీమేకర్స్ మునిపల్లె నాటక పరిషత్ ప్రారంభించటానికి, నిర్వహించాలన్న ఆలోచన రావటానికి అంకురార్పణ చేసిన వ్యక్తులు వరుసగా డాక్టర్ జి.యస్.ప్రసాదరెడ్డి గారు, డి.రామకోటేశ్వరరావుగారు, కొల్లి మోహనరావుగారు, మానాపురం సత్యనారాయణగారు. నాటక పరిషత్ నిర్వహణ విషయంలో నేను వీరి ద్వారా అనేక సలహాలు, సంప్రదింపులు పొందాను. వీరిచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని పరిషత్ నిర్వహించాలని అనుకున్నాను. కానీ నిర్వహించగలనా అన్న సంశయంతో దాదాపు సంవత్సర కాలం గడిపేశాను. నామీద నాకు నమ్మకంలేకే ఇంత సమయం వృధా చేసుకున్నాను.  ఒకదశలో ఏదైతే అదైంది.. ప్రయత్నం చేద్దాం అని ఒక మొండిధైర్యం చేశాను. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని మా అన్నగారు చెరుకూరి సాంబశివరావు గారితో పంచుకున్నాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వేదిక విషయమై నేను వేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికను అనుకున్నాను. అక్కడ వేదిక దొరకటం చాలా అరుదైన విషయం. చాలా ముందుగా డేట్స్ బుక్ చేసుకోవాలి అని చెరుకూరి సాంబశివరావుగారు సూచించారు. అలాగే నా గురువుగారు నాయుడు గోపి గారు కూడా అదేమాట అన్నారు. అవసరమైతే ఆలయ నిర్వాహకులతో మాట్లాడతాను అని కూడా చెప్పారు. నేను తప్పకుండా మీ సహాయం పొందుతాను గురువుగారూ అన్నాను. 

ఆ తర్వాత నేను 2019 నవంబరు నెలలో ఆలయ కమిటీ వారికి లెటర్ అప్లై చేశాను. అయితే ఏవో కారణాలవల్ల వారినుంచి నాకు స్పందన రాలేదు. వారి నుంచి స్పందన వస్తుందిలే అని ఎదురు చూశాను. అయితే చెరుకూరి సాంబశివరావు అన్నగారు ఒకరోజు అడిగారు ఏం విద్యాధర్ పరిషత్ పనులు ఎంతవరకూ వచ్చాయి.. నేను విషయం చెప్పాను. అలా కాదు... నాతోరా.. అని ఆయనే దగ్గరుండి నన్ను దేవాలయ కమిటీ వారిదగ్గరకు తీసుకెళ్ళారు. నేను ఏ రోజు వారికి లెటర్ పెట్టిందీ చెప్పాను. వారు ఆ లెటర్ తీసుకొని చూశారు. అయితే మూడు నెలల వరకూ డేట్స్ లేవని చెప్పారు. సాంబశివరావు అన్నగారు వారిని వదలలేదు. మొత్తానికి ఎలాగోలా నాకోసం 2020 మార్చి నెలలో 11,12 కేటాయించారు. ఏం విద్యాధర్ హ్యాపీనా అన్నారు సాంబశివరావు అన్నగారు. నేను చాలా హ్యాపీ అన్నా అన్నాను. కానీ అసలు టెన్షన్ అప్పుడే మొదలైంది. నా పరిషత్ నిర్వహణకి చందాలు సేకరించాలి. ఎవరిని అడగాలి..? ఎక్కడ అడగాలో నాకు తెలీదు. అప్పటికీ నాకు తెలిసిన నట మిత్రులనీ, పరిషత్ నిర్వాహకులనీ అడిగాను. వారు కొంత సానుకూలంగా స్పందించారు. వారి వారి శక్తి కొలదీ అమౌంట్ పంపించారు. నా బంధువులనీ అడిగాను. వారు కూడా వారికి తోచింది పంపించారు. అయితే ఎంత అమౌంట్ వచ్చినా కూడా పరిషత్ నిర్వహణకు సరిపోదు. అదే సమయంలో నేను కెరటాలు నాటిక ప్రదర్శనలద్వారా పోగైన అమౌంట్ కొంత వుంది. ఆ అమౌంట్ ని కూడా ఇందులో వాడేందుకు సిద్ధమయ్యాను. నా పరిషత్ కి మొత్తం నేనే అయిపోయాను. నా పక్కన నిలబడటానికి పనులు అందుకోవటానికి మనుషులు లేకుండా పోయారు. అదే సమయంలో నేనున్నాను అంటూ నా మిత్రుడు మధు ముందుకొచ్చాడు. మొదటి రోజు కార్యక్రమాల నిర్వహణ అతనికి అప్పగించాను. రెండో రోజు నేను చూసుకున్నాను. వేదికపై బాధ్యత ఎవరు స్వీకరించాలి? అన్న అంశంలో ముందునుంచీ వున్న చెరుకూరి సాంబశివరావు అన్నగారిని అడిగాను. అయితే ఆయన కొత్తగా సినిమా ఓపెన్ అయిందనీ.. తాను దర్శకత్వ బాధ్యతలు చేపట్టాననీ కుదరటంలేదన్నారు. వెంటనే నేను నా మిత్రుడు బసవరాజు జయశంకర్ ని అడిగాను. ఆయన కాశీకి వెళ్ళేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నానని తన అశక్తత తెలియజేశారు. ఎవరు వేదిక మీద కార్యక్రమాలు నిర్వహించాలి అనే అంశంలో నాకు పెద్ద సమస్య ఎదురైంది. అయితే బసవరాజు జయశంకర్ దైవిక ఘటన వల్లనో మరే ఇతర కారణాల వల్లనో ఆయన కాశీ ప్రయాణం ఆగిపోయింది. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఇక వేదికపై కార్యక్రమనిర్వహణకి పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలేకుండా పోయింది. లైటింగ్ పనులు ఎవరికి అప్పగించాలి అనే అంశంలో నేను మొదటి నుంచి చాలా క్లారిటీగా వున్నాను. నా మిత్రుడు రాజారత్నంని అభ్యర్ధించాను. వెంటనే డేట్స్ రాసుకున్నాడు. మైక్ విషయంలో దేవాలయం వారే ఇచ్చారు. ఇక స్టేజీ కర్టెన్లు, డెకరేషన్లు వంటివి ఎక్కడ నుంచి తీసుకురావాలి అనే విషయంలో నాకు మరో ప్రశ్న.. అదే సమయంలో నా మిత్రుడు మధు తన దగ్గరున్నవి ఇచ్చాడు. నా మిత్రుడు పరమేష్ ని రంగాలంకరణ చేయాల్సిందిగా కోరాను. ఆయా నాటక సమాజాల వారికి మేకప్ బాధ్యతలు కూడా అతనికి సూచించాను. అతను కూడా సానుకూలంగా స్పందించాడు. 

ఇక్కడికి పరిషత్ నిర్వహణలో ఎవరి బాధ్యతలు వారు పూర్తిగా స్వీకరించారు. ఇక వచ్చిన నాటక సమాజసభ్యులకీ వసతి, భోజనం ఏర్పాట్లు ఈ విషయంలో నాకు రకరకాల ఆలోచనలున్నాయి. ఈ విషయం నా గురువుగారు నాయుడు గోపి గారు నాతో బృందావన్ గార్డెన్స్ లోని ఒక హోటల్ చెప్పారు. అక్కడ భోజనం రుచిగా వుందని చెప్పారు. వెంటనే అక్కడికి నా మిత్రుడు మధుతో చేరుకున్నాను. మధు తుళ్ళరు కళాపరిషత్ నిర్వహిస్తున్న అనుభవం వుంది. అందుకే అతన్ని తీసుకెళ్ళాను. అతను టిఫిన్, భోజనం రేట్లు మాట్లాడాడు. నేను అడ్వాన్స్ ఇచ్చేశాను. ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది నాటక సమాజ నిర్వాహకులకి షీల్డులు బహూకరణ, ఆడపడచు సత్కారం.. షీల్డుల విషయంలో ఎక్కడ దొరుకుతాయో చెరుకూరి సాంబశివరావు అన్నగారి సలహా తీసుకొని అక్కడికి వెళ్ళి షీల్డులు ఆర్డర్ ఇచ్చాను. ఆడపడచు సత్కారం విషయంలో నా చెల్లెళ్ళు అమృతవర్షిణి, లహరిలు ముందుకొచ్చారు. వారు స్పాన్సర్ చేశారు. ఇలా నేను ఒక్కడినే అనుకున్న సమయంలో మేమంతా నీకున్నాం.. నువ్వు కార్యక్రమం మొదలు పెట్టు అంటూ ప్రోత్సహించారు. నన్ను ప్రోత్సహించిన వారిని ఈ తరుణంలో తలచుకోవటం నా ధర్మం, నా బాధ్యత అని నేను అనను.. వారి పట్ల నాకున్న ప్రేమ అనురాగంతో తలచుకుంటున్నాను. నాకు ఆర్థికంగా సాయం చేసిన వారిలో 

1. పి.శివప్రసాద్ - విశాఖపట్నం
2. చిట్టి వెంకటరావు - శ్రీకాకుళం
3. రఘు, చెలికాని వెంకటరావు - కొండెవరం
4. మల్లేశ్వరరావు - కావలి
5. మంచాల రమేష్ - కరీంనగర్
6. మునిపల్లె సత్యనారాయణ - హైదరాబాద్
7. ఎం.మధు - తుళ్ళూరు
8. ఎం.రవీంద్ర - చిలకలూరిపేట
9. కె.వి.మంగారావు -చిలకలూరిపేట
10.డాక్టర్ జె.రవీంద్ర - తిరుపతి
11. బసవరాజు జయశంకర్ - గుంటూరు
12. గుడిపాటి యోగీశ్వరరెడ్డి - వీడియో, ఫోటో గుంటూరు

అతిధులను సత్కరించుకునే అవకాశంలో భాగంగా నాటక రంగంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ నాటకాన్నే వృత్తిగా స్వీకరించి నాటకరంగంలో అనేక విభాగాల్లో తనదైన ముద్రవేసుకొన్న యువకుడిని గుర్తించి చేసే సత్కారానికి మునిపల్లె నాటకపరిసత్ ‘‘జటాయువు’’ పురస్కారాన్ని అందించింది. అలాగే నాటకరంగాన్ని ప్రవృత్తిగా స్వీకరించి మానవీయ దృక్కోణంతో ముందుకు వెళుతున్న మరో వ్యక్తిని గుర్తించి వారు చేసిన సేవలకు గాను ‘‘రంగస్థల నటసింహం’’ అనే పురస్కారాన్ని కూడా అందించేందుకు నిర్ణయించాను.

11.03.2020 :  1. జటాయువు పురస్కారం 2020 - గోపరాజు విజయ్ - కొలకలూరు
12.03.2020 :  2. రంగస్థల నటసింహం 2020 - డాక్టర్ జలదంకి రవీంద్ర - తిరుపతి

కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహించటానికి సహకరించిన మిత్రులకీ, సన్నిహితులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను..

మీ 
విద్యాధర్ మునిపల్లె
మునిపల్లె నాటకపరిషత్, గుంటూరు

27, ఏప్రిల్ 2020, సోమవారం

ఆంధ్ర నాటక కళా పరిషత్తులో నెల్లూరు జిల్లా, వెంకటగిరి పట్టణ పాత్ర

1944,45 సంవత్సరాలలో వెంకటగిరిలోని అమెచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి ఏలూరు వాస్తవ్యులు శ్రీ కొండముది గోపాలరాయ శర్మ వారు రచించిన ఎదురీత అనే నాటకాన్ని టి. ఈశ్వర దాస్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర నాటక కళా పరిషత్ విజయవాడ దుర్గా కళామందిరంలో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ సంగీతం బహుమతులు సాధించారు. ఇందులో బాలసరస్వతి గారు నటించారు. దీనికి ఆత్రేయ గారు 5 పాటలు రాశారు.

ఆ తర్వాత, ఆత్రేయ గారు రచించిన రామ్ రహీం, నాటకం 1949,50 సంవత్సరాలలో ప్రదర్శించి ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన బహుమతి సాధించారు. ఆ నాటకంలో శ్రీ మోహన్ దాస్ గారికి ఉత్తమ సంగీతం బహుమతి వచ్చింది. ఆ తరువాత వరుసగా ఆత్రేయ గారి కప్పలు, ఎన్జీవో నాటికలు ఆంధ్ర నాటక పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన బహుమతులు సాధించాయి. ఆ తర్వాత వెంకటగిరిలోని కల్చర్ ఆర్ట్స్ థియేటర్ వారు శ్రీ వేణు గారి రచన, దర్శకత్వంలో దిష్టి బొమ్మలు అనే నాటకాన్ని ఆంధ్ర నాటక కళా పరిషత్ లో ప్రదర్శించగా శ్రీ వేణు గారికి ఉత్తమ నటుడు బహుమతి వచ్చింది.

కాలగమనంలో అన్ని సంస్థలు ఒకే తాటి మీదికి వచ్చి నట సమాఖ్య పేరుతో బహుశ 1963 నుండి 2004 వరకు దిగ్విజయంగా, ప్రతిష్టాత్మకంగా పరిషత్తు నిర్వహించడంతోపాటు శ్రీ జిఎం శాస్త్రిగారు రచించిన ఈ జనానికోదండం నాటకం పరిషత్తులలో ప్రదర్శించారు.

కె.వి.రమణారెడ్డిగారు, వేణు గారు జంటగారాసిన ‘రాజీవం’ నాటికను తొలిసారిగా ఈ సమాజంవారే ప్రదర్శించగా, తర్వాత
జి.యస్.ఆర్. ముార్తిగారు పాపులర్ చేశారు.
(ఈ సమాచారం వెంకటగిరి వాస్తవ్యులు, సీనియర్ నటులు గురుతుల్యులు శ్రీ ఎస్ ఎల్ నరసింహం గారి నుండి జిబికె మూర్తిగారు సేకరించారని తెలిసింది.)

25, ఏప్రిల్ 2020, శనివారం

సాంఘీక నాటక రంగానికి పుట్టినిల్లు పాలకొల్లు


కళలకు నిలయం కళాకారులకు ఆలయమైన పాలకొల్లు సాంఘీక నాటక రంగానికి పుట్టినిల్లు గా పేరుగాంచింది. పినిశెట్టి శ్రీరామమూర్తి, చలం‌, అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కొసనా ఈశ్వర్, కాశీనాధుని సత్యనారాయణ, మల్లది సత్యనారాయణ, దుర్వాసుల వెంకట శాస్త్రి, భమిడపాటి శ్రీ రామమూర్తి, భమిడపాటి లక్ష్మీ నారాయణ, ఆండ్ర శేషగిరిరావు, పోకల నరశింహారావు‌, ఉషా బాబూరావు, ఓఎస్.రావు, వంగానరశింహారావు, దాసరి సత్యనారాయణ మూర్తి, తొట్టెంపూడి ఆంజనేయులు, రావూరి నాగభూషణం, వంగా అప్పారావు, పేలూరి దాసు, కొంగరాపి అప్పారావు, బోనం బాబూరావు, చేగొండి సత్యనారాయణ మూర్తి, కత్తుల రామమోహన్, వీ‌రాఅప్పారావు, వీరా పోతన, గండేటి వెంకటేశ్వరరావు, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, గంటా రామమోహన్, మానాపురం సత్యనారాయణ, రాజా తాతయ్య, విన్నకోట వెంకటేశ్వరరావు, యియ్యిపు రామలిగశ్వరరావు తదితరులు నాటక రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందారు.



పాలకొల్లు కిచెందిన పినిశెట్టి శ్రీ రామమూర్తి రచించిన ఆడది, అన్నాచెల్లెలు, పల్లెపడుచు వంటి నాటకాలు ఎంతే పేరు ప్రఖ్యాతులు పొంది నేటికీ ఎక్కడో ఒక చోట ప్రదర్శింపబడుతున్నాయి. వీరా పోతన రచించిన తల్లీ క్షమించు నాటిక నంది నాటకోత్సవాలో పాల్గొని అనేక బహుమతులు పొందారు. తాళాబత్తుల వెంకటేశ్వరరావు సైకతశిల్పం, సప్తపది, దిష్టబొమ్మలు వంటి నాటికలు రచించి నాటకరంగలో మంచి రచయితగా పేరుపొందారు. విన్నకోట వెంకటేశ్వరరావు, రాజా  తాతయ్య, మానాపురం సత్యనారాయణ, వంగా నరశింహారావు నంది నాటకోత్సవాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

పాలకొల్లుకి చెందిన మాంటిస్సోరి స్కూల్, దీప్తి స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బాలల నాటికలు నంది నాటకోత్సవాలలో పాల్గొని అనేక బహుమతులు పొందారు.

పాలకొల్లు నాటక పరిషత్తులు
చలనచిత్రరంగంలో పాలకొల్లు కళాకారులు ప్రధాన పాత్ర పోషించడానికి ఇక్కడి నాటక పరిషత్ లు కీలకపాత్ర వహిచాయి.దాదాపు అరవై సంవత్సరాల క్రితం నాటక రంగాన్ని ఆంద్ర నాటక కళాపరిషత్ ఆదుకున్న సమయంలో పాలకొల్లు లో కొందరు యువకులు మిత్ర బృందం అనే సంస్థ ను ఏర్పాటు చేసి దసరా ఉత్సవాల సందర్భంగా నాటక పోటీలు నిర్వహించారు. పాలకొల్లు లో నాటక పరిషత్ లు ప్రారంభించడానికి తొలిమెట్టు బొండాడ పెంటయ్య, బొండాడ వెంకట్రాజు గుప్త, వంకాయల పురుషోత్తం, జస్టీస్ ఇయ్యపు పాండురంగారావు, పినిశెట్టి సత్యనారాయణ, కూరెళ్ళ సత్యనారాయణ, అద్దేపల్లి రాంప్రసాద్, చుండూరి రెడ్డిబాబు, గమిని మాణిక్యాలరావు, శ్రీ కాకొల్లు రామబ్రహ్మం, వేము రామలిగయ్య వంటి కళిభిమానులు దాదాపు 14సంవత్సరాలు నాటక పరిషత్ నిర్వహించారు. ఈ పరిషత్ లో ఆదుర్తి సుబ్బారావు, సావిత్రి వంటి ప్రముఖులను సన్మానించారు. పాలకొల్లు నాటక పరిషత్ పేరిట జాన నాగేశ్వరరావు, బోళ్ళ సర్వేశ్వరరావు‌, ఉషాబాబూరావు, వీరా అప్పారావు, కొంగరాపి అప్పారావు, వీరా సత్యం, గుత్తికొండ కాశీ నాయకత్వం వహించారు.

1964లో కొంతమంది యువకులు నెహ్రూ ప్రెండ్స్ యూనియన్ స్దాపింఛి నాటిక పోటీలు రెండు సంవత్సరాలు చేసారు. ఈ సంస్థకు కందుల అప్పారావు, వంగా నరశింహారావు, బందెల ఈశ్వరరావు, కొంగరాపి అప్పారావు కర్రా సత్యనారాయణ, పిహెచ్.గోపాలరాజు సారద్యం వహించారు. ఈ కాలంలోనే సోమేశ్వర అగ్రహారం లో ఆంజనేయ కళాపరిషత్, వీవర్స్ కాలనీ యువజన సంఘం ఆద్వర్యంలో నాటికల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాజాను బద్రం‌, ఓఎస్.రావు, విన్నకోట వెంకటేశ్వరరావు, కొడవటీ దత్తు, మానెం దుర్గాప్రసాద్ సారద్యం వహించారు.

చేగొండి వెంకట హరరామ జోగయ్య ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో పాలకొల్లు లోని పరిషత్ లు అన్నీకలిపి సంగీత నాటక అకాడమీ గా రూపకల్పనచేసి నాటక పోటీలు నిర్వహించారు. దీనికి జోగయ్య, ఆద్దేపల్లి రాంప్రసాద్, అత్యం జగన్మోహన్, చుండూరి రెడ్డి బాబు,వంగా నరశింహారావు నాయకత్వం వహించారు. స్వర్గీయ కోడి రామకృష్ణ స్వర్గీయ దాసరి నారాయణ రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కాలంలో మిత్రులు సహకారంతో దాసరి నారాయణ రావు కల్చరల్ అసోసియేషన్ స్థాపించి 5 సంవత్సరాలు నాటికల పోటీలు నిర్వహించారు. దీనికి ఇయ్యిపు పాండురంగారావు, కొటికలపూడి రాజమోహన్ రావు,  ఇయ్యిపు రామచంద్రరావు, ఇయ్యిపు రామలిగేశ్వరరావు, శివాల ప్రభాకర్ సారధ్యం వహించారు.

ప్రముఖ జర్నలిస్ట్ అడబాల వీరాస్వామి రాజా 1960లో మహాత్మా మైత్రిబృందం అనే నాటక సంస్థను స్థాపించడం ద్వారా పాలకొల్లు నాటక పరిషత్ ల చరిత్ర మలుపు తిరిగింది. ఈ నాటక పరిషత్తు పోటీల సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, గుర్రం జాషువా, బోయి భీమన్న, నటరాజ రామకృష్ణ, సంపత్ కుమార్, చెరుకువాడ నరసింహం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య, బాట్టం శ్రీ రామమూర్తి, అద్దేపల్లి వివేకానంద దేవి, క్రొవ్విడి లింగరాజు వంటి ఉద్దండులు పాల్గొన్నారు. మహాత్మా మైత్రి బృందానికి మాజీమంత్రి చేగొండి వెంకట హరరామ జోగయ్య, చల్లా రాజా, అందే పిచ్చయ్య, ఇయ్యిపు వీరబద్రం, చీకట్ల నరసింహమూర్తి, పోలిశెట్టి బేబి, కొంగరాపి అప్పారావు, మండెల వెంకట నర్సయ్య సారద్యం వహించారు.

వర్ధనీడి సత్యనారాయణ ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో వర్దినీడి బాబ్జీ, చుండూరి రెడ్డి బాబు,చందక రాము ఆధ్వర్యంలో క్షీరపురి నాటక అకాడమీ పేరుతో నాటికల పోటీలు నిర్వహించారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం సహకారంతో దాసరి నారాయణరావు కల్చరల్ యూనిట్ పేరుతో రెండు సంవత్సరాలు నాటక ల పోటీలు సురభి నాటకోత్సవాలు నిర్వహించారు.

ఈ నాటక పోటీలకు డాక్టర్ సీహెచ్. సత్యనారాయణ మూర్తి, వీరా శ్రీనివాస్, వంగా నరశింహారావు, కత్తుల రామమోహన్, పోలిశెట్టి శ్రీనివాస్, రావూరి చాచా, గండేటి వెంకటేశ్వరరావు, వీరా పోతన సారద్యం వహింఛారు.

శ్రీ రామపేట దేవి ఫ్రెండ్స్ యూనియన్ పేరిట రాజా తాతయ్య,శివాల రామారావు, చీర దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నాటక పరిషత్ నిర్వహించారు.

పాలకొల్లు లలిత కళాంజలి నాటక అకాడమీ కి జస్టీస్ ఇయ్యిపు పాండురంగారావు, వాకాడ అప్పారావు, కొటికలపూడి రాజమోహనరావు, ఇయ్యిపు రామలింగేశ్వర రావు, ఇందుకూరి దిలీప్ కుమార్ రాజు, కొటికలపూడి కృష్ణా రావు, మానాపురం సత్యనారాయణ, శివాల దుర్గా ప్రసాద్, నీలంశెట్టీ సత్యప్రసాద్, మేడికొండ శ్రీనివాసరావు సారద్యం వహించారు.

2008లో మానాపురం సత్యనారాయణ వ్యవస్థాపకునిగా పాలకొల్లు కళాపరిషత్ ఆవిర్భావం జరిగింది. చలం స్మారక నాటకోత్సవం, అల్లు రామలింగయ్య, పినిశెట్టి శ్రీ రామమూర్తి, ఇవివి సత్యనారాయణ, వంగా అప్పారావు స్మారక నాటకోత్సవాలు, డాక్టర్ గజల్ శ్రీ నివాస్ పాలకొల్లు కళాపరిషత్, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ స్మారక నాటకోత్సవం 12సంవత్సరాలుగా నాటికల పోటీలు నిర్వహిస్తున్నారు. కె.వి.కృష్ణ వర్మ‌‌, మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీ నివాసరావు, విన్నకోట వెంకటేశ్వరరావు, డాక్టర్ వర్మ, జక్కంపూడి కుమార్, కొణిజేటి గుప్త, విఠాకుల రమణారావు సారధ్యం వహిస్తున్నారు. పాలకొల్లులో సుదీర్ఘ కలం నాటక పరిషత్ నిర్వహించిన సంస్థ లలిత కళాంజలి నాటక అకాడమీ 33 సంవత్సరాలు నిర్వహించారు.

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ద్వారా సినీ దర్శకునిగా పరిచయ మైన కోడి రామకృష్ణ మిత్రుల సహకారంతో 33సంవత్సరాల పాటు నాటికల పోటీలు నిర్వహించారు. 1983లో ఈ పరిషత్ ప్రారంబించి తొలుత నాటకాలు, తర్వాత నాటకాలు, నాటికల పోటీలు నిర్వహించి అతి పెధ్ద పరిషత్ గా పేరు పొందింది. ఆయన బతికి ఉంటే మరల పరిషత్ జరిపేవారు.
(పాలకొలను వార్తా పత్రిక, 10వ వార్షికోత్సవ సంచిక, 16 నవంబరు 2013, పుట. 15,16. )
(వ్యాస రచయిత: మానాపురం సత్యనారాయణ, జర్నలిస్ట్, పాలకొల్లు కళా పరిషత్ వ్యవస్థాపకుడు)

16, ఏప్రిల్ 2020, గురువారం

చెంగల్వ పూదండ (నాటిక)

చెంగల్వపూదండ నాటిక తెలుగు భాష ఔన్నత్యాన్నీ, ఆవశ్యకతనూ చాటిచెప్పే రచన. పరభాషా వ్యామోహంలో మాతృభాషను మరవొద్దని సున్నితంగా చెప్పిన ప్రదర్శన. శిష్టా చంద్రశేఖర్ రచనను శ్రీ కళానికేతన్, హైదరాబాదు వారి సమర్పణలో డా. వెంకట్ గోవాడ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు చేశారు.

ప్రదర్శన వివరాలు

  1. 05.01.2013 అజో-విభో ఫౌండేషన్, అనంతపురం
  2. 22.01.2013 నంది నాటకోత్సవం, విజయనగరం
  3. 31.01.2013 ఎన్ టి ఆర్ కళా పరిషత్. ఒంగోలు
  4. 10.02.2013 భద్రాద్రి కళా పరిషత్, భద్రాచలం
  5. 26.02.2013 పాలకొల్లు కళా పరిషత్, పాలకొల్లు
  6. 27.02.2013 ద్రాక్షారామ నాటకపరిషత్, ద్రాక్షారామం
  7. 01.03.2013 రంగస్థలి, నరసరావుపేట
  8. 02.03.2013 ఎన్.టి.ఆర్ కళాపరిషత్, గుంటూరు
  9. 24.03.2013 కోన ప్రభాకరరావు నాటకపరిషత్తు, బాపట్ల
  10. 25.03.2013 అభినయ నాటకపరిషత్తు, రావులపాలెం
  11. 10.04.2013 సి.ఆర్.సి.కాటన్ కళాపరిషత్తు, రావులపాలెం
  12. 11.04.2013 ఏ.ఎస్.రాజా నాటకోత్సవం, విశాఖపట్నం
  13. 18.04.2013 శ్రీ కళానికేతన్ వార్షికోత్సవం, హైదరాబాదు
  14. 27.04.2013 వి.ఎస్.ఎమ్. కళాపరిషత్తు, రాయవరం
  15. 28.04.2013 ప్రగతికళామండలి, సత్తెనపల్లి
  16. 29.04.2013 పరుచూరి రఘుబాబు పరిషత్తు, పల్లెకోన
  17. 04.05.2013 నాగార్జున కళా పరిషత్తు, కొండపల్లి
  18. 05.05.2013 ఎస్.కె.ఎల్. కళాపరిషత్తు, శ్రీకాళహస్తి
  19. 06.05.2013 ఎస్.ఎం. నాటకపరిషత్తు, తాటిపర్తి
  20. 17.05.2013 పల్నాడు కళాపరిషత్తు, పిడుగురాళ్ళ
  21. 25.05.2013 పి.ఎ.ఎం.ఎస్.శతాబ్ది ఉత్సవాలు, బాపట్ల
  22. 04.06.2013 బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాదు
  23. 08.06.2013 ఎ.ఎస్.ఆర్. కళాపరిషత్తు, కాకినాడ

బహుమతుల వివరాలు

  • 2013 అజో విభో కందాళం ఫౌండేషన్ అనంతపురం (ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు)
  • 2013 నంది నాటకోత్సవాలు, విజయనగరం (ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన)
  • 2013 పాలకొల్లు కళాపరిషత్తు, పాలకొల్లు (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 ద్రాక్షారామ నాటక కళాపరిషత్తు, ద్రాక్షారామం(ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 రంగస్థలి, నర్సరావుపేట (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 కోన ప్రభాకరరావు పరిషత్తు, బాపట్ల (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ ప్రశంసా నటి, ఉత్తమ ప్రశంసా నటుడు)
  • 2013 అభినయ నాటక పరిషత్తు (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ రచన)
  • 2013 సి.ర్.సి. కాటన్ కళాపరిషత్తు, (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు)
  • 2013 ఏ.ఎస్. రాజా నాటకోత్సవాలు, విశాఖ (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం)
  • 2013 శ్రీకారం రోటరీ కళాపరిషత్తు, మార్టూరు (ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ తృతీయ ప్రదర్శన)
  • 2013 వి.ఎస్.ఎన్.మూర్తి కళాపరిషత్తు, రాయవరం (ఉత్తమ ఆహార్యం)
  • 2013 ప్రగతి కళామండలి, సతేనపల్లి (ఉత్తమ రచన, ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం)
  • 2013 నాగార్జున కళాపరిషత్తు, కొండపల్లి (ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ బాల నటి)
  • 2013 కళావాణి, నాగులపాలెం (ఉత్తమ రచన, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన)
  • 2013 మార్కండేయ నాటక కళాపరిషత్తు, తాటిపర్తి (ఉత్తమ బాలనటి )
  • 2013 బి.హెచ్.ఈ.ఎల్., హైదరాబాద్ (ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటి, ఉత్తమ జ్యూరీ నటుడు)
(డా. వెంకట్ గోవాడ గారు రాసినది)

9, ఏప్రిల్ 2020, గురువారం

నాటకరంగానికి వన్నెతెచ్చిన శ్రీరాముల సత్యనారాయణ


నాటకరంగ మేరు శిఖరం,  కరీంనగర్ నాటక రంగానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ప్రముఖ వ్యక్తి శ్రీరాముల సత్యనారాయణ. నాటక రచయితగా దర్శకునిగా నటునిగా పలువురి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన. భేషజాలకు ఆర్భాటాలకు, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఉత్తమ వ్యక్తిత్వం తో పాటు నాటక కళా ప్రతిభ కలిగిన వాడు ఆయన. సమాజ హితాన్ని చేకూర్చడమే కాకుండా సమాజంలో పరివర్తన కలిగించే నాటకాలను రచించి, నటించి, ప్రదర్శించిన ప్రయోగశీలి. నాటక సామాగ్రి తక్కువగా, పాత్రలను పరిమితంగా ఉపయోగిస్తూ గొప్ప దృశ్యాన్ని, సందేశాన్ని అందించడం ఆయన రచనా పాటవానికి నిదర్శనం. పాత్రల ఎంపికలో రూపకల్పనలో సంభాషణల కూర్పు లో  ఎక్కడ కృత్రిమత్వం లేకుండా సహజంగా మన మధ్యన జరుగుతున్నట్లుగా ఉంటూ ఆలోచన, ఆవేదన, ఆనందం, అన్నిటికీ మించిన సందేశం ఆయన నాటకాల్లో ప్రత్యేకం.

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో 6 జనవరి 1952 రోజున జన్మించిన శ్రీరాముల సత్యనారాయణ బీఎస్సీ అగ్రకల్చర్ పూర్తి చేసి  వ్యవసాయ అధికారి గా  అనేక సంవత్సరాలు విశిష్ట సేవలు అందించారు. వృత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోపక్క నాటక రంగానికి ఎనలేని సేవ చేశారు. 1970లో పదవి కోసం అనే నాటికలో నటించి రంగ ప్రవేశం చేసిన సత్యనారాయణ ఆ తర్వాత అనేక నాటకాలలో నటించి రాష్ట్రస్థాయిలో పలు బహుమతులు గెల్చుకున్నారు. పద్మ కళానికేతన్ సంస్థకు కార్యదర్శి గా 1980లోనే రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు.

1985 మే 1 న ఆయన కునమల్ల రమేష్, బండారి శ్రీరాములు, తిప్పర్తి ప్రభాకర్, బండారి రవీందర్ తదితరులతో కలిసి  చైతన్య కళాభారతి అనే నాటక సంస్థను స్థాపించారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే *నటనా జ్యోతి* కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నాటిక ప్రదర్శన కరీంనగర్ కళాభారతిలో ఏర్పాటు చేయడం ఆయన ప్రతిభకు తార్కాణం. ప్రతి మాసం నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించడం తో పాటు  నటించడం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. పాటు విజయవంతంగా నిర్వహించిన తర్వాత మరుసటి సంవత్సరం త్రైమాసిక కార్యక్రమం ఏర్పాటు చేసి తన బృందంతో నాటకాలు ప్రదర్శించడమే కాకుండా చైతన్య కళాభారతి కీర్తి పతాకాన్ని రాష్ట్రం నలుదిశలా ఎగరవేశారు.  మొట్టమొదటిసారిగా 1981లో ఈ తరం మారాలి అనే నాటికను విద్యార్థులు విద్యా విధానం ఇతివృత్తంగా తీసుకుని రచించారు. ఇక ఆ తర్వాత పామరులు,శివమెత్తిన సత్యం, ఆకలి వేట, ప్రేమ పిచ్చోళ్ళు, మనిషి, ఆడది అబల కాదు, నిరసన, కాలచక్రం, నేను పట్నం బోతనే, రైతు రాజ్యం, చదవరా, ఆశాపాశం, అగ్ని పరీక్ష, మలిసంద్య లాంటి నాటకాలు రచించి ఉత్తమ రచయితగా వివిధ పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. ఈ నాటకాలన్నీ బీహెచ్ఈఎల్, మంచిర్యాల, సంగారెడ్డి, ఇందూరు,  వర్ధన్నపేట మొదలగు రాష్ట్ర స్థాయి నాటక పోటీలలో ప్రదర్శించబడి ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ప్రదర్శన లాంటి బహుమతులు ఆయన, ఆయన బృందం గెలుచుకున్నారు. అనేక సంవత్సరాలు చైతన్య కళాభారతి పక్షాన తెలంగాణ స్థాయి నాటక పోటీలు నిర్వహించి కరీంనగర్ కళాకారులు పలు ఉత్తమ నాటకాలను చూసే అవకాశాన్ని కల్పించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం- అక్షర ఉజ్వల కోసం చాలా గ్రామాలలో నాటకాలను సంస్థ పక్షాన ప్రదర్శించి నిరక్షరాస్యుల లో చదువుకోవాలనే ఉత్సాహాన్ని కలిగించారు. అక్షర ఉజ్జ్వల కమిటీ నిర్మించిన నవోదయం అనే టెలి ఫిలిం కు కథా రచన సంభాషణలు సమకూర్చడం కాకుండా  ప్రముఖ దర్శకులు స్వర్గీయ  దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ఒక ప్రముఖ పాత్రను కూడా పోషించి అందరి ప్రశంసలు పొందారు.

 ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం లాంటి అవార్డు చిత్రాలకు దర్శకత్వం వహించిన బిఎస్ నారాయణ దర్శకత్వంలో  నిర్మించబడ్డ మార్గదర్శి సినిమాకు సామాజిక న్యాయం ఇతివృత్తంగా కథ, సంభాషణలు అందించడమే కాకుండా చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ చిత్రంలో ఆయన ఒక  పాత్రను కూడా పోషించారు.  ఆ సినిమా ద్వారా అనేక మంది నటీనటులకు అవకాశాన్ని కల్పించారు. ఈ చిత్రం 1993 లో జాతీయ సమైక్యత నంది పురస్కారాన్ని కూడా గెలుచుకుంది.
వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు గా ఉద్యోగ విరమణ పొందిన అనంతరం పరివర్తన, నేను బ్రతికే ఉన్నా, ష్ ఇలాంటి లఘు చిత్రాలకు కథ మాటలు అందించి వహించారు. ఆయన రాసిన వివిధ నాటకాలు పుస్తకాలుగా కూడా వెలువరించారు.
ఆ మధ్య మిషన్ కాకతీయ లో భాగంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అధికారుల సమావేశంలో శ్రీరాముల సత్యనారాయణ రైతు సమస్యలపై రూపొందించి నటించిన లఘు చిత్రాన్ని చూసి మంత్రి హరీష్ రావు కంట నీరు పెట్టిన వార్త అన్ని ప్రధాన పత్రికలలో రావడం విశేషం.

కరీంనగర్ జిల్లా కళాకారుల సమాఖ్య తొలి అధ్యక్షుడిగా సేవలందించారు. సమైక్య సాహితీ ప్రతి సంవత్సరం ఉత్తమ నాటక రచయిత కు అందించే తుమ్మల రంగస్థల పురస్కారాన్ని గెలుచుకున్నారు ఆయన స్థాపించిన చైతన్య కళాభారతి సంస్థ ద్వారా నాతో సహా మంచాల రమేష్, తిప్పర్తి ప్రభు, వడ్నాల కిషన్, కునమల్ల రమేష్, బండారి దేవరాజ్, గద్దె ఉదయ్ కుమార్ లాంటి ఆణిముత్యాల వంటి అనేక మంది నటీనటులు ఆవిర్భవించి సంస్థను నంది నాటక పోటీలలో వరకు ఎదిగేలా చేశారు. ఉభయ రాష్ట్రాలలో నలు మూలల ప్రతిష్టాత్మకమైన వేదికల మీద నాటకాలను ప్రదర్శిస్తూ 35 సంవత్సరాలు గా సంస్థను ఎవరెస్టు శిఖరం లాగా నిలబెడుతున్నారు.  రంగస్థల సేవే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ చివరివరకు నటన, రచన, దర్శకత్వం, నిర్మాణం బాధ్యతల తో అలుపెరుగని కృషి చేశారు. అనారోగ్యంతో  2020, ఏప్రిల్ 9న మరణించారు.

(మాడిశెట్టి గోపాల్, కరీంనగర్ రాసిన వ్యాసం నుండి)

9, డిసెంబర్ 2019, సోమవారం

నవ్యాంధ్రప్రదేశ్ నాటక పరిషత్తుల వివరాలు

(దేవిరెడ్డి రామకోటేశ్వరరావు గారి సహకారంతో...)
Srikakulam district:
    1. Sri Sumitra kalasamithi, Srikakulam - 532201, Contact persons: Sri Ippili Sankara Sarma: 9440240070, Sri G.Chinna Rao: 9849597368
    2. Srikakulam Ranga Sthala kalakarula Samakhya, Opp Head post office, N.T.R.M.H.School, 2nd gate, Srikakulam - 532001. Contact person: Chitti Venkatarao - 9440706878, L. Ramalingaswamy – 9441017353
    3. Viswa Nataka kala parishat, Railway station junction, Amadalavalasa, Srikakulam district, Contact person: J.J. Mohanrao – 9848074104
    4. Sarvani grameena mariyu girijana samskrutika seva sangham, Borivanka, Kaviti mandal. Pin: 532292, Contact person: P.Chalapathy – 9701925906
    5. Kala creations, Rajam. Contact person: G.Krishna Murthy – 9866540129

    Vizianagaram district:
    1. Nataratna Nataka parishat, Vizianagaram: Contact person: Gedda Varaprasad – 9398284347
    2. Srikakula Rangastalakalakarula Samakya, Monthly Programs, Venkatararao Cell : 8074234934
    Visakhapatnam district:
    1. Kalabharati-A.S. Raja kalaparishat, 40, Pithapuram colony, Visakhapatnam - 530003, Contact person: K.G.Venu : 9848070084
    2. Rao Gopala Rao smaraka nataka parishat, Visakhapatnam, Contact person: Jagatrao- 9848634030
    3. K.V. Memorial nataka Kala parishat, Visakhapatnam, Contact person: P.Sivaprasad –9440590257
    4. Arunodaya kala Samiti, Mindi, Visakhapatnam district, Contact person: Eeti Rambabu—9440641490
    5. Friends club, K.M.Nayudu, Ex- Municipal councillor, Gavarapalem, Anakapalle -531001, phone: 9247573804
    6. Sri pydimaba Kala parishat, Paravada, Visakha district, Contact person: P. Balaji Nayak
    7. Trayambaka kala parishat, Chodavaram, Visakha district, Contact person: J.S. Satish- 9849850121
    8. Munagapaka Kala parishat, Munagapaka, Visakha district, Contact person: Ramu-9618845679

    East Godavari district:
    1. Alluru Sitaramaraju kala parishat,64-12-7/1, Raghavendra veedhi, S.Achyutapuram, Kakinada-4, Contact person: P. Dayanandababu-9866336579
    2. Pantam Padmanabham Nataka Kala parishat, Kakinada, Contact person: Burra Padmanabham – 9848647599
    3. Navarasa nataka kala parishat, Kakinada, Contact person: Guruprasad – 9885767888
    4. C R C "Cotton" Kala parishat, Ravulapalem- 533238, Contact person; Venkata Reddy- 9849255888, Ashok Reddy  - 8977666666
    5. Mayura Nataka kala parishat, Ramachandrapuram, contact person: Appalacharya--9441639229,
    6. Nallamilli Mula Reddy kala parishat, Ramavaram, Contact person: Krishna Reddy –9290525616
    7. Draksharama Nataka Kala parishat, Draksharamam, Contact person: Y. Saroja –9951254542
    8. Aparna Nataka kala parishat, Tatiparti, Contact person: D. Kamaraju--9398461265, A.Bhaskara Rao –7093725829
    9. Sri Markandeya Nataka kala parishat,Tatiparti, Contact person: J.Sambasivarao --8186868547, P. Ravi—9848011614
    10. Sri Venkateswara Nataka Kala parishat, Kondevaram--533450, Contact person: Nagabhatla Raghu –9866948906Jahnavi nataka kala parishat, Anaparthi, Contact person: Krishna Rao 9490186602
    West Godavari:
    1. Sri Garikipati art theatre, Eluru, Contact person: Garikapati Kalidas—9848617670
    2. B.V.R.Kala parishat, Tadepalligudem, Contact person: B.V. Rama Rao –9848044229
    3. Chaitanya Kala Bharati, D.No. 27-1-5,Juvvala palem Road, Bhimavaram --534202, Contact person: Rayaprolu Bhagavan—9848144009
    4. KalaRanjani, Bhimavaram, Contact person: Javvadi Dasaradhi Srinivas Rao—9676323344
    5. Gazal Srinivas Palakollu kala parishat, Palakollu, Contact person: Manapuram Satyanarayana 9440217038
    6. Youth club, kontheru, Contact person: Mutyala Naidu, 9290842655
    7. Subrahmanyeswara Kala parishat, Tholeru, C.Satyanarayana Murthy—9866527481
    8. Viravasaram Kala parishat, Viravasaram, Contact person: G.Rama Krishna 9885575567
    9. YMHA Nataka Kalaparishad, Agraharam, Eluru-534001. Gutta Kousalendra, 9346405825
    10. Helapuri kala parishat, Eluru, Contact person: Md.Khajavali—9866152617
    Krishna district:
    1. Sumadhura kala Niketan, 16-2-39, Purnanandam pet, Vijayawada -520003, contact person: H V R S PRASAD – 9347505277
    2. Tapasvi cultural arts, Vijayawada, Contact person: S. Jagannadharao-- 9030424325
    3. Andhra Nataka kala parishat, Vijayawada, Contact person: Annamaneni Prasad –9347505277
    4. Andhra Nataka kala Samithi, Vijayawada, Contact person: Karnati Lakshmi Narasaiah—9160256999
    5. Maheswari Prasad memorial nataka kala parishat, Vijayawada, Contact person: R. Mohan Krishna --9030999977, 9182069444
    6. Harsha creations, Vijayawada, Contact person: K.Syamprasad – 9848304353
    7. Nagarjuna kala parishat, Kondapalli, Contact person: M.V.Raghu—9966152397
    8. Aadarsa grameena samskruthika samstha, Velagaleru, Contact person: P. Ranganayakulu –9949418017
    9. Mahathi creations, 20-8-26/3, Nava Bharathi apartment (opposite), New Ayodhya Nagar, Vijayawada - 520003, Contact person: Subbarayasarma –9849009491
    Guntur district:
    1. Guntur kala parishat, sambasiva pet, Guntur -522001, contact person: B. Purna--9848492616,
    2. N T R kala parishat, 3-20-39/A, Sai nilayam, Tholla shop centre, Pattabhipuram, Guntur -522006, Contact person: Ramakrishna Prasad katragadda--9848146461
    3. Paruchuri Raghubabu memorial nataka kala parishat, Pallekona, Bhattiprolu mandal, contact person: Paruchuri Venkateswara Rao –9963141717
    4. D.L.Kantharao postal Udyogula Nataka Kala parishat,Morris pet, Tenali--522202, Contact person: P.S.R. Brahmachari --8977778644, 9959689659
    5. N.T.R. Nataka parishat (Pattana Rangasthala Kalakarula samakhya), Tenali- 522202, Contact person: Johny Basha—9296906121
    6. Bollimunta Nataka parishat, Tenali, Contact person: Chandu Subbarao –6281164300
    7. Ponnur nataka kala parishat, 4-7-6A, Vidya Nagar, Ponnur- Nidubrolu, Contact person: S.Anjaneyulu naidu—9848144268
    8. Kona Prabhakara Rao Nataka parishat, Bapatla, Contact person: Kona Hemachand –9848133015
    9. Lavu Venkateswarlu& Kalluri Nageswararao Kala parishat, Varagani, prathipadu mandal, Contact person: Popuri Nageswararao—9490723488
    10. Chilakaluripet kala parishat, Chilakaluripet -522616, Contact person: Cherukuri Kantaiah –9848157337
    11. Kondaveeti Kala parishat,Lingaraopalem -522234, Contact person: M.Srinivasarao
    12. Santiniketan Kala parishat, Boppudi, Contact person: A.Prasadarao –9949059434
    13. Narasaraopet Rangasthali, C/O. Ramya type Institute, Bank street, Arundel pet, Narasaraopet -522601, Contact person: K.Venkatarao –8106424299
    14. Nandamuri Kala parishat, 29-263, Besides Suresh Mahal, kotha pet, Vinukonda --522647, Contact person: K. Ramanjaneyulu – 9581853636
    15. Abhinaya Nataka parishat, Ponugupadu--522549, Contact person: Abhinaya Sreenivas –9391111622
    16. Dicman Kala parishat, 13/14, Kothapeta, Phirangi Puram--522529, Contact person: P. Raja Rao – 9985857715
    17. Pragathi Kala Mandali, 8-7-39, Chinna masidu vadda, Sattenapalli - 522403, Contact person: Nutalapati Sambaiah – 9848034930
    18. Kolankapuri Nataka kala parishat, Kolakaluru, Contact person: Goparaju Vijay –8309116568
    19. Tullur kala parishat - Madhu theatre arts, Tulluru, Contact person: Madhu—9010754435
    20. J.P. Theatres, Koritapadu, Guntur, Contact person: Jayaprakash Reddy –9492394922
    21. Super star Krishna children arts academy, Tenali, ( Balala nataka potilu), Contact person: Kanna Bujji –9059394748
    22. Putchhlapalli Sundaraiah Natakotsvalu, Edlapadu, Contact person-- Padmarao – 9491615599
    23. Dr Kasaraneni Sadasivarao nataka Kala parishat, Guntur, Contact person: Katragadda Rama Krishna Prasad --9848146461
    24. Bhuvana Chandra town hall committee, Narasaraopet (Monthly programme)-- Contact person: Pasha—9494469364

    Prakasam district:
    1. N.T.R. Kala parishat ( Bharateeyam), Ongole , Contact person: Eedara Bharath –9542196200
    2. Srikaram& Rotary kala parishat, Martur, contact persons: J.V. Mohanrao -9959900081, Kandimalla Sambasivarao—9848351517
    3. Ajovibho kandalam foundation kala parishat, Santa bazar, Chirala, Contact persons: Appajosyula Satyanarayana 9849162538, D.S.N. Murthy -9848128845
    4. Kalanjali, Chirala, Contact person: Poorna Satyam—986610310
    5. Kalavani, Nagulapalem, Parchuru mandal, Contact person: Chaganti Nageswararao –9440233659
    6. Srikrishnadevaraya Nataka kala parishat, Podili, Contact person: Papa Rao –8886346666
    7. Darsanapuri Nataka Kala parishat,11-21, Near) Old government hospital, Satrala Bazar, Darsi--523247, Contact person: K.Ananth—9849671633
    8. Karavadi kala parishat , Karavadi, Contact person: Bhujanga Rao --8919168473, 9533933898
    9. Koppolu kala parishat, Koppolu, Contact person: Katragadda Raghu –9849575090

    Nellore district:
    1. Simhapuri Nataka Kala parishat, H.No. 4-22, Kaveri Nagar,1st street, opp) Current office, Podalakur road, Nellore, Contact person: Ch. Subbarao –9642970640
    2. Kalidasa Kalaradhana samithi, Kavali, Contact person: Nageswararao –9908832242
    3. D.R.Kala parishat - Navajyothi arts, Kavali, Contact person: A.V. Malleswararao – 9849373030
    4. Kalasagar, Buchhireddy palem-- D. Ramanaiah yadav—9866800121
    5. Samskruthika Sammelanam, Gudur, Contact person: Jana Sivaiah –9247148854

    Chittoor district:

    1. Sri Venkateswara natya kala parishat, Prakasam road, Tirupathi- 517501, phone no. 9160301112
    2. Abhinaya arts, 1-2-120/2, (New 271), prakasam road, Tirupathi - 517501, Contact person: B.N.Reddy –9581154667
    3. Sri Kalahasthi Lalita kala parishat,13/189, Bhaskar pet, Srikalahasti --517644, Contact person: Radha Krishna –9959897182
    4. Subbaraju natya Kala parishat ( Aswam awards) No. 80, Tyagaraja Nagar, Tirupathi - 517501, Contact person: K. Subbaraju—9985653111
    Kurnool District
    1. Lalita kala samithi, 'C' camp, Rythu bazar prakkana, Kurnool --518002, Contact Person: Prathi Obulayya--9441580830

24, నవంబర్ 2019, ఆదివారం

నాటక ప్రదర్శన - విమర్శ 4

(4వ భాగం కొనసాగింపు)
మన అలంకార శాస్త్రం సహృదయుడ్ని ఇలా పేర్కొంది.

‘‘ఏషాం కావ్యానుశీలనాం అభ్యానవశాత్
విశ్వభూతే మనోముకులే వర్ణనీయ
తన్మయీ భావనా యోగ్యతాతే
సహృదయ సంవాద భాజాః సహృదయాః’’ అని

అంటే విమర్శకుడు అంటే సహృదయుడు పరిణితుడై వుండాలీ అన్నది దీనర్థం. రచనద్వారా లేదా ప్రదర్శన ద్వారా తాను అనుభవించిన అనుభూతులన్నింటినీ విపులంగా, సమగ్రంగా, విశదీకరించి చెప్పగలగాలి. నిష్కలంకంగా, నిర్భయంగా, పారదర్శకంగా వ్యక్తీకరించే ‘దర్పణం’లా ఉండాలి. రచయిత హృదయాన్ని అర్థం చేసుకొని, ఆ హృదయావిష్కరణకు పూనుకోవాలి. 

ఊరికే అనవసర, అప్రస్తుత, అకారణ వ్యాఖ్యల, వర్ణన చేయటం విమర్శకాదు. తాను పొందిన అనుభూతికీ, ప్రయోజనానికీ ‘విలువ’ కట్టగలగాలి. అప్పుడే ా విమర్శ ఒక ప్రయోజనాన్ని కలిగి ‘సహేతుక విమర్శ ’ అనిపించు కుంటుంది. అయితే విమర్శకుడిగా తాను నిర్వహిస్తోన్న ఈ బాధ్యతా క్రమంలో ఎన్నో విమర్శకులకు గురౌతాడు. వాటిని లెక్కచేయక ముందుకు వెళ్ళేవాడే విమర్శకుడు (సహృదయుడు). మారుతున్న పరిణామాలు, విలువల్ని ఆయా రచయితలకు సూచించే బాధ్యత కూడా విమర్శకుడిదే. రచన లేదా ప్రదర్శన విలువల్ని విశ్లేషించి, విలువ కట్టి పాఠకుల, ప్రేక్షకుల అభిరుచిని బేరీజు వేయటం లేదా సరిచేయట లేదా పెంపొందించే బాధ్యత కూడా విమర్శకుడిదే...

అప్పుడే ఆ రచన లేదా ప్రదర్శన మెరుగులు దిద్దుకుని ప్రజాదరణ పొందుతుంది. అంటే నాటక ప్రదర్శన విజయవంతం గావటానికి విమర్శ ఎంత అవసరమో విమర్శకుడూ అంతే అవసరం. అంతేకాదు.. సహేతుకమైన విమర్శ ఆ నాటక ప్రదర్శన ప్రోత్సాహానికి కూడా దారి తీస్తుంది.

ఇదంతా నేను కేవలం నాకు తెలిసిన పెద్దలను, ఆయా పుస్తకాల్లోనూ చదివి తెలుసుకున్నది కొంతైతే.. నా అనుభవంలో.. నాగమనంలో నేను సేకరించిన అంశాలు మరికొన్ని... దయచేసి వీటిపై మీ కామెంట్లు తెలియజేయగలరు.

మీ 
విద్యాధర్ మునిపల్లె.

నాటక ప్రదర్శన-విమర్శ 3

(కొనసాగింపు)
గత సంచికలో చెప్పిన దానికి భిన్నంగా వుండేదే ఉత్తమ విమర్శకు దారితీస్తుంది. అలా చేయగలినవాడే ఉత్తమ విమర్శకుడుిగా గుర్తించబడతాడు. ఇక సమాజం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తే, సాహిత్యం విమర్శను ప్రేరేపిస్తుంది. అంటే సాహితీ విమర్శచేత ప్రభావితమైన సాహిత్యం - సమాజాన్నీ, సమాజంలోని ఆలోచనాత్మక భావజాలాన్నీ ప్రభావితం చేస్తుంది. అందుచేత సాహితీ విమర్శ అవసరమైంది.. అనివార్యమైంది.. పాఠకులు, సామాజికులు సాహితీ జీవనగమనంలో నిత్యకృత్యమైంది.. ఈ విషయంలో నాటక సాహిత్యానికి ఎక్సెప్షన్ లేదు. సాహితీ ప్రక్రియైనా విశ్లేషణ, ప్రశంస, విమర్శలకు స్థానం కల్పించినప్పుడు మాత్రమే సమాజం ప్రభావితం అవుతుంది. అలా కానట్లయితే, అది ఉత్తమరచనగా కాకుండా ఉత్తరచనగానే మిగిలిపోతుంది. మరి ఇంతగా ప్రభావితం చేసే రచన మౌలికంగా ఏ లక్షణాలను కలిగి వుండాలి?

ప్రఖ్యాత హంగేరియన్ విమర్శకుడు జార్జ్ లూకాచ్ సమాజాన్ని ప్రభావితం చేసే రచనకు ఈ క్రింది లక్షణాలుండి తీరాలన్నారు. 

  1. సంపూర్ణత : రచన విస్తృతంగా ఉండి, జీవన గమనాన్నీ, అనుభవాలనూ పంచుకోవాలి.
  2. సమకాలీనత : రచనలో చోటు చేసుకున్న ప్రాంతకాలాలను ఆ జీవన గమనం ప్రతిబింబించాలి. దేశ కాలాలకు సంబంధించిన సాధరణ, ప్రత్యేక లక్షణాలు ఆ రచనలో గోచరించాలి.
  3. ప్రపంచ చారిత్రక దృశ్యం రచనలోని జీవిత దృశ్యాలకూ, ప్రాపంచిక స్థితిగతులకూ మధ్య వుండే సంబంధం ప్రస్ఫుటం కావాలి లేదా కనీసం సూచించబడాలి.
ఇక నాటక సాహిత్యం అనే మహాసాధనానికి సమాజం, రచయిత, రచన పాఠకుడు అనే నాలుగు స్థంభాలు పరస్పర సంబంధం కలిగి దేనికదే భిన్నంగా కన్పిస్తూ, ఆ భిన్నత్వంలో ఏకత్వానికి దారితీసే అంశాలుగా పరిణమిస్తాయి. వీటి ఆధారంగా నాటక విమర్శను నాలుగు విధాలుగా విభజించవచ్చు.


  1. సమాజ పరమైన విమర్శ : అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ సమాజాన్ని రచనతో పోలుస్తూ చేసేది.
  2. రచయిత పరమైన విమర్శ : కేవలం రచయితను దృష్టిలో పెట్టుకొని, అతని ధృక్పథంతో చేసేది.
  3. రచనా పరమైనది : రచయిత , సమాజాన్ని వదలి, కేవలం రచనా ధృష్టితో చేసేది.
  4. పాఠక పరమైనది : పై మూడింటినీ కాదని, కేవలం తన దృష్టితో చూసి చేసేది.

మరి నాటక ప్రదర్శన విషయానికొస్తే, పైన చెప్పినంత సులువుకాదు. కారణం ఏమిటంటే పై విషయమంతా వ్యక్తిగతం. ఇక్కడ ఎందరో ప్రేక్షకుల స్పందన, మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. నాటక ప్రదర్శనకు సంబంధించిన విమర్శ, ప్రశంస విశ్లేషణ బాధ్యతాయుతం.. తీక్షణం.. సునిశితం ఎందుకని నాటకం జీవితానికి దర్పణం కాబట్టి, ఇక్కడ నాటక ప్రదర్శన విమర్శ సామాజిక బాధ్యతై కూచుంది. మింగుడు పడని విషయాలను సైతం నిష్కర్షగా, నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా కరకుబడని సత్యాలను సైతం విమర్శకుడు వెల్లడించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. అసందర్భ వాదనలూ, అర్థం పర్థంలేని సిద్ధాంతాలు, మొండి వాదాల జోలికి పోకుండా విమర్శకు పూనుకొంటే తనను తాను సంస్కరించుకుంటూ ఎదగటమే కాకుండా సమాజాన్ని కూడా సంస్కరించిన వాడౌతాడు. ఇవన్నీ లేకుండా విమర్శకులం అంటూ తమకు తాముగా ఓ పనికిమాలిన ముద్ర వేసుకుంటూ, ఏదో విధంగా పబ్బం గడుపుకుంటూ, ఏకపక్ష పక్షపాత ధోరణులతో ఏవేవో పిచ్చిరాతలు రాసేవారు నా దృష్టిలో సాంస్కృతిక రంగ నిరుద్యోగులు మరియు సాంస్కృతిక వ్యభిచారులు.

అసలు విమర్శకుడంటే ఎవరు? అతనికి ఎలాంటి లక్షణాలుండాలి? ఇప్పుడీ అంశాల్ని పరిశీలిద్దాం
‘నభావ హీనోస్తిరసః’ అన్నాడు నాట్యశాస్త్రంలో భరతుడు. రచనపై ఎటువంటి స్పందనలు లేనివాడు ‘అరసికుడు’ అని దీనర్థం. అంటే అభిరుచి, అభినివేశం, భావోద్రేకాలు ఇటువంటి వేవీ అతనికుండవు. ప్రముఖ ఆంగ్ల విమర్శకుడు ఇటువంటి వాడ్ని ‘ఫిలిస్టర్’అన్నాడు. ఇటువంటి వాడ్ని ఉద్దేశించే ఇంకో విధంగా ‘‘ అరసి కేషు కవిత్వం నివేదనం శిరశి మాలి మాలి మాలిఖ’’

‘‘ రసికత్వం ఆస్వాదించి అనుభవించే గుణం లేని వాడికోసం రచనలు చేసే దురదృష్టాలన్నీ నాకివ్వకు దేవా ’’ అని బ్రహ్మను ప్రార్థించాడు కాళిదాసు.

ఇక రెండవ వర్గాన్ని చూద్దాం.. మీరు.. కొంతమేరకు ఆ సాహితీ ప్రక్రియ చదివేటప్పుడు ఏదో ఒక అనుభవానికి లోను కావచ్చు లేదా అసంతృప్తి చెందవచ్చు. లేదా ఆనందిచచ్చు. కానీ తన స్పందన, ప్రతిస్పందనలకు కారణాలు మాత్రం చెప్పలేడు.

ఇక మూడవ వర్గాన్ని చూస్తే ఆ రచనను చదివి బాగా ఆకళింపు చేసుకొని, స్పందించటమే కాక, ఆ స్పందనకు కారణాలను కూడా శోధించి, తను అనుభవాలను ఇతరులకు పంచుతాడు. ఆ రచనకు మూలాలేంటి? ప్రేరణేంటి? కథను మలచిన తీరు, వర్ణన అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? చివరికి ఏం చెప్పాడు.? ఇత్యాది ప్రశ్నలన్నీ తనకు తానుగా వేసుకుంటూ, సమాధానాలు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా సంఘర్షణను అనుభవిస్తూ, తన అనుభవాలన్నింటినీ బహిర్గతం చేసి, ఆ రచనకు ఓ రకమైన ్రపజాదరణ కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి వాడ్ని ‘విమర్శకుడు’ అనవచ్చు. అయితే విమర్శకుడు సహృదయుడుగా వుండాలి. మన అలంకార శాస్త్రం సహృదయుడు లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొంది.
(కొనసాగింపు)

నాటక ప్రదర్శన - విమర్శ 2

(కొనసాగింపు)

విమర్శ అనేది అర్థవంతంగాను, సహేతుకంగా ప్రయోజనవంతంగాను ుండాలి. అడ్డదిడ్డంగా మాట్లాడేసమయంలో తాను చెప్పిందే సరైనదని నొక్కి వక్కాణించటం కాదు. విమర్శించబడిన, విశ్లేషించబడిన ప్రదర్శన మున్ముందు ప్రజాదరణకు దూరమయ్యే అవకాశం వుందని ప్రొఫెసర్ గ్రెగరీ ఎం.కోనీయా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్ జి.యస్.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ... నాటక ప్రదర్శన విమర్శకు సంబంధించిన ప్రామాణికత విషయాల్లో ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో అన్న ప్రస్తావనకు వస్తే ముందుగా రచనను పరిశీలించి, విశ్లేషించాలి. అంటే ఆ రచనలోని కథాంశం, సన్నివేశాలు, పాత్ర చిత్రణ, సంభాషణలను, కథనాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించాలి. అంతేగాక ఆ రచన ప్రయోజనం ఏంటి అనే అంశాన్ని గమనంలోకి తీసుకోవాలి. తదుపరి అంశం అభినయం.. నటులు రచన ఉద్దేశ్యం, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభినయిస్తున్నారా? పాత్రల్లా ప్రవర్తిస్తున్నారా? ఆయా పాత్రల ప్రయోజనం సాధించటంలో సఫలీకృతులవుతున్నారా? పాత్రల మధ్య సమన్వయాన్ని సాధిస్తున్నారా? లేదా.. అనే అంశాలను పరిగణించాలి. తదుపరి అంశం.. దర్శకత్వం.. నాటక ప్రదర్శనకు సంబంధించిన అన్ని అంశాలను సమస్థాయిలో సమ తూకంలో ఉండేలా శ్రద్ధ వహించాడా లేదా..? పాత్రలతాలూకు స్వరూప, స్వభావాలను వెలికి తీయటంలో సఫలీకృతుడయ్యాడా లేదా..? రంగస్థల ప్రదర్శనకు సంబంధించిన అన్ని సాంకేతికాంశాలను సరియైన రీతిలో వినియోగించి ప్రదర్శన విజయానికి దోహదం చేశాడా లేదా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొంటూ, సాహితీ ప్రక్రియ అయిన రచనకు ప్రదర్శనా విలువల్ని సంతరించటంలో దోహదపడ్డాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఇక సాంకేతిక విలువలు ప్రదర్శన విజయవంతం కావటానికి ఏమేరకు దోహదపడ్డాయో లేదో అనే అంశాన్ని వివరంగా సమీక్షించాలి.

వీటన్నింటినీ విడివిడిగా పరిశీలించి, సమీక్షించుకుంటూ ఒక అంశానికి మరొకటి ఏవిధంగా దోహదపడిందీ, లేనిదీ పరిశీలిచబడాలి. ఇంతటి వివరాల ద్వారా సమీక్ష జరిపితే అది సద్విమర్శక దోహదపడుతుంది. అంతేకానీ, బావుందీ అని చెప్పటం లేదా బాగాలేదు అని అనటం విమర్శ కిందకు రాదు.. కేవలం అభిప్రాంగానే పరిగణింపబడుతుంది.

నిజానికి ఇటీవలి కాలంలో చాలామంది నాటక న్యాయనిర్ణేతలు ప్రైజులు ఇచ్చే క్రమంలో ఆయా సమాజాలవారు ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం నాకు నచ్చలేదు అందుకే ప్రైజు ఇవ్వలేదు.. అని.. అదేంమాటయ్యా అని అడిగితే.. మీరు నాటకం జనంకోసం ఆడుతున్నారా? ప్రైజులకోసం ఆడుతున్నారా..? అంటూ బోడి ప్రశ్న వేస్తారు. నిజానికి పోటీల్లో పాల్గొనే నాటికలు, లేదా నాటకాలు ప్రైజులకోసం కాక జనంకోసం ఆడతారా.? ప్రైజులు ఇవ్వటానికి కాకపోతే గాడిదలు కాయటానికి న్యాయనిర్ణేతలుగా కూర్చోబెడతారా? ప్రదర్శకులు పోటీ ప్రదర్శనల్లో పాల్గొంటారా..? అతి తెలివి తేటలు ఎక్కువైతేనే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి.. నిజానికి జనంకోసం నాటకం ఆడే వేదికలు వేరే వుంటాయి. పోటీ వేదికలపై పోటీలే జరుగుతాయి. అప్పుడే ప్రశ్నిస్తారు. ఈమాత్రం కూడా తెలియకుండా చచ్చుప్రశ్నలేస్తారు ఎందుకో...
(కొనసాగింపు)

16, నవంబర్ 2019, శనివారం

నాటక ప్రదర్శన - విమర్శ 1

నాటకం ప్రదర్శన

సాహిత్య ప్రక్రియలన్నింటిలో ‘నాటక’ ప్రక్రియకు ప్రత్యేకమైన స్థానం వుంది. అందుకే కాళిదాస మహాకవి ‘‘కావ్యేషు నాటకం రమ్యం’’ అన్నారు. అక్షరసత్యములైన ఆ మాటలు అందరికీ అనుభవ పూర్వకములే. ఎన్నో సాహిత్య ప్రక్రియలు కేవలం చదవటానికి మాత్రమే ఉపయోగపడుతుంటే నాటకం మాత్రం అలాకాదు. ఇటు చదవటానికీ, అటు చూడటానికీ, వినటానికీ, ప్రదర్శించటానికీ నోచుకున్న ఏకైక ప్రక్రియ. ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్థావించాలి. సాహిత్య ప్రక్రియలన్నింటిలో నాటకానికి ప్రత్యేకమైన స్థానమున్నా.. చదివిటప్పుడు ఎంతో అద్భుతంగా అనిపించినా, ప్రదర్శనకు నోచుకున్న సమయంలో మాత్రమే ప్రత్యేక స్థానం సంతరించుకుంటుంది, తద్వారానే ప్రజాదరణ పొందుతుంది. ఆ విధంగా సాహిత్య ప్రక్రియకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. అలా ప్రదర్శనకు నోచుకోకుండా, ప్రజాదరణ పొందకుండా ఉంటే మిగిలిన సాహిత్య ప్రక్రియల మాదిరిగానే, కేవలం పాఠకుల చేతిలో హస్తభూషణంగా మిగిలిపోయి వుండేది ఈ నాటకం కూడా. 

విమర్శ

సాహిత్య ప్రక్రియల్లో ఒక్క నాటకం తప్ప మిగిలిన అన్ని ప్రక్రియలను చదవటం ద్వారా మాత్రమే విశ్లేషణ చేయటం జరుగుతుంది. కానీ, నాటకం అలా కాదు. ఇటు సాహిత్య పరంగానూ, అటు ప్రదర్శనా పరంగానూ విశ్లేషణకు వేదికైంది. అంటే రచయిత సృష్టించిన అక్షరాలకు దృశ్యరూపం పొంది, జీవం పోసుకుంటుంది. పుటల్లో అక్షరాలతో నిండిన ఓ ఘనపదార్థం సజీవ పాత్ర చిత్రణ ద్వారా సరికొత్త రూపు సంతరించుకుంటుంది. అంటే నాటక విమర్శ ‘పుస్తక’ విమర్శ, ‘ప్రదర్శన’ విమర్శ అనే రెండు రకాలుగా నిక్షిప్తమై ఉంది. రచనాపరంగా చూస్తే, భాష, సంభాషణలు, శైలి, కథ, కథనం రచయిత ప్రతిభను చాటుతుంటే, నాటకీకరణ, అభినయం,ఆహార్యం, రంగాలంకరణ, విద్యుద్దీపనం, సంగీతం, గమనం, ఉద్వేగ స్థితిగతులు, రంగస్థల విన్యాసాలు, రంగస్థల వ్యాపారం తద్వారా కళాశాలతో కళాకారుల ప్రతిభను సామూహిక ప్రయత్నంతో ప్రదర్శనా పూర్వక ప్రతిభను చాటుతాయి. కుక ఇక్కడ సాహిత్యపరమైన, ప్రదర్శనా పరమైన విశ్లేషతోపాటు ప్రశంస, విమర్శ అవసరమౌతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే ఒక నాటకం ఇటు పఠనా పరంగానూ, అటు ప్రదర్శనా పరంగానూ బాగుందంటే ఎందుకు బాగుందో చెప్పగలగాలి లేదా బాగాలేదంటే ఎందుకు బాగాలేదో కారణాలు విశదీకరించగలగాలి. దీనినే విమర్శ అంటారు..

ఈ విమర్శే కనుక లేకపోతే ఏ కళారూపంలో అయినా పరిపూర్ణత సాధించటం సాధ్యమవ్వదు. అయితే ఎటువంటి విమర్శలు అవసరం? అసలు విమర్శకులకు ఉండాల్సిన లక్షణాలేంటి అనే అంశంపై నాకు తెలిసిన కొందరు నాటకరంగ పెద్దలు వారివారి అనుభవాలను నాకు వివరించారు. నేను వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ముందుగా విమర్శ ప్రాధాన్యతను వివరిస్తూ.. ప్రొఫెసర్ జి.యస్.ప్రసాదరెడ్డిగారు ఇలా అన్నారు.. 
అసలీ విమర్శ అంటే ఏంటి? ఇది అవసరమా? అయితే, గియితే ఎంతవరకూ? ఏమేరకు? దీన్ని ఎవరు చేస్తారు? వారి అర్హత ేంటి? ఒకవేళ చేసినా ఎవరు స్వీకరిస్తారు? స్వీకరిస్తే అనుసరిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తే విమర్శ ఆవశ్యకత విశదపడుతుంది.

నాటక ప్రదర్శన ప్రధానం వినోదాన్ని కలిగించటం.. అయితే హాయిగా వినోదించక, ఈ విమర్శ ఏంటి? విమర్శ రచనపైనా, నటులపైనా? దర్శకుడిపైనా? ఇతర సాంకేతిక అంశాలపైనా? లేదా ప్రేక్షకులపైనా లేక వీటన్నిటిపైనా? అసలు విమర్శకు ప్రామాణికం ఏంటి? ఇవన్నీ తెలిస్తే, విమర్శించటం సులువే అవుతుంది. అయితే ఎవరు విమర్శించాలి? సాధారణ ప్రదర్శన అయితే ప్రేక్షకులు.. పోటీ ప్రదర్శనలు అయితే న్యాయనిర్ణేతలు. ఈ రెండు విభాగాల్లో ఈ రెండు వర్గాలు తమతమ అభిప్రాయాలను విమర్శ పేరుతో వెలిబుస్తే అది పూర్తి విమర్శ అవుతుందా? అయినట్లుగా లెక్కలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం పూర్తిగా దొరకటం కష్టం.

ఏది ఏమైనా విమర్శను నిర్వచించాలీ అంటే సూక్ష్మంగా ప్రదర్శన తాలూకు మంచి, చెడుల వివ్లేషణ అని చెప్పుకోవచ్చు. ప్రదర్శనకు సంబంధఇంచిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, మంచి, చెడులను ఎటువంటి పక్షపాత ధోరణితో గాకుండా, పారదర్శకంగా విశ్లేషించగలిగిన, అనుభవంతో కూడిన, అధ్యయనం చేసిన వారెవరైనా విమర్శ చేయటానికి అర్హులే.. నలుగురు కలిస్తే నాటకం, నలుగురి కోసం ప్రదర్శన.. కనుక పదిమందీ మెచ్చేలా, నచ్చేలా ఉండేదే ఉత్తమ ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. ఈ మెచ్చటం, నచ్చటం అనే అంశాలు ఆ ప్రదర్శనకు సంబంధించిన అన్ని అంశాలపై ఆధారపడి ఉండాలి.   (కొనసాగింపు)

11, ఆగస్టు 2019, ఆదివారం

D.CH. తిరుపతి రాజు స్మారక 2019 నాటకోత్సవాలు by K.V.MEMORIAL (శివప్రసాద్)

K.V.MEMORIAL (VIZAG) D.CH. తిరుపతి రాజు  2019 నాటకోత్సవాలు



ఏటిలోని కెరటాలు (నాటిక)



కెరటాలు (నాటిక)

విరమణ (నాటిక)

మనసు తెలుసుకో.... (నాటిక)

దురాయి (నాటిక)

ఆలితో సరదాగా... (నాటిక)

30, మార్చి 2018, శుక్రవారం

నిరంతర కళా సజీవి మన 'సంజీవి'


రంగస్థల, టీవి, సినీరంగాలలో తనదైన ముద్ర వేసుకున్న నటులు, రచయిత, దర్శకులు సంజీవి. భారతీయ సంస్కృతికిపై ఆయకుకున్న ప్రేమ మరియు తెలుగు భాషపై ఆయనకున్న పట్టు ప్రముఖ రచయితగా పేరుపొందేలా చేయడంతోపాటూ ఆయనకంటూ ఒక స్థానాన్ని అందించింది. కథలు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, నాటకాలు/ నాటికలు రాయడమేకాకుండా నటుడు మరియు దర్శకుడిగా కూడా చేశారు.

నాటకరంగ జీవితం
1965 నుండి రంగస్థలంలో పనిచేస్తున్న సంజీవి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అనేక నాటక నాటికలతో తన ప్రతిభను చాటారు. గురజాత కళామందిరం అనే సంస్థను స్థాపించి, గత 40 ఏళ్ళుగా ప్రదర్శనలను ఇస్తున్నారు.

నాటకాలు: సమాధానం కావాలి, యుద్ధం, ఈ చరిత్ర ఏ సిరాతో, దేశం మోసపోయినప్పుడు, మాస్టార్జీ, యాచకులు, శబ్దం, మూక మొ.వి.
నాటికలు: పగగం పగిలింది, నీరుపోయి, చరమాంకం, శవాలపై జీవాలు, ఊసరవల్లి, మనకెందుకులే, కదలిక, సంచలనం, డేకోయిట్లు, రేపు, వర్తమాన భూతం, అయో (వ) ధ్య, మనుధర్మం, రాజ్యహింస, నిజాయితి, ఊరుమ్మడి బతుకులు, క్విట్ ఇండియా, అమూల్యం, చెప్పుకింది పూలు, ఓటు బాట, గబ్బిలం, అని తెలుస్తుంది, వామపక్షం మొ.వి

అందుకున్న బహుమతులతో సంజీవి
  1. వేసిన ప్రతి పాత్ర ఉత్తమ నటుడిగా, ప్రదర్శించిన ప్రతి నాటక, నాటికలు ఉత్తమ ప్రదర్శనలుగా, రచన మరియు దర్శకత్వ విభాగాలలో బహుతమలు అందుకున్నాయి.
  2. కదలిక నాటిక 14 భాషలలో ఉత్తమ ప్రాంతీయ ప్రదర్శన విభాగంలో మరియు ఉత్తమ నటి విభాగంలో బహుమతులు సాధించింది.
  3. నీరుపొయ్ నాటిక 7 భాషలలోకి అనువాదమయ్యి చరిత్ర సృష్టించంది.
  4. ఈ చరిత్ర ఏ సిరాతో నాటకం దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 200 సార్లు ప్రదర్శించబడింది

అవార్డులు - పురస్కారాలు
నంది అవార్డులు: ఉత్తమ నటుడు - నిజాయితి (నాటిక) - 2000, ఉత్తమ నాటకం - మధురం, ఉత్తమ రచన - శివరంజని, నాలుగు అవార్డులు - గబ్బిలం (నాటిక), రెండు అవార్డులు - అని తెలుస్తుంది (నాటిక).
ఇతర అవార్డులు: కళాసాగర్ అవార్డులు (1981 నుండి 84 వరకు, వరుసగా మూడుసార్లు), 62సార్లు ఉత్తమ రచయిత అవార్డులు, 50సార్లు ఉత్తమ దర్శకుడు అవార్డులు, 110సార్లు ఉత్తమ నటుడు అవార్డులు.

పురస్కారాలు - బిరుదులు
మహాకవి గురజాడ స్మారక పురస్కారం, కళా విరించి - గుంటూరు, పీపుల్స్ రైటర్ - జవ్వాది ట్రస్టు

ఒసేయ్ రాములమ్మా షూటింగ్ లో దాసరి నారాయణరావు,
విజయశాంతిలతో సంజీవి

సినిమారంగం 
తెలుగు సినీరంగంలో 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేసిన సంజీవి సినీ జీవితంలో అనేక చిత్రాలు మైలురాళ్ళుగా నిలిచాయి. అలజడి చిత్రానికి రచయితగా పనిచేశారు. ఈయన రచయితగా పనిచేసిన 'అన్న' (డా. రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం) చిత్రం నాలుగు రాష్ట్ర అవార్డులను అందుకోవడమేకాకుండా, ఆస్కార్ కూడా నామినేట్ అయింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్ గా నటించిన 'ఒసేయ్ రాములమ్మా' చిత్ర రచనలో సంజీవి తన సహకారమందించారు. ఈ చిత్రం అంతకుముందున్న బాక్సాఫీస్ రికార్డులను అధిగమించడమేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులతోపాటూ ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈయన రచయితగా చేసిన మరో సినిమా ఎర్రమందారం. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో రాష్ఱ్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ అవార్డు గెల్చుకుంది. ఒరేయ్ రిక్షా, సమ్మక్క సారక్క వంటి ఎన్నో చిత్రాలకు పనిచేసిన సంజీవి తమిళ, కన్నడ వంటి ఇతర భాషా చిత్రాలకు కూడా పనిచేశాడు. తెలుగోడు చిత్రానికి దర్శకత్వం వహించాడు.

దాసరి నారాయణరావు నుండి బహుమతి
అందుకుంటున్న సంజీవి
టీవీరంగం

"భరత నాట్యం", "అంతరంగాలు" "మాతృదేవత", "ప్రతిఘటన", "నిన్నే పెళ్ళాడుతా" "సూర్యవంశం", "అపరాజిత", "పెళ్ళి", "కృష్ణవేణి", "మనసంతా నువ్వే", "కళ్యాణ తిలకం", "సీతమ్మ మాఅమ్మ", "బ్రహ్మముడి", "ఆరాధన", "శివరంజని", "గోరంత దీపం" వంటి సీరియళ్ళలో నటించారు.




29, మార్చి 2018, గురువారం

తెలుగు నాటక, సాహితీ సవ్యసాచి శ్రీరాజ్

శ్రీరాజ్
50కి పైగా తెలుగు కథలు, 5 కవితలు, 36కి పైగా రేడియో నాటకాలు, రంగస్థలంపై పదికి పైగా నాటకాలు, వివిధ భాషల్లో 18 సినిమాలు, 3 టీవీ సీరియల్స్, 23కి పైగా వ్యాసాలు,  5 అనువాద రచనలు, 8 ముద్రణా గ్రంధాలు ఇవి కొన్నే.. చెప్పుకుంటూ పోతే ఎన్నో.. తెలుగు నాటక, సాహితీ సవ్యసాచి శ్రీరాజ్. వీరు నవంబర్ 221946 సంవత్సరం విశాఖపట్నం (మల్కాపురం)లో జన్మించారు.  శ్రీమతి శేషమ్మ, శ్రీ రాజలింగం గార్లు వీరి తల్లిదండ్రులు. వీరి భార్య శ్రీమతి సత్య పార్వతి దేవి. ఈమె గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలు. (ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలూ) అమెరికాలో స్థిరపడ్డారు. శ్రీరాజ్ ఎక్కువగా రావిశాస్త్రి రచనల్ని, రాబర్ట్ బ్రౌనింగ్  పద్ధతిని ఇష్టపడతారు. ప్రస్తుతం బిఎస్సెన్నెల్  విశ్రాంత ఉద్యోగిగా విశాఖ లో నివాసం ఉంటున్నారు.

·        వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం ( ఏ.వి.ఎన్. కాలేజ్ )లో బియస్సీ, ఆపైన ధియేటర్ 
తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారం ఆంధ్ర ప్రదేశ్ 
గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ గారిచే అందుకుంటున్న శ్రీరాజ్
ఆర్ట్స్ (నాటక దర్శకత్వం) లో డిప్లొమా చదివారు. హైస్కూల్ చదువుకుంటున్న రోజుల్లో మేగజైన్ కోసం మొదటి కథకి శ్రీకారం చుట్టారు. ప్రముఖ వార/ మాస పత్రికల్లో, ప్రత్యేక సంచికల్లో  ప్రచురింప బడ్డాయి. అందులో కొన్ని కథలు హిందీ, కన్నడ, ఒరియా, ఆంగ్ల భాషల్లోకి అనువదింపబడ్డాయి.  ఒక్కక్షణం (1983), చుక్కలసీమ(1985), వేలుగువాకిట్లోకి...(2003), ఉజాలే కీ ఓర్ (హిందీ అనువాదం -2017) కథా సంకలనాలు వెలువడ్డాయి. రంగస్థల ప్రదర్శన కోసం, రేడియో కోసం రాసిన లంచం, కాలధర్మం, కర్మసాక్షి, మీరజాలగలడా, అతనికి అటూ ఇటూ (పురుష పాత్ర లేని నాటిక), ప్రియమైనశత్రువు, సంధ్యారాగం, మొదలగు నాటికా/నాటకాలకు అవార్డులు, రివార్డులతోపాటు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర/జాతీయ స్థాయిలో అనేక పరిషత్తులలో ఉత్తమ రచనగా బహుమతులు గెల్చుకున్న కాలధర్మం’ నాటిక 1990వ  సంవత్సరం అఖిల భారత తెలుగు మహాసభలు (బెంగుళూరు)లో ప్రదర్శింపబడింది. 1989వ సంవత్సరం  తెలుగు
కళాసాగర్ అవార్డును అందుకుంటూ శ్రీరాజ్
విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందిన
కాలధర్మం’ నాటిక కలికాలం’  పేరుతో చలనచిత్రంగా తెరకెక్కింది. తమిళం, కన్నడం, ఒరియా, బెంగాలి, మరాఠీ భాషల్లో రీమేక్ సినిమాగా రూపుదిద్దుకుంది. చలనచిత్ర రచయితగా కలికాలం, సూరిగాడు, ప్రేమించు, తపస్సు, అక్కా బాగున్నావా , మొదలగు సినిమాలకు రచన చేశారు. ప్రేమించు (డా.డి.రామానాయుడు గారు) సినిమాకి 2002 సం.లో  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది అందుకున్నారు. సూరిగాడు సినిమా చైనా ఫిలిం ఫెస్టివల్ కి, ఇండియన్ పనోరమాకి ఎన్నికైంది. తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారం, మద్రాస్ కళాసాగర్ అవార్డ్స్, వంశీ బర్కిలీ అవార్డ్, సౌత్ ఇండియన్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డ్స్ ... ఇలా చాలా పురస్కారాలు కథలకు, నాటకాలకు, సినిమాలకు అందుకున్నారు.

శ్రీరాజ్ సాహితీ మాగాణంలో

కథలు:

S.No.
Title
Publishe in
Date of Issue
01.
నెలపొడుపు
ప్రగతి సచిత్ర వారపత్రిక                          
16.01.1970
02.
లాస్ట్ కేస్                                  
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
28.10.1970
03.
బుచ్చిబాబు భ్రమ                        
కథాంజలి (దీపావళి ప్రత్యేక సంచిక )
Nov.   1970
04.
కల్పన  
ప్రగతి సచిత్ర వారపత్రిక 
26.03.1971
05.
మరోసారోకథ  
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
03.05.1972
06.
ముగింపుకథ 
జ్యోతి మాసపత్రిక
May,  1972
07.
నీలితెర
ప్రగతి సచిత్ర వారపత్రిక
25.08.1972
08.
సమర్ధుడు     
జ్యోతి మాసపత్రిక
Oct.    1972
09.
మరోసారాకథ     
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
04.04.1973
10.
చిరుదీపం 
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
18.04.1973
11.
ఫస్ట్ లవ్                                               
జ్యోతి మాసపత్రిక
April,  1973
12.
కెరటం 
ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక
23.11.1973
13.
గ్రహణం
జ్యోతి మాసపత్రిక
April,  1974
14.
బడబాగ్ని 
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
16.01.1974
15.
ఒప్పందం
యువ మాసపత్రిక
Aug.    1974
16.
అమ్మదేవుడోయ్   
A.U.మేగజైన్
Sept.   1974
17.
మృత్యువు
జ్యోతి దీపావళి ప్రత్యెక సంచిక
Special  ’74
18.
కాగితంపూలు
యువ మాసపత్రిక
Jan.     1975
19.
భూతం
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
03.09.1975
 20.
శ్రీమతి
ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక
10.10.1975
 21.
చిన్నారి
ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక
30.07.1976
22.
ఇది ఉన్నవాళ్ళకథ
జ్యోతి మాసపత్రిక
Sept.  1976
23.
ది హీరోయిన్
యువ మాసపత్రిక
Feb.   1977
24.
కేర్ ఫ్రీ బర్డ్
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
16.02.1977
25.
ఒక్కక్షణం
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
24.05.1978
26.
సృష్టికిరణాలు
యువ దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘78
27.
రాగం మారిన పాట
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
06.12.1978
28.
గ్రేట్మెన్థింకెలైక్
జ్యోతి మాసపత్రిక
Feb.    1979
29.
చుక్కలసీమ వెనుక
ఆనందజ్యోతి సచిత్ర వారపత్రిక
14.05.1979
30.
డయబాలికల్లీ యువర్స్
యువ దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘79
31.
దేవుడూ శత్రువే
యువ మాసపత్రిక
May,   1980
32.
అలివేలూ! నీకుజోహారు 
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
14.05.1980
33.
ఆదర్శంలో అనర్ధం 
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
03.09.1980
34.
కన్నీరు తుడవకపోతే మానె
కనీసం నవ్వకు 
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక
17.09.1980
35.
కొత్త కెరటం
యువ దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘80
36.
జైలు
పుస్తక ప్రపంచం
May,   1981
37.
స్పృహ
పుస్తక ప్రపంచం
July,    1981 
38.
సింహాసనం
యువ దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘81
39.
నీటిబిందువు
జ్యోతి దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘81
40.
జబ్బు
ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక
01.04.1982
41.
అతిధిదేవుడు
యువ దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘82
42.
దివంగతుడు
యువ మాసపత్రిక
Aug.   1983
43.
కూలి
యువ దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘83
44.
వాలుపొద్దు
యువ దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘84
45.
ఆలంబన
యువ దీపావళి ప్రత్యెక సంచిక
Special  ‘85
46.
మందాకిని 
స్వాతి మాసపత్రిక
Jan.    1987
47.
ముడుపులు
ఆంధ్రభూమి మాసపత్రిక
Jan.    1987
48.
సరస
ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక
15.10.1987
49.
ఒక తమ్ముడు
ఆంధ్రభూమి మాసపత్రిక
May,   1988
50.
దూరం
ఉదయం వీక్లీ  
14.07.1988
51.
ఆగష్టు 2047
జ్యోతి మాసపత్రిక
June,   1989
52.
టచ్మీనాట్స్
జ్యోతి ఉగాది ప్రత్యెక సంచిక
March1990
53.
ఆటదీవి
సిబియమ్ హైస్కూల్ మేగజైన్ 
1960-61
54.
సుధామధులు
సిబియమ్ హైస్కూల్ మేగజైన్ 
1961-62
55.
చెదరినమబ్బులు
సిబియమ్ హైస్కూల్ మేగజైన్ 
1962-63
56.
సెంచరీమారింది
బి.హెచ్.పి.వి.కంపెనీ జర్నల్
జనవరి-మార్చి 1973  
                 
కవితలు:

01.
మధ్యతరగతిమనిషి
కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ జర్నల్    

02.
20వ శతాబ్దపు ఉద్యోగం
ఉజ్వలభాను డైలీ విశాఖపట్నం
24.12. 1970 
03.
దేవుడు-మనిషి
A.U.మేగజైన్
సెప్టెంబర్ 1974 
04.
అమ్మ
ఉదయభాను బై వీక్లీ

05.
క్రాంతీ!..సంక్రాంతీ !
ఆకాశవాణి, విశాఖపట్నం


రేడియో నాటిక/నాటకాలు:

01.
లంచం
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం
1976
02.
అమ్మదేవుడోయ్
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం
1976
03.
రెక్కలోచ్చిన పిల్లలు
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం
1982
04.
అతిధిదేవుడు
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం
14.01.84
05.
వరమీయనివేల్పు
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం
08.04.84
06.
కొత్త చిగురు
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం
01.01.84
07.
సలహాఖరీదు
ఆకాశవాణి, హైదరాబాద్
04.04.87
08.
కాలధర్మం
ఆకాశవాణి అన్ని కేంద్రాలు
19.12.85
09.
మీరజాలగలడా
ఆకాశవాణి అన్ని కేంద్రాలు
30.08.87
10.
సంధ్యారాగం
ఆకాశవాణి అన్ని కేంద్రాలు
29.03.90
11.
బూచాడమ్మా ..బూచాడు 
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం

12.
చీకట్లో మనిషి
ఆకాశవాణి అన్ని కేంద్రాలు

13.
ఆయుష్మానుభవ
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం

14.
కర్మసాక్షి
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం

15.
స్నేహం
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం
07.06.95
16.
ప్రేమలేఖ
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం )
24.03.87
17.
లంచం
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం )
31.03.87
18.
సమ్మె
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం)
14.04.87
19.
పెళ్లిరోజు
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం)
21.04.87
20.
నటన
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం)
07.07.87
21.
రచన
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం)
10.11.87
22.
ప్రేమించే హృదయం
లోకం పోకడ (AIR, విశాఖ కేంద్రం)
01.06.88
23.
సమర్ధుడు
లోకం పోకడ (AIR, విశాఖ కేంద్రం)
14.06.88
24.
అతనిజబ్బు
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)

25.
రా(జ)కీయం
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
11.04.89
26.
కుడిఎడమైతే....
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)

27.
బజారుమనిషి
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
14.03.89
28.
ఆఒక్కటీ తప్ప
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)

29.
ఏ లవ్లీ గిఫ్ట్
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
04.04.89
30.
కలగలుపు
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
21.03.89
31.
మంచిలాభం
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)

32.
స్వీయచరిత్ర
జంఘాలశాస్త్రి సాక్షి (AIR, విశాఖ కేంద్రం)

33.
భరతమాత పీఠం
జంఘాలశాస్త్రి సాక్షి (AIR, విశాఖ కేంద్రం)

34.
పేర్ల అన్వేషణ 
జంఘాలశాస్త్రి సాక్షి (AIR, విశాఖ కేంద్రం)

35.
పూర్వకాలపు నీతి
జంఘాలశాస్త్రి సాక్షి (AIR, విశాఖ కేంద్రం)

36.
అదీసంగతి (13-episode serial)
ఆకాశవాణి  విశాఖపట్నం  కేంద్రం
 From 07.06.85


(ప్రతి మంగళవారం  ఉదయం 7.45-8.00)


స్టేజి నాటిక/నాటకాలు:

01.
లంచం(నాటిక) :


      
ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక  రెండు సంచికల్లో (20.08.1975 & 27.08.1975) ప్రచురింపబడింది. రచయిత అనుమతితో తొలిప్రదర్శన 1976 సం.లో హిందుస్తాన్ షిప్ యార్డ్, రిక్రియేషన్ క్లబ్, గాంధీగ్రాం(విశాఖ) వారు శ్రీ పోలిరాజు గారి దర్శకత్వంలో ప్రదర్శించారు. మలి ప్రదర్శనలుగా ఇండియన్ నేషనల్ ధియేటర్ వారు హైదరాబాద్ రవీంద్రభారతిలో, మద్రాస్ ఇనస్పెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ స్టాఫ్ చెన్నయ్ లో ప్రదర్శించారు. రాష్ట్రం/రాష్ట్రేతర ప్రాంతాల్లో పరిషత్తులు/సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శింపబడింది. ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది.

02.
సారాయి తాగిన పావురాయి :

           
అనాధబాలల సహాయార్ధం ప్రేమసమాజం, సాంస్కృతిక బృందం, విశాఖపట్నం వారు  1977  సం. శ్రీ డబ్బీరు రమా కాంతారావు మాస్టారు దర్శకత్వంలో  విశాఖ జిల్లా పలుచోట్ల  ప్రదర్శించారు.

03.
కాలధర్మం (నాటిక) :

          
శ్రీ ఎస్.కె.మిశ్రో గారి దర్శకత్వం లో బహురూప నట సమాఖ్య , విశాఖపట్నం వారు 11.04.1986 న ఒక పరిషత్ లో పాల్గొని, ఉత్తమ రచన, ప్రదర్శన బహుమతులు గెల్చుకున్నారు. రాష్ట్ర/రాష్ట్రేతర ప్రాంతాల్లో నిర్వహించిన అనేక పరిషత్తులు/సాంస్కృతిక వేడుకల్లో వందకు పైగా ప్రదర్సనలు ఇచ్చారు.

కొన్ని ప్రత్యేకతలు:
1) బెంగుళూరులో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభల్లో 11.03.1990న ప్రదర్శించ బడింది.
2) తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం 1989 కాలధర్మం నాటికను  ఉత్తమ రచనగా ప్రకటించ బడింది. తే.17.04.1990 A.P.గవర్నర్ కృష్ణకాంత్ గారి నుంచి రచయిత సాహితీ పురస్కారం అందుకున్నారు.     
3) కలికాలం పేరుతో 30.05.1991న చలనచిత్రంగా విడుదల కావడం ...తమిళ, కన్నడ, మరాఠీ, ఒరియా మరియు బెంగాలి భాషల్లో రీమేక్ సినిమాగా రూపుదిద్దుకుంది. 
4) తెలుగు  నాటికా వైభవం (నూరేళ్ళ నాటికకు నీరాజనం) సందర్బంగా విజయవాడ శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో 18.12.2010 న బహురూప నట సమాఖ్య (old team) సభ్యులచే ప్రత్యేక  ప్రదర్శన ఇవ్వబడింది.
5)  ఆకాశవాణి అన్ని కేంద్రాల నుంచి పలుమార్లు   ప్రసారం పొందటం 

04.             
.
మీరజాలగలడా (నాటిక) :

           
కాకినాడ శ్రీ లలిత కళామందిర్ లో 04.08.1987 న ఆకాశవాణి, విశాఖపట్నం కల్చరల్ అసోసియేషన్ వారు శ్రీ సి.వి.సూర్యనారాయణ గారి దర్శకత్వంలో  తొలిసారి ప్రదర్శించారు. మలి ప్రదర్శన మద్రాసు కళాసాగర్ ఆహ్వానం పై తెలుగు సినీ ప్రముఖుల సమక్షం లో రాజా అణామలై హాలులో 15.11.1987 న ఇచ్చారు. ప్రత్యేక త్రై మాసిక నాటక విభాగం లో ఆకాశవాణి విశాఖపట్నం నుంచి అన్ని కేంద్రాలకు రిలే చేయబడినది.

05.
కర్మసాక్షి (నాటిక) :


విశాఖ కళాభారతి  ఆడిటోరియంలో R.K. ప్రొడక్షన్ వారు  శ్రీ K.మందులు దర్శకత్వం లో 08.02.2000 న తొలి ప్రదర్శన ఇచ్చారు. నంది నాటక సప్తాహం-1999  పోటీల్లో తే.22.05.2000 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ప్రదర్శించినప్పుడు దర్శకుడు కె.మందులు ఉత్తమనటుడు నంది అవార్డు అందుకున్నారు. ఈ నాటిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది.

06.
బూచాడమ్మా!..బూచాడు (నాటిక):


కళాస్రవంతి విశాఖ టెలికాం సభ్యులు శ్రీ ఎల్.సత్యానంద్ దర్శకత్వం లో మొదటిసారి టెలికాం దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం Central Telegraph Office  ప్రాంగణం లో ప్రదర్శించారు. విశాఖపట్నం ఆలిండియా రేడియో  ద్వారా ప్రసారమైంది.

07.
ప్రియమైన శత్రువు (నాటిక):


శ్రీ కె.కృష్ణచైతన్య దర్శకత్వం లో ప్రదర్శించ బడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారమైంది. ఈ నాటిక చిత్ర తెలుగు మాస పత్రిక ( May, 2011) ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది.

08.
సంధ్యారాగం  (నాటకం) :


ప్రదర్శన వివరాలు లభించలేదు. శ్రీ C.V. సూర్యనారాయణ(PEx.All India Radio) పర్యవేక్షణ లో   ప్రత్యేక త్రై మాసిక నాటకంగా ఆకాశవాణి విశాఖపట్నం  నుంచి అన్ని కేంద్రాలకు రిలే చేయబడింది .

09.
నాన్నా!విన్నావా?(నాటిక) :
 బడి గంటలు (హాస్య సందేశాత్మక నాటికలు) అక్టోబర్ 2013

ప్రదర్శన వివరాలు తెలియవు. శ్రీ వల్లూరు శివప్రసాద్ & శ్రీ గంగోత్రి సాయి సంపాదకత్వంలో పిల్లల హాస్య సందేశాత్మక నాటికల సంకలనంలో (అక్టోబర్ 2013) ప్రచురింపబడింది.

10.
అతనికి అటూ ఇటూ (నాటిక) :
 (పురుష పాత్ర లేని నాటిక ) నవంబర్ -2016  

అరవింద ఆర్ట్స్, తాడేపల్లి (గుంటూరు) బృందం శ్రీ గంగోత్రి సాయి దర్శకత్వంలో 2017 నంది నాటకోత్సవాల్లో ప్రదర్శింప బడింది. ఇంకా పలుచోట్ల ప్రదర్శనలు జరుపుకుంటుంది.

సినిమాలు :        

      S.No.
Title.
Script.
Producer/Banner.               
Director.
Released on
01.
కలికాలం(తెలుగు)
కథ
J.S.K. కంబైన్స్              
ముత్యాల సుబ్బయ్య  
30.05.1991
02.
సూరిగాడు (తెలుగు)
కథ,మాటలు 
డి.రామానాయుడు
దాసరి నారాయణరావు   
17.04.1992
03.
కలిగాలం (అరవం)
(రీమెక్ ఆఫ్ కలికాలం)
కథ
రాధిక (Film Star)
పంజు అరుణా చలం
May,  1992
04.
అత్తకు కొడుకు
మామకు అల్లుడు (తెలుగు)
కథ
మిద్దె రామారావు
P.N.రామచంద్రరావు
09.01.1993
05.
మామ-కోడలు
మాటలు
శ్రీ ధనలక్ష్మి మూవీస్
దాసరి నారాయణరావు
02.04.1993
06.
అప్పలీ మానస (మరాఠీ)
(రీమెక్ ఆఫ్ కలికాలం)
కథ
సుయోజ్ చిత్ర
సంజయ్ సూర్ కర్
June,  1993
07.
కుంకుమభాగ్య (కన్నడం)
(రీమెక్ ఆఫ్ కలికాలం)
కథ
శ్రీ ధనలక్ష్మి క్రియేషన్స్
బోయిన సుబ్బారావు
October,93
08.
సంతాన్ (హిందీ)
(రీమెక్ ఆఫ్ సూరిగాడు )
కథ
సురేష్ ప్రొడక్షన్స్  
దాసరి  నారాయణరావు
12.11.1993
09.
పోలీసు ఆఫీసర్ (తమిళం)
(అ.కొదుకు మా.అల్లుడు డబ్బింగ్ )
కథ
శ్రీ రాజ్యలక్ష్మి ప్రొడక్టన్స్
P.N.రామచంద్రరావు
July,   1993
10.
వాచ్ మేన్ వడివేలు(అరవం)
(రీమెక్ ఆఫ్ సూరిగాడు )       
కథ
ఆర్.కె.ఫిలిం మేకర్స్
A. జగన్నాథ్
24.07.1994
11.
వెన్నెల (తెలుగు)
కథ,మాటలు
శ్రీదేవి ప్రొడక్షన్స్
S.T. రాజా
May,   1994

12.
అంటీచూరీ తొంటీకట్టే(ఒరియా)
(రీమెక్ ఆఫ్ కలికాలం)
కథ
చంచల్ ఆర్ట్స్
బసంత్ సాహు
Dec.    1993
13.
కలికాల్ (బెంగాలి)
(రీమెక్ ఆఫ్ కలికాలం)
కథ
A. పూర్ణ చంద్ర రావు

           1993
14.
తపస్సు (తెలుగు)
మాటలు
శ్రీ శ్రుతిలయా ఆర్ట్స్
భరత్
02.02.1995
15.
అక్కా బాగున్నావా(తెలుగు)
మాటలు
నేషనల్ ఆర్ట్ మూవీస్
మౌళి
Sept.   1997
16.
స్పీడ్ డాన్సర్ (తెలుగు)
మాటలు
T.V.D. ప్రసాద్
ముప్పలనేని శివ
17.06.1999
17.   
ప్రేమించు (తెలుగు)
కథ
డి.రామానాయుడు
బోయిన సుబ్బారావు
11.04.2001
18.
మాజీ ఆయీ (మరాఠీ)
(రీమెక్ ఆఫ్ ప్రేమించు )
కథ
సురేష్ మూవీస్
దేవికా పటోడా(ఆర్టిస్ట్ )
సుభోద్ భావే (ఆర్టిస్ట్ )
            2008

టెలివిజన్ స్క్రిప్ట్స్


01.
స్నేహ (13 Episodes)
కథ మాటలు 
ఈనాడు టెలివిజన్ 
P. సాంబశివరావు 
29.08.95  to
28.11.95
02.   
రాగం మారిన పాట
కథ
దూరదర్శన్ హై’బాద్
S.K. మిశ్రో 

03.
మందాకినీ
కథ
దూరదర్శన్ హై’బాద్
S.K. మిశ్రో 


ఇతర రచనలు  :

01.
మనసున్న మంచి మనిషి – అంగర సూర్యారావు(వ్యాసం)  
A.U.ధియేటర్ ఆర్ట్స్ మేగజైన్
02.
మట్టిమనిషి- వాసిరెడ్డి సీతాదేవి నవల (సమీక్ష)
ఆకాశవాణి విశాఖ కేంద్రం
03.
బ్లాక్ మెయిల్  రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు- విశాఖపట్నం పాఠకులతో ముఖాముఖి ...
ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక (07.05.1987) 
04.
అచ్చయిన నా మొదటి పుస్తకం – లంచం
ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక (26.07.1985)  
05.
అగ్గిపుల్ల చెప్పిన కథ (ఆదూరి వెంకట సీతారామ మూర్తి)
ఒకమాట (అభిప్రాయం )
06.
వర్ణచిత్రం (ఆదూరి వెంకట సీతారామ మూర్తి కథల సంపుటి)
ఒక ప్రశంస   
07.
స్ఫూర్తి (వ్యాసం ... కృష్ణ చైతన్య కోసం )
బహురూప నట సమఖ్య  సావనీర్
08.
తీపిగురుతు (ఆదూరి వెంకట సీతారామ మూర్తి -నవల)
నవల మీద అభిప్రాయం
09.
చిరంజీవి కట్టా (కాగడాలు నాటిక )
నాటికపై కొన్ని మాటలు
10.
 త్రివిక్రముడు (వ్యాసం  )
రావూజీ –రావూజీ రంగస్థల వైభవం
11.
హరిత (నాటిక) ... యస్సేరావ్
రచయిత- నాటిక పై అభిప్రాయం
12.
నాకు నచ్చిన నాకథ (ఒక్కక్షణం )
యువ మాస పత్రిక
13.
నూరేళ్ళ కథకి నవ్యనీరాజనం – 94
నవ్య వీక్లీ (26.01.2011)
14.
అప్పారావు గారి ఆశయం (కథానిక)
ఆలిండియా రేడియో విశాఖ కేంద్రం 
15.
సాహితీ మేఖల (జైలు)
ఆకాశవాణి, విశాఖపట్నం (07.10.84)
16.
క్రాంతీ!...సంక్రాంతీ!...
ఆకాశవాణి, విశాఖపట్నం (14.01.71)
17.
ఒక్కక్షణం – శ్రీరాజ్ కథలు  (సమీక్ష )
ఆకాశవాణి, విశాఖపట్నం (25.09.85)
18.
దివంగతుడు (కథ ) – వంశీ కి నచ్చిన కథలు 
నవోదయ ప్రచురణ హైదరాబాద్(డిసెంబర్ 2009)  
19.
కాలధర్మం (నాటిక) -  ప్రసిద్ధ తెలుగు నాటికలు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ(జనవరి-11) 
 20.    
లాస్ట్ కేస్ (కధ) – ఉత్తరాంధ్ర కధలు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ(జూలై2014) 
21.
వెలుగు వాకిట్లోకి...(కధ)- తెలుగు కధా పారిజాతాలు
రమ్య సాహితీ సమితి, పెనుగొండ(నవంబర్ 2012)    
22.
కాలధర్మం(నాటిక) – బహురూప నాటికలు             
బహురూప నట సమాఖ్య,విశాఖ (సెప్టెంబర్ 2009)
23.
నాన్నా! విన్నావా?(లఘు నాటిక)
బడి గంటలు (నాటికల సంపుటి) అక్టోబర్-2013 

అనువాదాలు :

01.
సింహాసనం(యువ దీపావళి)  
Chessman(ఇంగ్లీష్ )
ఆంధ్రసంఘం, కలకత్తా వార్షిక సంచిక  
02.
లాస్ట్ కేస్ (ఆంధ్రప్రభ వీక్లీ)
ది లాస్ట్ కేస్ (కన్నడం)
తరంగ వీక్లీ (కన్నడం)
03.
లాస్ట్ కేస్ (ఆంధ్రప్రభ వీక్లీ)
The Lost Case(ఇంగ్లీష్ )
The Palette (Short Stories Translated from Telugu)
04.
రాగంమారిన పాట(ఆంధ్రప్రభ) 
రాగ-అనురాగ (ఒరియా)
ఒరియా వార పత్రిక
05.
రాగంమారిన పాట(ఆంధ్రప్రభ)
రాగ-అనురాగ (ఒరియా)
ఒరియా(తెలుగు అనువాదకథలు) సంపుటి  


ప్రచురణలు :

01.
లంచం (నాటిక)
శ్రీ రామా బుక్ డిపో , విజయవాడ 
1979   
02.
ఒక్క క్షణం (శ్రీరాజ్ కథలు)
శ్రీ మహాలక్ష్మి బుక్ పబ్లికేషన్స్ , విజయవాడ
1983
03.
చుక్కలసీమ (కథా సంకలనం)
శ్రీ మహాలక్ష్మి బుక్ పబ్లికేషన్స్ , విజయవాడ
1985
04.
కాలధర్మం (నాటిక )
అరుణా పబ్లిషింగ్ హౌస్ , విజయవాడ
1990
05.
వెలుగు వాకిట్లోకి...(Anthology of
                        Short stories)
వాహిని బుక్ ట్రస్ట్,  హైదరాబాద్ 
2003

  06.
వెలుగు వాకిట్లోకి...(Anthology of
                        Short stories)
కినిగె.కామ్
E-edition                                            
2015


07.   
ఉజాలే కీ ఓర్ (Hindi translation of వెలుగు వాకిట్లోకి..కదల సంపుటి)
గీతా  పబ్లిషర్స్,  హైదరాబాదు
2017 
08.
ఉజాలే కీ ఓర్ (Hindi translation of వెలుగు వాకిట్లోకి..కదల సంపుటి)
కినిగె.కామ్
E-edition                                           
 Feb 2017
      

     చిరునామా: Sriraj ( Playwright, Short story & Film Script writer ), # 302, Empire Estates,
Opp: NBM Law College,   Gokhale Road,   Visakhapatnam-530 002. (AP)  Mobile:  9440105105  

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు